ద్వాదశాదిత్యులు.

ద్వాదశాదిత్యులు.........!!
హిందూ పురాణాలలో అదితి, కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు.

మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణన ఉంది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో ఆరాధింపబడుతుంటాడు. ఆదిత్యుని వెంట ఆరుగురు పరిజనులు ఉంటారు. వారు కూడా మాసాన్ని బట్టి మారుతుంటారు.

ద్వాదశాదిత్యుల వివరములు... 

1) ధాత..

మాసం : చైత్రం

పరిజనులు :
కృతస్థలి (అప్సరస),
హేతి (రాక్షసుడు),
వాసుకి (నాగువు),
రథకృత్తు (యక్షుడు),
పులస్త్యుడు (ఋషి),
తుంబురుడు (గంధర్వుడు)

2) అర్యముడు...

మాసం : వైశాఖం

పరిజనులు :
పుంజికస్థలి (అప్సరస),
పులహుడు (రాక్షసుడు),
ఓజస్సు (నాగువు),
ప్రహేతి (యక్షుడు),
నారదుడు (ఋషి),
కంజనీరుడు (గంధర్వుడు)

3) మిత్రుడు...

మాసం : జ్యేష్ఠం

పరిజనులు :
మేనక (అప్సరస),
పౌరషేయుడు (రాక్షసుడు),
తక్షకుడు (నాగువు),
రథస్వనుడు (యక్షుడు),
అత్రి (ఋషి),
హాహా (గంధర్వుడు)

4) వరుణుడు...

మాసం : ఆషాఢం

పరిజనులు :
రంభ,
శుక్రచిత్తు,
సహజన్యుడు,
హూహూ,
వసిష్ఠుడు,
సృనుడు

5) ఇంద్రుడు...

మాసం : శ్రావణం

పరిజనులు :
విశ్వావసువు,
శ్రోత,
ఏలా పుత్రుడు,
అంగిరసు,
ప్రమ్లోచ,
చర్యుడు

6) వివస్వంతుడు...

మాసం : బాధ్రపదం

పరిజనులు :
అనుమ్లోద,
ఉగ్రసేనుడు,
వ్యాఘ్రుడు,
అసారణుడు,
భృగువు,
శంఖపాలుడు

7) అంశుమంతుడు...

మాసం : మార్గశిరం

పరిజనులు :
కశ్యపుడు,
తార్క్ష్యుడు,
ఋతసేన,
ఊర్వశి,
విద్యుచ్ఛత్ర,
మహాశంఖులు.

8) త్వష్ట...

మాసం : ఆశ్వయుజం

పరిజనులు :
జమదగ్ని,
కంబళాశ్వుడు,
తిలోత్తమ,
బ్రహ్మపేతుడు,
శతజిత్తు,
ధృతరాష్ట్రుడు.

9) విష్ణువు...

మాసం : కార్తీకం

పరిజనులు :
అశ్వతరుడు,
రంభ,
సూర్యవర్చుడు,
సత్యజిత్తు,
విశ్వామిత్రుడు,
మఖాపేతుడు.

10) భగుడు...

మాసం : పుష్యం

పరిజనులు :
స్ఫూర్జుడు,
అరిష్టనేమి,
ఊర్ణువు,
ఆయువు,
కర్కోటకుడు,
పూర్వజిత్త.

11) పూషుడు...

మాసం : మాఘం

పరిజనులు :
ధనుంజయుడు,
వాతుడు,
సుషేణుడు,
సురుచి,
ఘృతావి,
గౌతముడు.

12) క్రతువు...

మాసం : ఫాల్గుణం

పరిజనులు :
వర్చుడు,
భరద్వాజుడు,
పర్జన్యుడు,
సేనజిత్తు,
విశ్వుడు,
ఐరావతుడు

ఇంకా భాగవతంలో శౌనకుడు సూతునకిలా చెప్పాడు.. ఈ పన్నెండుగురు ఆదిత్యులును విష్ణువు యొక్క సూర్యరూప విభూతులు.

సూర్యుని వెంబడించేవారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు.

గంధర్వులు గానాన్ని చేస్తుంటారు.

అప్సరసలు నాట్యం చేస్తుంటారు.

నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. 

యక్షులు రథయోజన చేస్తారు.

రాక్షసులు రథాన్ని వెనుక వైపు నుండి తోస్తుంటారు. 

వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరువదివేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు.

మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో (65-15,16) చెప్పబడిన పేర్లు...

"ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచభగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథాఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతేజఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః"

(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)

"ఆదిత్యానామహం విష్ణుః" ..ఆదిత్యులలో నేను విష్ణువును.. అని భగవద్గీతలో చెప్పబడింది...

|| ఓం ఆధిత్యయై నమః ||

|| ఓం నమః శివాయ ||

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: