జలప్రళయం వచ్చేది

1) భూమిమీద జలప్రళయం వచ్చేది అయనాంశ 0 అయినప్పుడు కాదు. తొమ్మిది గ్రహాలూ మేషంలో 0° లో కలుసుకున్నప్పుడు. 

జ) దీనిని యుగారంభము అంటారు. యుగారంభంలో కలియుగంలో అలా వచ్చాయి. యుగారంభగతులు అన్ని మత గ్రంథాల్లోనూ విస్తారంగా వివరించబడ్డాయి. 

2) అయనాంశలు 0 అయితే... సముద్రం అలలు లేకుండా నిశ్చలనమౌతుందా?  

జ)అవుతుంది సార్. ఎన్నోసార్లు ఈ ప్రశ్న అడిగిన సమాధానం ఇవ్వలేదు అందరూ. కానీ సమాధానము అలలు లేకుండా అవుతుంది. అల ఎందుకు పుడుతుంది అంటే భూమి వేగంగా తిరగటం వలన. ఒక పక్కకి పడటం వలన. సముద్రంలో ఆటుపోటులు వస్తూ ఉంటాయి. 

3 )ఆదివరాహం సముద్రం నుండి భూమిని పైకి లేపినది. మరి సముద్రభాగము, భూభాగము కలసి ఒకే భూగోళంగా ఉన్నాయి కదా! ఈ భూగోళం ఏ సముద్రంలో ఉన్నది? 

జ)ఆదివరాహం పైకి లేపినప్పుడు నీటి కింద భూమి ఉన్నది. లేపవలసి వచ్చినప్పుడు చేతులతో లేపుతారు గాని కొమ్మతో ఎందుకు లేపడం అనేది అర్ధం చేసుకోండి. జలం నుంచి భూమిని వేరు చేస్తే భూమి మీద జలమే ఉండకుండా పోయి ఉండాలి. కానీ అది సత్యం కాదు పైకి లేపటువంటి భూభాగాన్ని పైకి వచ్చేటట్లుగా టిల్ట్ తిప్పడం. అందుకే అడవి పంది కొమ్ము 23½° వంపు ఉంటుంది. దానిమీద భూమిని నడిచేటట్లు చేయడం చేశారని చెబుతారు అందుకే కొమ్ము ద్వారా భూమిని పైకి లేపారు అంటారు. నీరు అడుగుకి చేరేటట్లు చేశారు అని దీనిలో అర్థం

ప్ర)23 1/2° కోణంలో సముద్రంతో కలసిన భూగోళం మొత్తం ఉన్నదా? లేక సముద్రంతో కాకుండా భూభాగం మాత్రమే 23 1/2° కోణంలో పైకి లేచి ఉన్నదా? 

జ)ఆకాశంలో సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు భూమి యొక్క వంపు 23 1/2 డిగ్రీలు. భూమి ఎలా ఉన్నప్పుడు ఖండాంతర చలనం జరుగుతూ పైకి కిందికి పడుతూ ఉంటుంది. కొండలు గుట్టలు బరువు ఒకచోటకు చేరుతాయి. దానివల్ల భారమైన స్థితి భారరహితమైన స్థితి రెండు ఏర్పడతాయి భూమి మీద. ఆకాశంలో నుంచి సంపూర్ణ జలగ్రహంగా దర్శనం చేయవచ్చు భూమిని. బరువైనది ఉత్తరం వైపు వంగి ఉంటుంది.



ఏది ఏమైనా ప్రశ్న చేసినందుకు చాలా సంతోషం అండి. హిరణ్య అక్ష, హిరణ్యకశప అనే రాక్షసులు సంహారం కోసం విష్ణుమూర్తి అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఒక క్రమ పద్ధతిలో భూమి తిరగకుండా ఉండటం వలన పంటలు భూమి యొక్క జీవన గతి మారిపోవటం ఉన్న తిరిగి దాన్ని అక్షరంలో ప్రవేశపెట్టి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి హిరణ్య వరణము కలిగిన సూర్యుని చుట్టూత ఒక అక్షం లో తిరిగేటట్లు చెయ్యటమే ఆదివరాహ స్వామి చేసిన కథ. స్థిరంగా నిశ్చలంగా జీవక్రమాన్ని వివరించిన విధానమే ఈ ఆదివరాహస్వామి కథ.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: