The Foucault Pendulum

ఇవన్నీ శాస్త్రజ్ఞులు వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళ కొకళ్ళు చెప్పుకున్నవి కాబట్టి మనబోటి సామాన్యులకు పూర్తి అర్ధం తెలియడం కష్టమే! కానీ The Foucault Pendulum అనేది మాత్రం కళ్ళకి కట్టినట్టు ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా చూపిస్తుంది.సా.శ 1851 ఫిబ్రవరి 3న Léon Foucault ఆనె 32 సంవత్సరాల భౌతిక్క శాస్త్రవేత్త సాటి శాస్త్రవేత్తలకి "You are invited to see the Earth turn" అని చిన్న నోట్ పంపించి Paris Observatoryకి రప్పించి తను చేసిన ఘనకార్యం చూపించాడు. అక్కడున్న Meridian Room పైకప్పుకి ఒక బరువైన ఇనపగుండుని 67 మీటర్ల తాడుకి కట్టేశాడు. కింద నేల ఇసక పరిచి గుండుకి అది కదిలినప్పుడు ఇసకలో గీత పడేటట్టు ఒక సన్నటి ములికిని అమర్చాడు. మామూలు జడత్వ సూత్రాల ప్రకారం లోలకం ముందుకీ వెనక్కీ వూగుతున్న ఒక్క గీతకి బదులు లోలకం దిశను మార్చుకుంటున్నట్టు గీతలు క్రమేణ కొంత కోణాన్ని చేస్తూ వస్తున్నాయి. దీంతో సారువాడికి Royal Society of London వారు Copley Medal ఇచ్చేశారు. మంచి ఉద్యోగం కూడా ఇచ్చేశారు. తంతే గారెల బుట్టలో పడినట్టు గుండును వూపి జాక్పాట్ కొట్టేశాడు కత్తిలాంటి కుర్రాడు!

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: