The Compton tube

The Compton tube: Arthur Holly Compton అనే భౌతిక్క శాస్త్రవేత్త 1913ల నాడు కేవలం భూభ్రమణాన్ని రుజువు చెయ్యడం కోసం తప్ప ఇంకెందుకూ పనికిరాని ఈ పరికరాన్ని తయారు చేశాడు. ఒక గాజుతో చేసిన చిల్లిగారెని భూమధ్యరేఖకి సమాంతరంగా తూర్పు పడమరలకి మధ్యన స్టాండు వేసి నిలబెట్టాడు, అందులో నీళ్ళు పోసి చిన్న చిన్న కదలికల్ని పసిగట్టటానికి మట్టి రేణువుల్నీ రంగురంగుల పొడుల్నీ వేశాడు. ఒక రోజు పాటు వాటిని కదల్చకుండా ఉంచి అవన్నీ కుదురుకునేలా చేశాడు. అప్పుడు గభీమని 180 డిగ్రీలు తిప్పి రేణువుల కదలికల్ని సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించి చూశాడు. మొదట ట్యూబు కదలికను అనుసరించి తిరిగిన రేణువులు 20 సెకండ్ల తర్వాత సర్దుకునేటప్పుడు అన్నీ ఒక వైపుకి ఎక్కువ తిరుగుతున్నాయి. ట్యూబుని రెండోవైపుకి తిప్పితే నీళ్ళూ రేణువులూ ట్యూబు కదలికకి వ్యతిరేక దిశలో కదుల్తున్నాయి. ట్యూబుని ఎటు తిప్పినప్పటికీ మొదటి 20 సెకండ్ల తర్వాత నీళ్ళూ రేణువులూ తిరిగే దిశ భూభ్రమణం యొక్క దిశను సైతం నిర్ధారిస్తున్నది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: