రాహు దోషం..నివారణోపాయలు..

రాహు దోషం..నివారణోపాయలు.............!!

అన్ని గ్రహాలు రవి వలన అస్తంగతులైతే.. 
రవి చంద్రులను కూడా నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు. 

అందుకే ఈయన స్తోత్రంలో “చంద్రాదిత్య విమర్ధనం” 
అని మర్దించే శక్తీ రాహువుకు గలదని చెప్పబడింది. 

ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని, 
మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ధించే శక్తి ఉంది. అందుకే రాహు మహాదశః బాగు లేనివారు పడే పాట్లు వర్ణనాతీతం.

పురాణా శాస్త్రాల ప్రకారం దక్షుని కూతురు సింహికకు కశ్యపునికి రాహువు జన్మించాడు. 
పైటినసగోత్రజుడు.
పార్ధవా నామ సంవత్సర భాద్రపద పౌర్ణమి..పూర్వభద్రా నక్షత్రమందు జన్మించాడు. 
మ్లేచ్చ స్వభావం కలిగినవాడు. 
సూర్యునికి నైరుతి దిశలో సర్పాకార మండలంలో సింహవాహునుడై, 
కరాళ వక్త్రంతో ఉప విష్ణుడై వుంటాడు.

కొత్త దాన్ని ఆవిష్కరించే స్వభావం రాహువుది. 
శరీరంలోకి ఫారిన్ మీటర్కానీ, 
మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, 
వ్యక్తులతో పరిచయాలు గానీ, 
అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. 

ఈ గ్రహం గారడీ చేయించే శక్తి కలవాడు. 
అబద్ధాలు, 
అల్లకల్లోలాలు, 
కొత్త అలవాట్లు. 
కొత్త వేష భాషలు 
చెడు అలవాట్లు
చెడు స్నేహాలు
చెడు బుద్ధులు
అక్రమ సంబంధాలు
కలిగించడంలో సిద్దహస్త్తుడు. 

గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువు తలగా రాహువును, 
తోకగా కేతువును ప్రతీకలుగ చిత్రీకరించారు. 
శని గ్రహం వలే రాహువు కర్మ గ్రహం. 
పూర్వ జన్మ కర్మల్ని అతి విడ్డురంగా అనుభవింప చేయగలడు. 
దుర్మార్గ స్వభావం కలవారు. 
అందలం ఎక్కడానికి సాహస కార్యక్రమాలు చేపట్టి 
వారికీ చేయూత ఇవ్వడానికి రాహువు బాగా సహకరిస్తాడు.

అంతేకాదు రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు. 
కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ, 
అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. 
రాహువుకు యోగాలు కల్గించడం ఉన్నా, 
అనుభవంలో అవయోగాలు ఎక్కువుగా కల్గిస్తాడు.

”రాహు మహా దశః పట్టిందిరా అనేది వాడుక. 
అల్పులు అందలం ఎక్కుట వల్ల ఏర్పడిందే. 
ఫారిన్ భాషలు, 
ఫారిన్ వస్తువులు 
ఫారిన్ జబ్బులు 
తెప్పించడంలో రాహువుదే ఆగ్రాతాంబూలం

రాహువు వల్ల ఏర్పడే పరిణామాలు....
రాహువు వల్ల పలు పరిణామాలు ఏర్పడతాయి. రాజ్యాధికారం కల్పించుటలో , 
పదవిచ్యుతుని చేయుటలో రాహువు కారకుడు. 

వర్ణాంతర వివాహాలు చేసుకోనుటలో కూడా ప్రభావం కలవాడు. 
కుట్రలు, 
పన్నాగాలు, 
ఎత్తు గడలు, 
కూలద్రోయుట వంటి నీచ గుణాలు కలిగిస్తాడు. 

సాంప్రదాయాల సంస్కరణకు, మతభ్రష్టత్వం పట్టిస్తాడు. 

తక్కువ స్థితిగల స్త్రీ సాంగత్యానికి పురిగొల్పుతాడు. 

సంకుచిత ఆలోచనలు కల్గిస్తాడు. 
వ్యసనపరులుగా, 
పోకిరిలుగా మార్చి 
దుస్ట స్నేహాలను కల్గిస్తాడు. 

నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు. 
పీడ కలలు, భయందోళనలు కలిగిస్తాడు. 
రహస్య స్టావరాల పనులు, 
రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు. 

వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు. ఉర్దూ, పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు అవుతాడు.

రాహువు కలిగించే బాధలు....
రాహువు అనేక బాధలు కలిగిస్తాడు. 
కుటుంబంలో కల్లోలాలు సృష్టిస్తాడు. 
స్వంత బుద్ధి లోపించి..
ఇతరుల చెడు సలహాలను పాటించుట, 
ముర్ఖునిగా ప్రవర్తించుట, 
అధికార దుర్వినియోగం చేసి అల్లరి పాలగుట, 
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు, పొలిసు గూడచారి సంస్థల వల్ల బాధ కలుగును. 

కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, 
పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకు పోవుట, 
కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుపోవుట, 
మిలటరీ సంబంధ, బిల్డింగ్ కాంట్రాక్టు సంబంధ నష్టాలు, 

పాములు, 
తేల్లు, 
గేదెలు, 
విష జంతువుల వల్ల బాధలు కలిగిస్తాడు. 

విష గ్యాసులు, 
ఆమ్లాలు, 
వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు, 
న్యూన్యత భావం, 
ఎక్కడికో పారి పోదామనే మానసిక ప్రవర్తన, 
జైలు వరకు తీసుకొని వెళ్ళుట చేయిస్తాడు.

చంద్రునితో కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యం గానీ 
పిచ్చి కానీ కల్గించవచ్చును. 

కుజుని తో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు, 
దెబ్బ లాటలు, గాయాలు కల్గిస్తాడు. 

రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు. 

శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు 
దారి తీయవచ్చును. 

గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, 
తప్పని పరిస్థితిలలో తప్పులు చేయిస్తాడు. 
ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్గాతం చేసి 
పరువు తీయిస్తాడు. 

రాహువు ఎంత యోగం కల్గించినా, 
ఎంతో కొంత అప్రదిష్ట చేయకుండా ఉండలేడు.

రాహువు కలిగించే అనారోగ్యాలు.....
రాహువు వాయుతత్వ కారకుడు కావడం వల్ల 
మానవ శరీరంలోని సమస్త వాయు సంబంద రోగాలను కల్గిస్తాడు. 
నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు. 
కడుపు, 
నాభి, 
మర్మాంగాల నొప్పులకు ప్రతీక. 

ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది. 
ఉరఃపంజర సంబంధ రోగాలను కలిగిస్తాడు. 

శుక్ర రాహువుల కలయికతో చర్మ సౌంధర్యాన్ని దెబ్బ తీస్తాడు. 
సమస్తమైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. 

టైఫాయిడ్, 
మలేరియా, 
మసూచి, 
ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు. 

కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను కడుపులో పెంచుతాడు. 
శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి.. 
బ్యాక్టిరియాను ఆహ్వానించడంలో రాహువు 
మొదటి వాడు. 

రాహువు స్టితి బట్టి పక్షవాతం, 
కీళ్ళవాతం, నడుము నొప్పి కలుగుతాయి

రాహు గ్రహ నివారణోపాయలు....
మానవుని ఇంత ప్రభావం చూపే రాహు గ్రహ నివారణోపాయలు ఇప్పుడు తెలుసుకుందాం. 

రాహువుకు అధిదేవత పృద్వీ అని కొందరు, 
గౌ గోవులని కొందరు చెబుతారు. 
ప్రత్యదిదేవత సర్పములు, 
అధిప్రత్యది దేవతా సహితంగా పునశ్చరణ చేసి 
దార పోయుట వలన నివారణ కలుగును. 

రాహువుకు అధిష్టాన దేవత దుర్గా దేవి 
సప్తసతి పారాయణం కానీ మంత్రం జపం కానీ, 
కవచం కానీ పునఃశ్చరణ చేయుట వలన నివారణ పొందవచ్చును. 
చిన్నమాస్తాదేవిని విధి విధానంగా పూజించడం వల్ల రాహు గ్రహం దుష్పరిమనాలను నివారించవచ్చును.

రాహు గ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు పారుతున్న నీటిలోకి రోజుకోక కొబ్బరికాయ దార పోయుట వల్ల నివారణ కలుగును. 

పడుకొనే ముందు గదిలో నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, తెల్ల వారు జామున లేవగానే చూచుట వల్ల రాహు గ్రహ పీడ నివారణ కలుగును

రాహు దోషం తొలగాలంటే దీపారాధన కూడా చేయాలి. రాహు యంత్రాన్ని పుష్పాలతో అర్చించాలి. 
నల్ల దుస్తులు ధరించాలి. 
ఇంకా మినపప్పును దానం చేసి వేప నూనెతో దీపారాధన చేయడం ద్వారా రాహు దోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది.  
రాహు భగవానునికి ఏదైనా ఒకరోజు అభిషేకం చేయించాలి. 
నలుపు వస్త్రాలు,
 గోమేధికం, 
బ్లూ లోటస్‌తో పూజ చేయించాలి. 
రాహు స్తుతి చేసి గరికతో యాగం నిర్వహించి.. మినపప్పు, మినపప్పు పొడి, అన్నం అగ్నికి ఆహుతి ఇవ్వండి. 
తర్వాత దీపారాధన చేయాలి.
ఓం దుం దుర్గాయై నమః..!!

సర్వే జనా సుఖినోభవంతు..!!

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: