ధన యెాగాధ్యాయము*

*ధన యెాగాధ్యాయము*

ఏ యెాగమున పుట్టినవాడు నిస్సంశయముగాధనవంతుడగునునో అట్టి ధనయెాగమును చెప్పుచున్నాను.పంచమము శుక్రక్షేత్రమై (వృషభ,తులలు)దనియందు శక్రుడుండి,లాభమున బుధుడక్కడుండి,లాభము చంద్రకుజగురులతో కూడియున్న బహువిత్తవంతు డగును.పంచమము రవిక్షేత్రమై (సిహము)రవి అక్కడుండి,లాభమందు శని చంద్రగురులున్న మహాధనికుడగును.శనిక్షేత్రము (మకర,కుంభము)లందు శనియుండి లాభమున రవిచంద్రులున్న ధనవంతుడగును.పంచమము గురుక్షేత్రమై (ధనుర్మీనములు)లాభమున బుధుడున్న ధనవంతుడగును.పంచమము కుజక్షేత్రమై కుజుడక్కడనే యుండి,లాభమున శుక్రడున్న చో ధనవంతుడగును.పంచమము కర్కాటమై చంద్రుడుండి,లాభమున శనియున్న ధనికుడగును.సింహము లగ్నమై అక్కడ రవియుండి,కుజగురు సంబంధమున్న ధనవంతుడగును.కర్కాటకము లగ్నమై చంద్రుడక్కడుండి,బుధగురులతో కూడినా,చూడబడినా ధనవంతుడగును.
కుజక్షేత్రము లగ్నమై అందుకుజుడుండి,బుధ రవిశుక్రుల సంబంధమున్న శ్రీమంతుడగును.కన్యామిథునములు లగ్నమై,బుధుడుండి,శనిగురుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును.ధనుర్మీనములు లగ్నమై బుధకుజులు సంబంధమున్న జాతకుడు ధనికుడగును.తులావృషభములు లగ్నమై,శుక్రుడుండి,శని బుధుల సంబంధమున్న ధనవంతుడగును.మకర కుంభములు లగ్నమై,అక్కడశనియుండి,కుజగురు సంబంధమున్న జాతకుడు ధనవంతుడగును.కలిసిఉండుట,చుాచుట - ఈ రెంటిని సంబంధమందురు.
పంచమనవమాధిపతులు విశేషముగా ధనము నిచ్చువారు.వారితో కలసి యున్న గ్రహములుకూడ తమతమ దశలలో ధనప్రదులగుదురు.శుభాశుభగ్రహములయెుక్క సంయెాగమువలన కలిగిన బలాబలములను విచారణచేసియే దైవజ్ఞులు ఫలము చెప్పవలెను.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: