ద్రేక్కాణం
ద్రేక్కాణం
ప్రధమ ద్రేక్కాణానికి (0° నుండి 10°) అధిపతి నారదుడు
ద్వితీయ ద్రేక్కాణానికి (10°నుండి 20°) అధిపతి అగస్త్యుడు
తృతీయ ద్రేక్కాణానికి (20° నుండి 30°) అధిపతి దుర్వాసుడు.
ద్రేక్కాణం వలన జాతకుని ప్రకృతి, గుణం, క్రియాకలాపాలు, అదృష్టాలు, సోదర సహకారాలు, రోగ తీవ్రత, రోగ ఉపశమనం మొదలగు వాటి గురించి తెలుసు కోవచ్చును.
లగ్నం గాని, లగ్నాధిపతి గాని, తృతీయాధిపతి గాని, భావ కారకుడు కుజుడు గాని ద్రేక్కాణంలో షష్టాష్టకాలు, ద్విద్వాదశాలలో ఉంటే సోదరులతో ఘర్షణ ఉంటుంది.
వ్యక్తి జాతకంలో ఆడ సంతానం తరువాత పురుష సంతానం ఉందో లేదో అని తెలుసుకోవటానికి తల్లిదండ్రుల
జాతకాన్ని కాకుండా పుట్టిన అమ్మాయి జాతకం ద్వారా పరిశీలించాలి. ఆ పాప జాతకంలో ద్రేక్కాణంలో తృతీయ భావానికి కుజ, గురు సంబంధం ఉంటే మగ సంతానం ఉంటుంది. తల్లి దండ్రులకు అమ్మాయి తరువాత గర్బాస్రావం కాకుంటేనే మగ సంతానం ఉంటుంది.
జాతకచక్రంలో రాశిచక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 0° నుండి 10° లోపు ఉంటే ద్రేక్కాణ చక్రంలో అదేరాశిలోను,10°నుండి 20° లోపు గ్రహం గాని లగ్నం గాని ఉంటే గ్రహాం ఉన్న రాశి నుండి పంచమ స్ధానంలోను, 20° నుండి 30° లోపు గ్రహం గాని లగ్నం గాని ఉంటే గ్రహం ఉన్న రాశి నుండి నవమ స్ధానంలో గ్రహాలను పొందుపరచాలి.
లగ్నం నుండి, చంద్రుని నుండి పరిశీలించాలి. ప్రధమ ద్రేక్కాణంలో లౌకికం ఉంటుంది. ప్రతి విషయాన్ని దాటవేస్తారు. తొందరగా నిర్ణయం తీసుకోరు. జ్యోతిష్యం, మ్యూజిక్, డ్యాన్స్ లలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎప్పుడూ ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు. సమాజం కోసం కృషి చేస్తారు.
ద్వితీయ ద్రేక్కాణంలో గ్రహాలు గాని, లగ్నం గాని ఉంటే భాషా ప్రావీణ్యం, కమ్యూనికేషన్ సంపాదిస్తారు. మహా మునులవుతారు. మంచి సామర్ధ్యం ఉంటుంది. ఇతర భాషలలో ప్రావీణ్యం ఉంటుంది.
తృతీయ ద్రేక్కాణంలో గ్రహాలు గాని, లగ్నం గాని ఉంటే కోపం అధికం, వరాలు, శాపాలు ఇస్తారు, మంత్ర సిద్ధులు, దుస్తుల మీద ఇష్టం ఉండదు. కష్టాన్ని గుర్తించరు. లగ్నం కానీ చంద్రుడు కానీ దుర్వాస ద్రేక్కాణంలో ఉంటే దుస్తులు వేసుకొని అందంగా ఉండాలి అని కోరుకోరు.
ద్వి స్వభావరాశులలోని ప్రధమ ద్రేక్కాణం ఈ జన్మలోని కర్మ ద్రేక్కాణం. ఈ ద్రేక్కాణంలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఎక్కువగా కష్ట పడతారు.
చర రాశులలో రెండవ ద్రేక్కాణం ఈ జన్మలోని భోగ ద్రేక్కాణం. ఈ ద్రేక్కాణంలో ఎక్కువ గ్రహాలు ఉంటే భోగాలు అనుభవిస్తారు. క్రూర మనస్సు కలిగి ఉంటారు.
ద్రేక్కాణాలు మొత్తం 36. ఇందు వృశ్చిక తృతీయ ద్రేక్కాణం మినహా మిగిలిన 35 ద్రేక్కాణాలు మానవ సంబంద ద్రేక్కాణాలు.
22 వ ద్రేక్కాణం ఖర ద్రేక్కాణం (మృత్యు ద్రేక్కాణం) ప్రశ్నాశాస్త్రంలో చోర ప్రశ్నలో చోరుడి లక్షణాలు తెలుసుకోవచ్చును.
స్త్రీ ద్రేక్కాణాలు, ఆయుధ ద్రేక్కాణాలు, సర్ప ద్రేక్కాణాలు, పక్షి ద్రేక్కాణాలు, పశు ద్రేక్కాణాలు.
స్త్రీ ద్రేక్కాణాలు:- వృషభంలో – ప్రధమ, మిధునంలో- ప్రధమ, కన్యా రాశిలో - ప్రధమ, తృతీయ, ధనస్సు, మకరం, కుంభం, మీనం - ద్వితీయ ద్రేక్కాణాలు స్త్రీ ద్రేక్కాణాలు.
స్త్రీ ద్రేక్కాణాలలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది. మంచి ప్రవర్తన, మంచి గుణం ఉంటాయి. ఇతరులచే గౌరవాలు, కీర్తి ప్రతిష్ఠలు, పొందుతారు. భోగాలు, సంపద, సుఖాలపై మక్కువ కలిగి ఉంటారు.
లగ్నం, చంద్రుడు, లగ్నాధిపతి, పంచమాదిపతి, దశమాధిపతి స్త్రీ ద్రేక్కాణాలలో ఉంటే ప్రతి పనిలోను విజయాలు ఉంటాయి.
ఆయుధ ద్రేక్కాణాలు:- మేషంలో - ప్రధమ, తృతీయ, మిధునంలో – తృతీయ, కన్యాలో – ద్వితీయ, తులలో – ప్రధమ, ధనస్సు, కుంభాలలో- తృతీయ, మకర, మీనాలలో - ప్రధమ ద్రేక్కాణాలు ఆయుధ ద్రేక్కాణాలు.
లగ్నం గాని, చంద్రుడు గాని ఆయుధ ద్రేక్కాణాలలో ఉంటే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అష్టమాదిపతి ఆయుధ ద్రేక్కాణాలలో ఉంటే తరచూ ఆపరేషన్స్, యాక్సిడెంట్ లు జరుగుతాయి. శుక్ర సంబందం ఉంటే వాహన ప్రమాదాలు ఉంటాయి. 3, 8, 9, 10 భావాదిపతులు ఆయుధ ద్రేక్కాణంలో ఉంటే యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతాయి.
సర్ప ద్రేక్కాణాలు:- కర్కాటక రాశిలో – ద్వితీయ, తృతీయ, వృశ్చికంలో - ప్రధమ, ద్వితీయ, మీనంలో – తృతీయ
ద్రేక్కాణాలు సర్ప ద్రేక్కాణాలు.
సర్ప ద్రేక్కాణాలలో ఎక్కువ గ్రహలు గాని, లగ్నం గాని ఉంటే పరిస్థితులకు అనుగుణంగా పోరాడే శక్తి కలిగి ఉంటారు. అతి స్వల్ప వ్యవధిలోనే గర్వం, నేర్పరితనం, ప్రతిభ కనబరుస్తారు. వీరు సైన్యాద్యక్షులుగా బాగా రాణిస్తారు. వీరు నీళ్ళపైన, నేలపైనా ఎంతసేపైన ఉండగలరు. స్త్రీలకు లగ్నం గాని, లగ్నాదిపతి గాని సర్ప ద్రేక్కాణాలలో ఉంటే విష కన్యయోగం. పగపడితే సాధిస్తారు.
పశు ద్రేక్కాణాలు:- మేషంలో - ద్వితీయ, వృషభంలో - ద్వితీయ, తృతీయ,
తుల, సింహా, వృశ్చికంలో - తృతీయ, కర్కాటక, మకర, ధనస్సులో –ప్రధమ ద్రేక్కాణాలు పశు ద్రేక్కాణాలు.
పశు ద్రేక్కాణాలలో ఎక్కువ గ్రహాలు ఉంటే పశు ప్రవృత్తి ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు ఉంటే ఈ లక్షణాలు ఎక్కువ. ఏ పని చేయ కూడదో చెయ్యచ్చో అనే జ్ఞానం కూడా ఉండదు. జాలి, కరుణ ఉండవు. కానీ తనని తాను కంట్రోల్ చేసుకునే తెలివి ఉంటుంది.
పక్షి ద్రేక్కాణాలు:- మిధునంలో - ద్వితీయ, సింహ, కుంభాలలో - ప్రధమ,
తులలో- ద్వితీయ ద్రేక్కాణాలు పక్షి ద్రేక్కాణాలు.
పక్షి ద్రేక్కాణాలలో ఎక్కువ గ్రహాలు గాని, లగ్నం గాని ఉంటే భవిష్యత్ లో జరిగే సంఘటనలు తెలుస్తాయి. పరిస్ధితులను ముందుగానే గుర్తిస్తారు. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటుంది. ఈ ద్రేక్కాణం ద్వారా చోర ప్రశ్నలో లగ్నం ఏ ద్రేక్కాణంలో పడిందో ఆ రాశి స్వభావాన్ని బట్టి చోరుడి లక్షణాలు తెలుసుకోవచ్చును.
Comments
Post a Comment