సంతానం
# సంతానం
లగ్నేశే సుతభావస్థే సూతేపేచ సుతస్థితే , కేంద్ర.త్రికోణ సంస్థేవా పూర్ణపుత్ర సుఖం వదేత్ , అని. ఇంకను షష్టాష్ఠమవ్యయస్థేతు సుతాధీశే త్వపుత్రతాః
సుతేశేస్తంగతేవాపి పాపాక్రాంతేచ నిర్భలే , తధానజాయతే పుత్రో జాతోవా మ్రియతే ధ్రువం, అనగా లగ్నాధిపతి పంచమ భావమున పంచమభావాది పతితో కలసి ఉన్నచో లేదా పంచమాధిపతి కేంద్ర త్రికోణముల మందున్ననూ పుత్ర సుఖం పూర్తిగా ఉండును. అలాగే పంచమాధిపతి 6 8 12 భావములలో ఉన్నను అలాగే ఆస్తంగతాది దోషములు కలిగి బలహీనుడైననూ పుత్ర సంతతి ఉండదు. ఒకవేళ పుట్టిన చో మరణించును అని తెలుపబడింది.
ఇచట పంచమాధిపతి పతి కి పాపార్గల పట్టిన నూ పంచమాత్ పంచమాధిపతి అగు భాగ్యాధిపతి బాగా చెడిననూ సంతతికలుగదు.
ఇంకా పంచమములో కేతువు ఉండి కుజ శనుల దృష్టి కలిగి ఉంటే ఆలస్యం గాసంతతి లభిస్తుంది.
అలాగే పుత్ర సంతతి కి పంచమాదిపతి పురుషగ్రహ వర్గుల్లో ఉండాలి. స్త్రీ గ్రహ వర్గుల్లో ఉంటే స్త్రీ సంతతి కలుగును లేదా పంచమములో స్త్రీ గ్రహములు ఉన్ననూ అవి బలవంతంగా ఉంటే పురుష సంతతి ఉండదు.
అలాగే చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. శాపము వలన కూడా సంతతి ఉండదు. దీనికి భాగ్యాధిపతి కి పాపార్గాల పంచమ భాగ్యాధిపతులకు రాహుకేతువు సంబంధము వలన తెలుసుకోవచ్చు.
ఉదా హారణకు
దనుర్లలగ్నం లగ్నంలో చంద్రుడు, మీనంలో కుజుడు మేషంలో శుక్ర కేతువులు వృషభం లో రవి బుధులు కన్యలో గురుడు తులలో రాహువు
వృశ్చికంలో శని ఈజాతకం పరిశీలించిన పిదప పంచమాది పతి కుజుడు సహజ పాపి అయిననూ కేంద్ర గతుడైననూ పంచమభావం పాపకర్తరిలో నుండుట అలాగే భాగ్యాధిపతి రవి 6 వస్థానం లో ఉండి శని దృష్టి పొందుట వలన ఆ జాతకురాలికి సంతానం ఉండదు.
అంతే కాకుండా సంతానం విషయంలో భార్యా భర్తల ఇద్దరి జాతకములు చూడవలసి ఉండును. ఇంకా కూడా పంచమములో కుజుడుంటే పుత్ర సంతతి కానీ కష్టముతో ఉండును. 1, 2 అబార్షన్ తదుపరి సంతానం నిలుస్తుంది. పంచమంలో రవి ఉంటే ఏకపుత్ర సంతతి ఆధిపత్య పాపగ్రహాలు అనగా 2 3 6 8 12 ఆధిపత్యం పొందిన గ్రాహాలు పంచమాదిపతిని గాని పంచమ స్థానమును గాని చూసిననూ లేక కలసి యున్ననూ కష్టం మీద సంతతి ప్రాప్తి.
ఏదైనా పంచమము లగ్నము భాగ్యము మూడు బలంగా ఉంటే సంతాన ప్రాప్తి కలుగును. భావము భావాధిపతి అందు ఉన్నగ్రహములు లేదా పై వారితో కలసి ఉన్న గ్రహములు పంచమాది పతిని భావమును చూస్తున్న గ్రహములననుసరించి పుత్ర ప్రాప్తా ప్రాప్తములు తెలుపవలెను.
Comments
Post a Comment