శింశుమార చక్రం ప్రకారం

1.కాగితం మీద మాత్రమే చంద్రుడు భూమి చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో భూమి కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, సూర్యుడి చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది. అంటే విశ్వంలోని చుట్టు చంద్రుడి యొక్క కక్ష్య సర్పిలం. 
2.కాగితం మీద మాత్రమే భూమి సూర్యుడి చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో సూర్యుడు కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, బృహత్తార చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నాడు. అంటే విశ్వంలోని భూమి యొక్క కక్ష్య సర్పిలం. 3.కాగితం మీద మాత్రమే సూర్యుడు బృహత్తార చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో బృహత్తార కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, పాలపుంత కేంద్రం చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది. అంటే విశ్వంలోని చుట్టు సూర్యుడి యొక్క కక్ష్య సర్పిలం. 4.కాగితం మీద మాత్రమే బృహత్తార పాలపుంత కేంద్రం చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో పాలపుంత కేంద్రం కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, విశ్వపు కేంద్రం చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది. అంటే విశ్వంలోని పాలపుంత కేంద్రం యొక్క కక్ష్య సర్పిలం. ఇప్పటికి విశ్వం యొక్క కేంద్రం చుట్టూ మనమున్న పాలపుంత ఏర్పరుస్తున్న వలయం ఒకటీ దీని చుట్టూ బృహత్తార భ్రమణం ఏర్పరుస్తున్న సర్పిలం ఒకటీ దీని చుట్టూ ఏర్పడిన సూర్యగమన సర్పిలం ఒకటీ దీని చుట్టూ ఏర్పడిన భూభ్రమణ సర్పిలం ఒకటీ మళ్ళీ దీని చుట్టూ ఏర్పడిన చంద్రగమన సర్పిలం ఒకటీ అనే moon->earth->sun->star->milkyway->universe అనే అయిదు అంతరువుల చలనాలు నమోదు అయ్యాయి. సూర్యుడి చుట్టూ భూమి కాక ఇంకా కొన్ని గ్రహాలు తిరుగుతున్నప్పుడు వాటి సర్పిలాల్ని కూడా కలపాలి.

అసలు పైన చెప్పిన అయిదు అంతరువుల సర్పిలాల మధ్యన ఇరుక్కుని తన చుట్టూ తాను తిరుగుతూ కదులుతున్న భూమి మీద నుంచి చూస్తే ధృవనక్షత్రం ఒక్కచోటనే కనిపించాలంటే అది ఎక్కడ వుండాలి? చెన్నై అనే చోటు నుంచి చూస్తేనూ భాగ్యనగరం అనే చోటు నుంచి చూస్తేనూ అమరావతి అనే చోటు నుంచి చూస్తేనూ ధృవనక్షత్రం ఒకేచోట కనబడటం లేదు, కానీ చెన్నై అనే చోటు నుంచి చూస్తే ఎప్పుడూ ఒకే చోట కనిపిస్తున్నది. ఈ చెన్నై అనే బిందువు భూమి కేంద్రం నుంచి భూమి వ్యాసార్ధపు దూరంలో ఉండి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నప్పటికీ ధృవనక్షత్రం మాత్రం ఒకే చోట కనబడటం ఎట్లా సాధ్యం?
ఈ చెన్నై అనే బిందువు భూమి కేంద్రం నుంచి భూమి వ్యాసార్ధపు దూరంలో ఉండి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు చెన్నై తన స్థానాన్ని మార్చుకుంటున్నప్పటికీ ధృవనక్షత్రం మాత్రం ఒకే చోట కనబడాలంటే ధృవనక్షత్రం కూడా చెన్నై అనే చోటు నుంచి చూస్తే ఎప్పుడూ ఒకే చోట కనిపించేలా భూమితో పాటు తిరగాలి కదా!
..
విశ్వాక్షం నుంచి చంద్రుడి వరకు నాలుగు అంతరువుల బొంగరాలు రింగు రింగు మని తిరుగుతున్న మొత్తం దృశ్యంలో ధృవనక్షత్రం ఆయా గ్రహాలతోనూ నక్షత్రాలతోనూ ఎంత దూరంలో ఎంత కోణంలో ఉంటే "భూమిమీద ఎక్కడ నుంచుని తల పైకెత్తి చూసినా సంవత్సరం పొడుగునా ఒకే చోట కనిపించడం" సాధ్యపడుతుంది అనేది పట్టించుకోవాల్సిన అనవసరం లేనంత చిన్న విషయమా!

ఆ రెండు ప్రయోగాల్నీ సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయాల్లో చేసి Foucault Pendulum అలా తిరగడానికీ Compton tube లోని రేణువులు అలా కదలడానికీ భూమి తన చుట్టు తను తిరగడం అనేది కారణం అని నిర్ధారించినప్పటికీ భాగవత పురాణంలోని శింశుమార చక్రం వర్ణనకు పెద్ద లోపం రాదు గానీ సూర్యకేంద్రక వాదంలోని ధృవనక్షత్రం భూమిమీద ఎక్కడ నుంచుని తల పైకెత్తి చూసినా సంవత్సరం పొడుగునా ఒకే చోట కనిపించడం గురించి పట్టించుకోకపోవడం అనే లోపం మాత్రం మిగిలే ఉంటుంది.

ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమే కాక వైదిక సాహిత్యంలోని కూర్మపురాణం వంటి పురాణాలూ సూర్యసిద్ధాంతిక వంటి శాస్త్రగ్రంధాలూ తన చుట్టూ తిరుగుతున్న చంద్రుడితో సహా భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్లనే భూమి మీద జరుగుతున్న సూర్యోదయమూ సూర్యాస్తమయమూ ఋతువులూ వంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్తున్నాయి కానీ మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం వంటివి శింశుమార చక్రం ప్రకారం కాలాన్ని నిర్వచించి పధ్నాలుగు లోకాల విరాట్పురుష నిర్మాణం ప్రకారం విశ్వాన్ని చూపిస్తున్నాయి. కాల నిర్ణయానికి అవసరమైన ఏడు గ్రహాలకూ భూమి నుంచి దూరాలు ఇలా ఉన్నాయి: చంద్రగ్రహం(Moon) భూమినుంచి 384,400 Km దూరాన ఉంది. శుక్రగ్రహం(Venus) భూమినుంచి 41,400,000 Km దూరాన ఉంది. కుజగ్రహం(Mars) భూమినుంచి 78,340,000 Km దూరాన ఉంది. బుధగ్రహం(Mercury) భూమినుంచి 91,691,000 Km దూరాన ఉంది. సూర్యగ్రహం(Sun) భూమినుంచి 149,600,000 Km దూరాన ఉంది. గురుగ్రహం(Jupiter) భూమినుంచి 628,730,000 Km దూరాన ఉంది. శనిగ్రహం(Saturn) భూమినుంచి 1,275,000,000 Km దూరాన ఉంది. వీటన్నిటిని తనచుట్టు తిప్పుకుంటున్న ధృవనక్షత్రం భూమినుంచి 434 light-years దూరాన ఉంది. ఇది సూర్యగ్రహం కన్న 4000 రెట్లు కాంతివంతమైనది గనకనే అంత దూరంలో ఉండి కూడా కంటికి కనబడుతున్నది! ఈ ధృవనక్షత్రం యొక్క ఖగోళ శాస్త్ర సంబంధమైన సాంకేతిక విషయాలనే ధృవోపాఖ్యానం కధన రూపంలో చెప్తుంది.
....
శింశుమార స్వరూపం మూడు రకాల నిర్మితులను చూపిస్తుంది. మనం తల పైకెత్తి చూసినప్పుడు వేర్వేరు దూరాలలో ఉన్న నక్షత్ర సమూహాలూ గ్రహాలూ అన్నీ ఒక సమతలం మీద ఉన్నట్టు గోచరించేది చక్ర స్వరూపం. శ్రీమహావిష్ణువు యొక్క అయిదు ఆయుధాలలోని సుదర్శనం ఇదే! శింశుమారం యొక్క పూర్తి స్వరూపాన్ని ఒకేసారి అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు. మొదట ఈ చక్ర రూపాన్ని సదా ధ్యానించి అనుసంధానం చేసుకున్నాక జ్ఞానాన్ని మరికొంచెం విస్తృతం చేసి చూస్తే ఆయా గ్రహతారకలు వేర్వేరు తలాలలో ఉన్నట్లు గోచరిస్తుంది. ఇప్పుడు వీటిని ధృవనక్షత్రం చుట్టు తిప్పుతున్న అదృశ్య వాయతంత్రులను చూడగలిగితే అది శంఖు రూపం అవుతుంది. ఇంగ్లీషులో దీన్ని chandelier అంటారు, సంస్కృతంలో దీపవృక్షం(दीपवृक्षः) అని అంటారు. ఇప్పుడు ఈ శంఖ రూపాన్ని సదా ధ్యానించి అనుసంధానం చేసుకున్నాక జ్ఞానాన్ని మరికొంచెం విస్తృతం చేసి చూస్తే ఆయా గ్రహతారకలు కేవలం ధృవనక్షత్రం నుంచియే గాక వాటితో అవి వాయుతంత్రులతో అనుసంధానించబడి స్థిరమైన దూరాలలో ఉండి ధృవనక్షత్రం చుట్టు తిరుగుతున్నట్టు గోచరిస్తుంది. ధృవనక్షత్రం తోక చివరి కొసను అంటిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తున్న మీనాకృతియే శింశుమారం యొక్క అసలైన స్వరూపం.

ఇప్పుడు చెప్పండి, భూమి తనచుట్టు తను తిరగడం నిజమా?

P.S:ఈ వెతుకులాటలో నాకొక సొంత ప్రయోజనం సమకూరింది. శింశుమార చక్రం గురించి నాకు తెలిసిన సమాచారంతో నేనొక augmented reality app తయారు చేద్దామనుకుంటున్నాను. భూమికీ ధృవనక్షత్రానికీ మధ్య ఉన్న అక్షాన్ని చూపిస్తూ భూమినుంచి సూర్యుడూ చంద్రుడూ ఉన్న దూరాల్నీ వాటి కక్ష్యల్నీ మన కంటికి కనబడే సరైన నిష్పత్తిలోకి తెచ్చి చూపిస్తాను.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: