కాన్సర్ కు ప్రధాన కారక గ్రహం రాహు

కాన్సర్ కు ప్రధాన కారక గ్రహం రాహు అని చెప్పవచ్చు. ఆరవ భావానికి రాహువు కి సంబంధం ఏర్పడినప్పుడు కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్య గాని భర్త గాని వారి జాతకంలో ఆరో స్థానానికి ఏడో స్థానానికి మరియు రాహువుతో సంబంధాలు ఏర్పడినప్పుడు రాహు దశలో జీవిత భాగస్వామికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చంద్రుడు రాహువుతో సంబంధం ఏర్పడినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రుడు శరీరంలో చెస్ట్ లేదా బ్రెస్ట్ కు సంబంధించిన భావానికి ఆదిపత్యం వహిస్తారు. అదేవిధంగా గురు గ్రహానికి లివర్ కి సంబంధం ఉంటుంది. గురుడు రాహువు ఆరవ భావానికి సంబంధం ఏర్పడినప్పుడు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు శుక్రుడు వీరు పొత్తికడుపు గర్భాశయ సంబంధిత అవయవాలు, జననాంగాలకు కారకత్వం వహిస్తారు. కుజుడు శుక్రుడుతో రాహువు ఆరవ స్థానాధిపతి కి సంబంధం ఏర్పడినప్పుడు వీటికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రవికి కుజుడికి శని భగవానునికి రాహువుతో ఆరో స్థానాధిపతితో సంబంధం ఏర్పడితే బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రాహు క్యాన్సర్ కు కారణం అని చెప్పాలి. రాహు టెక్నాలజీకి సంబంధించిన గ్రహం. క్యాన్సర్ కూడా కీమోథెరపీ వంటి టెక్నాలజీ వైద్యాన్ని ఉపయోగిస్తారు. రాహువు కి ఆరోభావానికి మిగిలిన గ్రహాలకి సంబంధం ఏర్పడినప్పుడు క్యాన్సర్ వస్తుందని నిర్ణయించకూడదు. శుభగ్రహ దృష్టి ఉందా పాప గ్రహ దృష్టి ఉందా రాహు ఏ నక్షత్రం పై ఉన్నారు అని చాలా విషయాలు పరిశీలించి గాని ఒక నిర్ణయానికి రాకూడదు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: