ధర్మకర్మాధిపతి యోగం చిన్న వివరణ

ధర్మకర్మాధిపతి యోగం చిన్న వివరణ

జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన యోగం జాతకుడు యొక్క తొమ్మిదో స్థానం వృత్తి యొక్క నీతి నియమాలను తెలియజేస్తుంది. దీనిని ధర్మ స్థానం అంటారు. జాతకుడు యొక్క వృత్తిని గూర్చి తెలియజేసేది 10వ స్థానం దీనిని కర్మ స్థానం అంటారు. జాతకంలో ఈ తొమ్మిది, పది స్థానాలు కలిసి ఉన్నప్పుడు ఏర్పడేది ధర్మకర్మాధిపతి యోగం. ఈ యోగం ఒక అదృష్టవంతమైన యోగం అని చెప్పవచ్చు ఎందుకు అంటే ఈ యోగం ఉన్నప్పుడు జాతకుడు ఎటువంటి కష్టాన్ని అయినా సరే తప్పించుకోగలరు. ఈ యోగం జాతకులను అత్యంత ధనవంతులను చేస్తుంది. సమాజంలో గొప్పవారిగా నిలబెడుతుంది. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులను అధికంగా వృద్ధి చేస్తుంది. ఈ యోగం జాతకంలో కేంద్ర స్థానాలలో కానీ కోణ స్థానాలలో కానీ ఏర్పడినప్పుడు అత్యంత బలమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఏ జాతకుడికి అయినా తాను చేసే వృత్తిలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే ధర్మస్థానం అనగా తొమ్మిదో స్థానం బలంగా ఉండాలి. ఈ స్థానం ధర్మం, పూర్వ కర్మల యొక్క ఫలితం, తండ్రి ద్వారా, గురువు ద్వారా వచ్చే అదృష్టం తెలియజేస్తుంది. పదవ స్థానం జాతకుడు చేసే వృత్తిలో ఉండే అభివృద్ధి ఉన్నత స్థితి, గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెలియజేస్తుంది. ఈ యోగం జాతకంలో ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కానీ, ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఏర్పడినప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏడవ స్థానంలో కానీ పదవ స్థానంలో కానీ ఈ యోగం ఏర్పడినప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు ఈ యోగం మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. లగ్నాధిపతి బలహీనమైనప్పుడు ఈయోగం సరిగా పనిచేయదు. అనగా లగ్నంలో దుస్థానాధిపతులు కానీ దుస్థానాల అధిపతుల దృష్టి ఉండకూడదు. 9 10 అధిపతులు కలిసి ఉన్నప్పుడు వారి మధ్య గ్రహ యుద్ధం జరగకూడదు. అనగా భాగ్య రాజ్యాధిపతులు ఒక డిగ్రీ దూరంలో ఉండకూడదు. మరియు భాగ్య రాజ్యాధిపతులు లగ్నాధిపతి కలిసి ఉంటే ఈ యోగం అద్భుతంగా పనిచేస్తుంది. అనగా సొంత వ్యాపారం చేసేవారికి కోట్ల కొలది సంపాదన ఉంటుంది. ఈ విషయంలో లగ్నం లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోగలరు. లగ్నం కానీ లగ్నాధిపతి కానీ బలహీనమైనప్పుడు వేరే వాళ్ళ నిర్ణయాలపై ఆధారపడతారు. ఈ ధర్మకర్మాధిపతి యోగం లగ్నంలో కలిసి ఉంటే వీళ్లు ఈ భూమి మీద అదృష్టం అనుభవించడానికి జన్మించారని చెప్పవచ్చు. ధర్మ కర్మాధిపతి యోగం లేని జాతకులు ధర్మాధిపతి కర్మాధిపతి స్థానాల దేవతలను ఆరాధించడం ద్వారా వృత్తి ఉద్యోగవ్యాపార విషయాలలో కొద్దిగా అనుకూల ఫలితాలను పొందవచ్చు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12