గోచారంలో లగ్నంతో సంబంధం

గోచారంలో లగ్నంతో సంబంధం ఎప్పుడు వస్తుంది. గోచారం అనేది చంద్ర రాసినుంచి చూడమని నిక్కచ్చిగా చెప్పేశారు. మరి లగ్నం అనేటువంటి దానిని పరిగణలోకి ఎందుకు తీసుకోవాలి.

ఉదాహరణకు....
గోచారం అనుసరించి ఏలినాటి, అష్టమ, అర్థాష్టమ శని మరియు అష్టమ, అర్థాష్టమ గురువులు ఎంతప్రమాదకారులు అవుతారు? అనే విషయాన్ని నిర్ధారించుకోవటానికి జన్మలగ్నానికి శని లేదా గురువు శుభాధిపత్యం కలిగి ఉన్నారా? పాపాధిపత్యం కలిగి ఉన్నారా? అని చూచుకొని నిర్ణయించవచ్చు. 

లగ్నాత్ శుభాధిపత్యం కలిగిన శని గురువులు గోచారరీత్యా కొంత తక్కువగా ఇబ్బంది పెడతారు. అదే పాపాధిపత్యాన్ని కలిగినట్లైతే బాగా ఇబ్బంది పెడతారు.

గోచారం నుండి చంద్ర లగ్నం నుండి చూసినా లగ్నాత్ చంద్రుడు ఏ ఆధిపత్యం లో ఉన్నాడో అది ఖచ్చితంగా తెలియాలి అది తెలీకుండా ఉత్త గోచారం నుంచి చూస్తే ఫలితం ఏముంటుంది పైగా దశా అంతర్దశలో లగ్నం నుండి ఆధిపత్యం ఫలితం ఉంటుంది చూసి దానికి గోచారం ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందా లేదా అనేది చూడాలి ఉదాహరణకు లగ్నం నుండి 9 వ ఆధిపత్య గ్రహం 2లో ఉంటే సంపాదన అదే 12 లో ఉంటే 2లో సంపాదించిన ధనం 12లో కర్చు అంటే అది హాస్పిటల్ అయినా లేక విదేశీ యానం అయినా లగ్న సంబంధం లేకుండా ఉంటే ఆ ఫలితం రాదు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: