సంతానహీన యోగములు

వివీర్యాః సర్వే నపత్యతా॥ 

సమస్త గ్రహములు నిర్చలురైన అనగా నీచ, శత్రు, అస్తంగతులైనను, త్రికములందున్నను షడ్వర్గమందు బలహీనురైనను జాతకులు సంతానహీనులగుదురు.
గురులగ్నేశ దారేశపుత్రస్థానధీపేషు చ ! సర్వేషు బలహీనేషు వక్తవ్యా త్వనపత్యతా ॥

గురుడు, లగ్నాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి నిర్బలురైన ఆ జాతకులు సంతానహీనులగుదురు.

గర్భపాత యోగములు (సంతానహీన యోగములు)

లగ్నేర్కేస్తే మందే వా ద్యూనే ర్కశనీ ఖే జీవదృష్టే గర్భానుత్పాదః || 80 ||

లగ్నమందు రవి, సప్తమభావమందు శని లేదా సప్తమ భావమందు రవిశనులు, మరియు దశమ భావమందున్న గురునిచే వీక్షించబడినను గర్భపాతమగును.

మందారే షష్ఠి నా తుర్యే గర్భానుత్పాదః ॥81 ॥

శని కుజుడు షష్ఠ స్థానమందు లేదా చతుర్థ స్థానమునందున్నను గర్భపాతమగును.

సారీశోర్కజః షష్ఠి చంద్రే చాస్తే గర్భానుత్పాదః ॥ 82||

శని షష్ఠాధిపతి షష్టభావమందు, చంద్రుడు సప్తమభావమందున్నను జాతకులు సంతానహీనులగుదురు.

వివరణ: జాతకపారిజాతమందు చెప్పబడిన మరికొన్ని సంతానహీన యోగములు

పుత్రస్థానం గతే పాపే తదీశే నీచరాశిగే । శుభదృష్టి విహీనే తు వక్తవ్యా త్వనపత్యతా ॥ గురులగ్న హిమాంశూనాం పంచమస్టైర శోభనః । శుభదృగ్యోగరహితైర్వక్తవ్యా త్వనపత్యతా ॥ పుత్రస్థానగతే పాపే తదీశే పాపమధ్యగే । సౌమ్యదృగ్యోగరహితే వక్తవ్యా త్వనపత్యతా ॥ పాపమధ్యగతే జీవే పుత్రేశే బలవర్జితే | సౌమ్యదృగ్యోగరహితే వక్తవ్యా త్వనపత్యతా ॥

పంచమభావమందు పాపగ్రహముండగా, పంచమాధిపతి నీచరాశియందున్నను శుభగ్రహదృష్టి లేకున్నను, లగ్న, గురు, చంద్రులనుండి పందమభావమునందు పాపగ్రహముండి శుభదృష్టి పొందకున్నను పంచమమందు పాపగ్రహములున్నప్పుడు పంచమాధిపతి పాపగ్రహముల మధ్యనున్నను; గురుడు పాపగ్రహముల మధ్యనుందిగా శుభగ్రహవీక్షణ పొందకున్నను జాతకులు సంతాన హీనులగుదురు.
సుతే పాపయుతదృస్తే గర్భచ్యుతి ॥83 ॥

పంచమ స్థానమునందు పాప గ్రహములున్నను, పావులదే చూడబడినను గర్భస్రావనుగును, పుత్రస్థానవాంశే యావత్సాపదృష్ట: శుభాదృష్టిస్తావద్గర్భపాతః ॥84 ॥

పంచముఖాన నవాంశరాశి శుభగ్రహదృష్టి లేకుండా కేవలము పాపగ్రహములదే వీక్షించబడిన - ఎన్ని పాపగ్రహములు వీక్షించునో అన్ని సార్లు గర్భస్రావమగును.

వివరణ: కుజశనులు లగ్నమందున్న స్త్రీలకు గర్భస్రావమగును, చంద్రుడు అగ్నమునందున్నను, వీక్షించినను గర్భ స్రావమగును.

సర్పదోష యోగములు

సుతే రాష్ట్ర భౌమదృష్టే భౌమభే సర్పశాపాద్విపుత్రః ॥ 

రాహువు పంచమ భావమందుండి కుజునిచే వీక్షించబడినను, కుజుని రాశులు

పంచమ భావములైనపుడు రాహువందున్న సర్పశాపముచే సంతానయోగముండదు. యమే సుతే చంద్రదృస్తే సుతేశే రాహుయుతే సర్పశాపాద్వి ১:

పంచమభావమునందున్న శని చంద్రునిచే వీక్షించబడినపుడు, పంచమాధిపతి రాహువుతో కూడినను సర్పదోషము వల్ల సంతానము ఉండదు.

సరాహొ పుత్రకారకః పుత్రేశే బలే భౌమార్గేశా యుతౌ సర్పశాపాద్విపుత్రః ॥

పంచమభావ కారకుడు రాహువుతోను, పంచమాధిపతి నిర్చలుడైయుండగా,

లగ్నాధిపతి కుజునితో కూడిన సర్పదోషకారణముచే సంతానహీనులగుదురు.

సుతకారకే సారే రాహ్వగ్గీ పుత్రేశే త్రికే సర్వశాపాద్విపుత్రః ॥

పంచమభావకారకుడు కుజునితో కూడినపుడు, లగ్నమందు రాహువు, త్రికస్థానము అందు పంచమాధిపతియుండెనేని సర్పదోషకారణముచే సంతానహీనులగుదురు.

పుత్రేశే జ్ఞే సారే కుజాంశే రాహుమాందియుతేల్గే చ సర్పశాపాద్విపుత్రః ||

పంచమాధిపతి బుధుడు కుజుని నవాంశయందుండి కుజునితో కూడినపుడు, రాహువు గుళికునితో కలసి లగ్నమందుండెనేని సర్పదోషకారణముచే సంతానహీనులగుదురు.
సుతేశే భౌమే సుతే రాహౌ సౌమ్యదృష్టే సర్పశాపద్విపుత్రః ॥ 90 ॥

కుజుని రాశులు పంచమస్థానములై రాహువు అందుండి శుభగ్రహవీక్షణ పొందకున్నను సర్పదోష కారణముచే సంతానహీనులగుదురు.

సుతాబ్దేశా విబలౌ సజ్ఞేజ్యౌసుతే పాపాః సర్పశాపాద్విపుత్రః ॥91 ॥ పంచమాధిపతి లగ్నాధిపతి నిర్చలురైనపుడు, బుధగురులు కలసియుండగా,

పంచమభావమునందు పాపగ్రహమున్నను సర్పదోషకారణముచే సంతానహీనులగుదురు. లగ్నేశే రాహుయుతే పుత్రేశే భౌమయుతే కారకే రాహుదృష్టే సర్పశాపాద్విపుత్రః ॥92 ||

లగ్నాధిపతి రాహువులోను, పంచమాధిపతి కుజునితోను, పంచమభావకారకుడు

రాహువుచే వీక్షించబడెనేని సర్పదోషకారణముచే సంతానహీనులగుదురు.

వివరణ: జాతక పారిజాతమందు సర్పదోషము ఈ విధంగా చెప్పబడెను.

రాహుకేతుయుతే దృష్టే పంచమే బలవర్జితే |

తదీశే వా తథా ప్రాప్తే సర్పదోషాత్సుతక్షయః ॥ పంచమభావమందు, పంచమాధిపతి నిర్భలుడైనపుడు రాహుకేతువులతో కూడినను చూడబడినపుడు సర్పదోషకారణముచే సంతానహీనులగుదురు.

పితృశాప సంతానహీన యోగములు పుత్రపేర్కే క్రూరాన్తరే త్రికోణే పాపయుతదృష్టే పితృశాపాద్విపుత్రః ||

సూర్యుడు పంచమాధిపతియై త్రికోణములందుండగా పాపగ్రహములు మధ్యనుండి పాపగ్రహములతో కూడినను చూడబడినను పితృదేవతల శాపముచే పుత్రుహీనుడగును.

సుతేర్కే పాపాన్తరే మందాంశే నీచగే పితృశాపాద్విపుత్రః ||

పంచమభావమందున్న రవి, పాపగ్రహముల మధ్య శన్యంశలయందుండెనేని పితృశాపముచే పుత్రహీనుడగును.

సింహేజ్యే పుత్రేశేర్కయుతే పుత్రాఙ్గగౌ పాపౌ పితృశాపాద్విపుత్రః ॥

గురుడు సింహరాశియందుండగా పంచమాధిపతి రవితో కలసినపుడు లగ్న పంచమ స్థానములందు పాపగ్రహములున్న జాతకులు పితృశాపముచే సంతానహీనులగుదురు.
సూర్యే రంధ్రీ సుతే మందే పుత్రేశే రాహుయుతే పితృశాపాద్విపుత్రః ||

రవి అష్టమ స్థానమునందు, శని పుత్రస్థానమునందు, పుత్రాధిపతి రాహువుతో కూడెనేని జాతకులు పితృశాప కారణముగా సంతానహీనులగుదురు.

తల్లి శాపముచే సంతానహీనయోగములు

పుత్రపే చంద్రే నీచగే వా పాపాన్తరే సుతాంబుగౌ పాపౌ మాతృశాపాద్విపుత్రః ||

నీచరాశియందున్న పంచమాధిపతి, చంద్రుడు పాపగ్రహముల మధ్యనుండగా, చతుర్థపంచము భావములందు పాపగ్రహములున్న జాతకులు మాతృశాపవశాత్తు సంతానహీనులగుదురు.

లాభేమందే తుర్యే పాపాః పుత్రే నీచగే చంద్రే మాతృశాపాద్విపుత్రః||

లాభ భావమందు శని, చతుర్థభావమందు పాపగ్రహములు, పంచమ భావమందు నీచరాశిగతుడైన చంద్రుడ్నుయెడల మాతృశాపకారణముచే సంతానహీనులగుదురు.

సుతేశే త్రికే లగ్నేశే నీచే పాపయుతే చంద్రే మాతృ శాపాద్విపుత్రః||
పంచమాధిపతి త్రికస్థానములందు, లగ్నాధిపతి నీవయందు, చంద్రుడు పాపగ్రహహుల మంధ్యనుండెనేని జాతకులు మాతృశాపకారణముచే సంతానహీనులగుదురు.

సుతేశే చంద్రే మందరాహ్వారయుతే మాతృశాపాద్విపుత్రః ||

పంచమాధిపతియైన చంద్రుడు శని రాహుకుజులతో కూడియుండెనేని పై ఫలితములే కలుగును. 

సుఖేశే భౌమే రాహ్వర్కయుతే లగ్నే పుష్పవంతా మాతృశాపాద్విపుత్రః॥ 

చతుర్ధాధిపతి యైన కుజుడు, రవి రాహు చంద్రులతో కలసి లగ్నమందున్న మాతృశాపముచే సంతానహీనులగుదురు.
సుఖేశేష్ట్రమే పుత్రాడ్గేశా షష్టే ఖారీశా లగ్నే మాతృశౌలగ్నే మాతృశాపాద్విపుత్రః॥

చతుర్ధాధిపతి అష్టమస్థానమందు, లగ్న పంచమాధిపతులు షష్ఠ స్థానమునందు, దశమషష్ఠాధిపతులు లగ్నమందుండెనేని జాతకులు మాతృశాపముచే సంతానహీనులగుదురు, పుత్రాజ్గాష్టారిగా రాహ్వర్కారమందా లగ్నేశే త్రికే మాతృశాపాద్విపుత్రః||

రాహు, రవి, కుజ, శనులు వరుసగా పంచమ, లగ్న, అష్టమ, షష్ట స్థానములందుండగా, లగ్నాధిపతి త్రికస్థానములందున్నను జాతకులు మాతృశాపముచే సంతానహీనులగుదురు.

రాహ్వరేజ్యా త్రికస్థా మందచంద్రౌ పుత్రే మాతృశాపాద్విపుత్రః||

రాహు, కుజ, గురులు త్రికస్థానములందు, చంద్రశనులు పుత్రస్థానము లందుండెనేని జాతకులు మాతృశాపముచే సంతానహీనులగుదురు,

కులదేవతా శాపముచే సంతానహీనయోగములు మందారిగేహే జ్ఞేందుసూర్యదృష్టి లగ్నే పాపదృష్టే కులదేవ దోషద్విపుత్రః ॥

లగ్నమును పాపగ్రహములు, శత్రుస్థానమందున్న శనిని, బుధ రవి చంద్రులు వీక్షించిన, జాతకులు కులదేవతా శాపముచే సంతానహీనులగుదురు.

మందరే సూర్యే పాపదృష్టే నా పాపవర్గే జ్గా కులదేవ దోషద్విపుత్రః ॥

రవిశని రాశులయందుండి పాపులచే వీక్షించబడినపుడు లగ్నము పాపగ్రహ వర్గాలయందున్న కులదేవతాశాపముచే సంతానహీనులగుదురు.

పుత్రహీనయోగములు సూర్యేగే సుతే భౌమే సుతహీనః ॥

లగ్నమందు రవి, పంచమ భావమునందు. పుత్రహీనులగుదురు. కుజుడుండెనేని జాతకులు.
జీవాత్సుతేనే త్రికే పుత్రాఙ్కార్గేశా లగ్నాత్రికస్థాః సుతహీనః ॥

గురుని నుండి పంచమాధిపతి త్రికములందు, లగ్న పంచమ నవమాధిపతులు

త్రికములందున్న జాతకులు పుత్రసంతానము కలిగియుండరు. జీవే పంచమే జీవాత్సుతే క్రూరే సుతహీనః ॥

గురుడు పంచమభావమంచు, గురుని నుండి పంచమభావమందు పాప గ్రహములున్నను జాతకులు పుత్రహీనులగుదురు.

దారాజే పుత్రపే బలిని షష్టేశయుతదృష్టే2పుత్రః ॥ 

పంచమాధిపతి లగ్నమునందు లేదా సప్తమునందుండగా బలయుతుడైన షష్ఠాధిపతితో కూడినను వీక్షించబడినను జాతకులు పుత్రహీనులగుదురు.

ధీధర్మసౌ సదారేశా దుఃస్థానగౌ హీనబలౌ శుభదృష్టే సుతే బహుదారో2ప్యపుత్రః ||

పంచమాధిపతి, నవమాధిపతి సప్తమాధిపతితో కూడి దుస్థానములందుండగా, పంచమభావముపై శుభగ్రహదృష్టి కలిగియుండెనేని అనేకమంది భార్యలు కలిగినను పుత్రహీనులగుదురు.

మందారౌ ఖే ధర్మే వా పుత్రతా ||
శనికుజులు దశమభావమునందు. గాని నవమభావము నందుండెలేని పుత్రహీనులగుదురు.

మందారశుక్రా దారగా అపుత్రః॥

శనికుజ శుక్రులు సప్తమభావము నందుండెలేని జాతకులు సంతానహీనులగుదురు.

శత్రుభే లగ్నపే జ్ఞేందుదృష్టే షష్టార్థే సూర్యే విపుత్రః ||

లగ్నాధిపతి శత్రురాశియందుండి బుధచంద్రులచే వీక్షించబడినపుడు, రవి ద్వితీయ లేదా షష్టస్థానమునందున్నను జాతకులు పుత్రహీనులగుదురు.

సుతేశేస్తాంశే పాపయుతే విపుత్రః ॥

పంచమాధిపతి అస్తరాశియందుండి పాపగ్రహములతో పుత్రహీనులగుదురు. కూడినను

గురౌ సుతేనే సపాపే బలే విపుత్రః ॥

పంచమాధిపతి గురుడు బలహీనుడైయుండగా పాపగ్రహములతో కూడిన జాతకులు సంతానహీనులగుదురు.

సపాపే2జ్గేశేత్రికే సుతేశే విపుత్రః ॥

లగ్నాధిపతి పాపగ్రహములతో కూడియుండగా పంచమాధిపతి త్రికస్థానము. లందున్న పుత్రహీనులగుదురు.

కోణే గురౌ పాపయుతే విపుత్రః ॥
పాపగ్రహములతో కూడిన ఆ కోణస్థానములందున్నను పుత్రహీనులగుదురు.

లగ్నేశే కుజరేషస్తే పుత్రేశే విపుత్రః ॥
లగ్నాధిపతి కుజరాశులైన మేష వృశ్చికములందు, పుత్రాధిపతి షష్టస్థానము నందున్నను పుత్రహీనులగుదురు.

వ్యయేశే ఖాద్యే విపుత్రః ॥

వ్యయాధిపతి పుత్రహీనులగుదురు. లగ్నమునందున్నను దశమమునందున్నను జాతకులు

కన్యాజ్గేసూర్యే భౌమే సుతే విపుత్రః ॥

లగ్నము కన్యారాశై రవియందుండగా, కుజుడు పుత్రస్థానమునందు. ఉన్నను జాతకులు పుత్రహీనుడగును.

సుతే శుక్రభౌమాన్యేతరా దృష్టే ద్విత్రివివాహేష్వప్య సంతానః॥

పంచమభావమును శుక్ర, కుజులచే వీక్షించబడిన జాతకులు రెండు లేక మూడు వివాహములు చేసుకొన్నప్పటికి సంతానహీనులగుదురు.

లాభే సేందౌ మందే2ప్రజత్వమ్ ||

చంద్రుడు శనితోకూడి లాభభావమునందున్న జాతకులు సంతానహీనులగుదురు.

వివరణ: సంతాన హీన యోగములను జాతకసారిజాతమందు ఈవిధముగా చెప్పబడెను.

మీనస్ట్రోప్యల్పసంతానశ్చాపస్థః కృచ్ఛసంతతిః | అసంతతిః కులీరస్ట్లో జీవః కుంభే న సంతతిః ॥ పుత్రస్థానే కులీరే వా మీనే కుమ్చే శరాసనే । స్థితో యది సురాచార్యస్తత్ఫలం కురుతే నృణామ్ ||

గురుడు మీనరాశియందుండెనేని అల్పసంతానము కలుగును, ధనురాశి యందుండెనేని ప్రయత్నము వల్ల సంతతి కలుగును కర్కాటక, కుంభ రాశులయందున్న సంతానహీనులగుదురు. పైన తెలియజేసిన రాశులయందు గురుడుండగా ఆ రాశులు పుత్రస్థానమైనను ఇదే ఫలితము కలుగును.

Comments

Popular posts from this blog

అష్ట భైరవ మంత్రం

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU: