మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి

సనక సనందనాది మహర్షులు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం కైలాసానికి వెళ్తారు, అక్కడ పార్వతీ దేవి ఒడిలో కూర్చున్న బాలుడైన కుమార స్వామి ఆ మహర్షుల కాషాయ వస్త్రాలు, జటాజూటం, కమండలాలు చూసి నవ్వుతాడు. దాంతో పార్వతీ దేవి కుమార స్వామిని మందలిస్తుంది. కుమార స్వామి పశ్చాత్తాపం చెంది పాప పరిహారార్ధం తపస్సు చేయదలచి భూలోకం నందు ఒక పుట్టలో సర్ప రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడు. 

చాలా కాలం తర్వాత అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఒకరోజు మోహినీపురం సమీపంలో కృష్ణ నదిలో స్నానం ఆచరించి సంధ్యా వందనం చేసుకుంటూ ఉంటారు, అప్పుడు అక్కడ ఉన్న ఒక పుట్ట లోనుండి వెలుగులు విరజిమ్మడం ఆయన గమనిస్తారు, పుట్టలో నుండి ఓం నమః శివాయ అని వినిపిస్తూ ఉంటుంది. తన దివ్యశక్తి ద్వారా ఆ పుట్టలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో తపస్సు చేస్తున్నాడు అని గ్రహించి అగస్త్య మహర్షి పుట్ట లోపల నుండి వేయి పడగల లింగాన్ని తీసి పుట్టపైన ప్రతిష్టించి కుమార క్షేత్రం అని నామకరణం చేసి స్వామి వారిని పూజిస్తారు. ఆ తర్వాత కాలంలో ఆ రాజ్యాన్ని పాలించిన రాజులు అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి మోహినీపురం లో సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసిన ప్రదేశమే కాలక్రమేణా మోపిదేవి గా మారింది. ఇక్కడ ఉన్న ఆలయంలో కుమార స్వామి సర్ప రూపంలో తపస్సు చేసిన పుట్ట ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. 

కుమార స్వామి తపస్సు చేస్తున్న సమయంలో తన కుమారుడికి ఏ ఆపద రాకుండా పరమ శివుడు ఆయన కు రక్షణగా ఉన్నారు అని కూడా ప్రతీతి. అందుకే ఇక్కడ ఆలయంలో స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా పిలుస్తారు. 

ఈ ఆలయం విజయవాడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి గ్రామంలో ఉంది. విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్ళే బస్సు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం వైపు నుండి వచ్చే వారు అయితే హనుమాన్ జంక్షన్ నుండి గుడ్లవల్లేరు మీదుగా మోపిదేవి చేరుకోవచ్చు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: