భార్య పేరు తో వ్యాపారం

కొందరు వ్యాపారం చేస్తూ అభివృద్ధి లేకపోవడంతో భార్య పేరు తో వ్యాపారం చేయవచ్చా అనే సందేహం వస్తుంది. కొందరు జాతకులు వ్యాపారం చేయడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఉదాహరణకు ఉభయ లగ్నాలు అయిన మిధునం కన్య ధనుష్ మీన లగ్న జాతకులు వ్యాపారం ప్రారంభించినప్పుడు అనేక నష్టాలు, కష్టాలు ఎదుర్కొంటారు. ఇటువంటి జాతకులు భార్య పేరు పై వ్యాపారం చేయడం భార్య పేరుతో ఆస్తులు కొనుగోలు చేయడం, స్థలాలు కారు ఇటువంటివి భార్య పేరుతో ఉండడం కలిసి వస్తుందా అనేది పరిశీలించవచ్చు. జాతకంలో నాలుగవ స్థానం బలహీనమై మరియు కుజుడు కూడా బలహీనమైనప్పుడు జాతకుడు తన పేరుతో ఇల్లు స్థలాలు కొనుగోలు చేయకూడదు. ఇటువంటి సందర్భంలో జాతకంలో రాజ్యస్థానం బలంగా ఉన్నప్పుడు భార్య పేరున స్థిరస్తులు కొనుగోలు చేయవచ్చు. జాతకంలో భార్య లేదా భర్త పేరుపై వ్యాపారం చేయాలి అనుకున్నవారు జాతకంలో సప్తమ స్థానం భార్యను సూచిస్తుంది ఆ స్థానానికి ధనస్థానము అనగా తన జాతకంలో అష్టమ స్థానం అవుతుంది. అదేవిధంగా భార్య స్థానానికి రాజ్యస్థానం మరియు లాభ స్థానం అనగా మీ జాతకంలో అష్టమ స్థానం, నాలుగవ స్థానం, మరియు ఐదవ స్థానం బలంగా ఉన్నప్పుడు భార్య లేదా భర్త పేరు పై వ్యాపారం చేయవచ్చు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చు లేదా స్థిర చర ఆస్తులు వారి పేరున ఉంచవచ్చు. వీరి పేరుపై పెట్టుబడులు పెట్టవచ్చు. వ్యాపారాలు చేయవచ్చు. జాతకంలో వ్యాపారం కలిసి రాదు అని జ్యోతిష్యులు చెప్పినప్పుడు ప్రత్యామ్నాయంగా జాతకంలో చతుర్ధ పంచమ అష్టమ స్థానాలను పరిశీలించి అవి బలంగా ఉన్నప్పుడు మీ భార్య పేరున వ్యాపారాలు ప్రారంభించండి. మీ జాతకంలో ఈ స్థానాలు బలంగా లేవు అనుకుంటే దీనికి మరొక మార్గం కూడా ఉంది. పురుషుల జాతకంలో శుక్ర భగవానుడు ఉన్న స్థానం నుండి రాజ్య స్థానం పరిశీలించండి ఈ స్థానం బలంగా ఉన్నప్పుడు పురుషులు తమ భార్య పేరున వ్యాపారాలు చేయవచ్చు ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడులు పెట్టవచ్చు. అదే స్త్రీ జాతకంలో కుజుడు ఉన్న స్థానం నుండి రాజ్యస్థానం బలంగా ఉంటే ఈ జాతకులు భర్త పేరుతో వ్యాపారాలు చేయవచ్చు, స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు పై రెండు సూత్రాలలో ఏ ఒక్కటి మీకు అనుకూలంగా ఉన్నా మీరు మీ జీవిత భాగస్వామి పేరుతో వ్యాపారాలు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుంది. దశ అంతర్దశలు సపోర్ట్ చేస్తే అధిక లాభాలు సాధించవచ్చు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: