వాస్తు

*వాస్తు*

గజపృష్ట భూమి: ధైత్య పృష్ట భూమి: నాగ పృష్ట భూమి: మరియు కూర్మ పృష్ట భూమి. భూమి యొక్క ఎత్తుపల్లాలను బట్టి ఈ వర్గీకరణ జరిగింది. జాగ్రత్తగా పరిశీలిస్తే దిక్కులు, విదిక్కులందు ఎత్తుపల్లాలు యే విధంగా ఉండాలో కూడ ఈ వర్గీకరణ లో తెలియచేయడం జరిగింది.
దక్షిణం, పడమర, నైరుతి, వాయవ్యం, దిశలు మెరక గాను మిగిలిన ఆగ్నేయ, ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలు పల్లం గాను ఉన్న భూమిని గజపృష్ట భూమి అని అంటారు. స్టూలంగా చెప్పాలంటే ఉత్తరం కంటే దక్షిణం మరియు తూర్పు కన్నా పడమర మెరకగా ఉన్న భూమే గజపృష్ట భూమి. ఈ భూమి అన్ని రకాలైన సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఇది నివాసానికి యోగ్యమైన భూమి.

గజపృష్టే భవేద్వాస సలక్ష్మి ధనపూరిత:
ఆయు:వృద్దికరీ నిత్యం జాయతే నాత్ర సంశయ:

“జ్యోతిర్నిబంధం”
పై శ్లోకం” జ్యోతిర్నిబంధం” అను ప్రాచీన వాస్తు గ్రంధం నుండి గ్రహించబడినది. ఈ శ్లోకం ప్రకారం గజపృష్ట భూమి లో నివసించేవాళ్ళకు దీర్ఘ ఆయుషు, సంపద, నిత్యం పెరుగుతూ ఉంటుంది.గృహస్థు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాడు.
ధైత్యపృష్ట భూమి లో తూర్పు, ఆగ్నేయం, మరియు ఈశాన్యం మెరకగా ఉంటాయి. మిగిలిన దిశలైన నైరుతి, పడమర, దక్షిణం మరియు వాయవ్యం పల్లంగా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే తూర్పు భాగం మెరకగా ఉండి పడమర భాగం పల్లంగా ఉన్న భూమి ధైత్యపృష్ట భూమి. ఈ భూమి అత్యంత వినాశకారి.
ధైత్యపృష్ఠే కృతేవాసే లక్ష్మీర్ణయాతి మందిరం
ధనపుత్ర పశూనాంచ హానిరేవ న సంశయ: 
“జ్యోతిర్నిబంధం.”
పై శ్లోకం ప్రకారం ఇందులో నివసించే వాళ్ళకు ధన నాశనం, పుత్ర పశు మరియు వంశ నాశనం జరుగవచ్చు. ఈ భూమి నివాసయోగ్యం కాదు. ఉత్తర దక్షిణాలు మెరకగా ఉండి తూర్పు పడమరలు దీర్ఘంగా, పొడవుగా ఉన్న భూమి నాగపృష్ట భూమి. ఇది నివాసానికి పనికిరాదు.
నాగపృష్టే యధావాసో మృత్యురేవ న సంశయ:
పత్నీహాని: పుత్రహాని: శత్రువృద్ది: పదేపదే.
“జ్యోతిర్నిబంధం.”
మధ్య భాగం ఎత్తుగా ఉండి మిగిలిన 4 దిశలు పల్లంగా ఉన్న భూమిని కూర్మపృష్ట భూమి అని అంటారు.ఈ భూమి ఫలితాల పై కొన్ని ప్రాచీన గ్రంధాలు అనుకూలంగా తెలియజేస్తే మరికొన్ని గ్రంధాలు ప్రతికూలంగా తెలియజేశాయి.
”ధనం ధాన్యం భవేత్తస్య నిశ్చ్హితం విపులం శుభం”.

జ్యోతిర్నిబంధం
పై శ్లోకం ప్రకారం కూర్మపృష్ట భూమి ధనధాన్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. అయితే “విశ్వకర్మప్రకాశిక” అను మరో ప్రాచీన వాస్తు గ్రంధం “ కూర్మే ధన నాశనం “ అని తెలియజేసింది. ఇప్పటి పరిస్థితుల ప్రకారం పరిశీలిస్తే ఈ భూమి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అని చెప్పవచ్చును.
జ్యోతిర్నిబంధం, విశ్వకర్మ ప్రకాశిక ఇంకా నారద సంహిత వంటి అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు అప్పటి పరిస్థితులను, అప్పటి అవసరాలను, కాలాన్ని బట్టి స్థల విభజన చేశాయి...

Comments

Popular posts from this blog

అష్ట భైరవ మంత్రం

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU: