పరమశివుడు # దక్షిణామూర్తిగా # దక్షిణాభిముఖుడే # ఏందుకయ్యాడు🙏🌼
🌿🌼🙏# పరమశివుడు # దక్షిణామూర్తిగా # దక్షిణాభిముఖుడే # ఏందుకయ్యాడు🙏🌼🌿
🌿🌼🙏పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముకుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు. అయితే దక్షిణాభిముకుడే ఎందుకయ్యాడు ? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు? 🙏🌼🌿
🌿🌼🙏అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా ? కాదు. వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది.🙏🌼🌿
🌿🌼ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు.
అయితే ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు. కనుకనే వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్దిలో ఎటువంటి లక్ష్యం ఉంటుందో వారి నడక ప్రయాణం కూడా ఆ లక్ష్యం వైపుగానే ఉంటుంది. వారి వారి నడతలను బట్టి మానవులను నాలుగు విదాలుగా విభజించవచ్చు.🙏🌼🌿
🌿🌼🙏1) కొందరు మానవులు తమ తమ పుట్టు పూర్వోత్తరాలను, తమ వంశ చరిత్రను, పూర్వీకుల గొప్పతనాన్ని, జరిగిపోయిన విషయాలను తలచుకుంటూ మురిసిపోతూ ఉంటారు.
వీరే పూర్వభిముఖులు. అంటే తూర్పు దిక్కుకు తిరిగినవారు అని అర్థం. (పూర్వ=తూర్పు)🙏🌼🌿
🌿🌼🙏2) మరి కొందరు మానవులు తమ భవిష్యత్తును గురించి ఊహించుకుంటూ, రాబోయే వాటికోసం ఎదురు తెన్నులు చూస్తూ, ఎప్పుడు జరగబోయే వాటి గురించే ఆలోచిస్తారు. వీరు పశ్చిమాభిముఖులు. అంటే పడమర దిక్కున తిరిగినవారు అని అర్థం. (పశ్చిమ=పడమర)🙏🌼🌿
🌿🌼🌿3) చాలా మంది మానవులు ప్రపంచ ప్రమేయాలతో ఇరుక్కుపోయేవారు. జీవితం-ప్రపంచం-సుఖాలు-భోగాలు-సంపాదన-అనుభవించటం అంటూ ఇందులోనే కూరుకుపోయేవారు. వీరే దక్షిణాభిముఖులు. అంటే దక్షిణ దిక్కున తిరిగిన వారు అని అర్దం🙏🌼🌿
🌿🌼🙏4) ఇక చాలా కొద్ది మంది మాత్రం
పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా,
పెద్దల యొక్క మహాత్ముల యొక్క సేవ చేసిన కారణంగా ఈ ప్రపంచ పరిమితులను దాటిపోయి
సంసార జనన మరణ దుఃఖాలనుండి తరించి ముక్తులు కావాలని కోరుకునే వారు.
వీరే ఉత్తరాభిముఖులు. (ఉత్+తర =తరించి పైకి పోవాలనుకునేవారు)🙏🌼🌿
🌿🌼🙏ఇలా నాలుగు రకాలైన మార్గాలలో ప్రయాణించే మానవుల యొక్క స్థితిని తెలియచేసేవియే నాలుగు దిక్కులు🙏🌼🌿
🌿🌼🙏ప్రపంచం నుండి తరించి బయట పడాలనుకునే ముముక్షువులే ఉత్తరాభిముఖులు కనుక, సనకసనందాది మునులు జ్ఞాన పిపాసలు కనుక వారు ఉత్తరాభిముఖులు అని చెప్పటం జరిగింది. ఉత్తరాభిముఖులైన మహర్షులకు జ్ఞాన భోద చేయాలి కనుక పరమేశ్వరుడు దక్షిణాభిముఖుడు అయ్యాడు.🙏🌼🌿
🌿🌼🙏శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు🙏🌼🌿
Comments
Post a Comment