కుడి ఎడమలు వేరు కాదు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కుడి ఎడమలు వేరు కాదు!*
*కలిసుందాం…రా…!*
➖➖➖✍️
*మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది.*
*ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు.*
*సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. ‘నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో..’ అంటూ శపించాడు.*
*తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. ‘నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమ’ని తిరిగి అన్నను శపించాడు.*
*ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా శత్రుభావనలు ఉండిపోయాయి. తరచూ కలహించు కుంటూండేవి.*
*ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే... ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు.*
*ఇది కథే కావచ్చు... ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే... మనం నిత్యం మన ఇళ్ళల్లో చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి.*
*అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు. కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు.*
*చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది.*
*******************
*చిన్నప్పుడు దుర్యోధనుడు పొద్దస్తమానం భీముడితో కలియబడుతుండేవాడు. భీముడిమీద అక్కసు పెంచుకున్నాడు. అదే చిట్టచివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళింది. చిన్నప్పటి పగ భీముడు దుర్యోధనుడి తొడ విరగ్గొట్టేదాకా వెళ్ళింది. చిన్నప్పుడు కలిసిమెలిసి ఉంటే పెద్దయిన తరువాత కూడా సఖ్యత గా ఉంటారు.*
*****************
*సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో క్రికెట్ ఆటలో కనబరుస్తున్న నైపుణ్యం చూసి అన్న అజిత్ టెండూల్కర్ క్రికెట్ ఆటను నేర్పించే అచ్రేకర్ దగ్గరకు తీసుకెళ్ళాడు.*
*ఆయన ఒక పరీక్షపెట్టాడు. అచ్రేకర్ పట్ల ఉన్న భయాందోళనలతో ఆ పరీక్ష సచిన్ నెగ్గలేకపోయాడు.*
*శిష్యుడిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు.*
*కానీ అన్న వదలకుండా... “మిమ్మల్ని చూసి భయపడినట్టున్నాడు. నిజానికి బాగా ఆడతాడు. మరొక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుకున్నాడు. మీరు దూరంగా ఉండి పరిశీలించమన్నాడు.*
*ఈసారి గురువు అక్కడ లేడనే ధైర్యం కొద్దీ సచిన్ అద్భుతంగా ఆడాడు. సచిన్‌ను శిష్యుడిగా స్వీకరించడానికి వెంటనే అచ్రేకర్ సమ్మతించాడు. ఇదెలా సాధ్యపడింది...అన్నదమ్ముల సఖ్యత వల్ల.*
*అబ్దుల్ కలాంగారికి మద్రాస్‌లో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తే... ఫీజు కట్టడానికి తండ్రివద్ద అంత డబ్బు లేదు. అప్పటికే పెళ్ళయిపోయిన అతని సోదరి జోహ్రా తన నగలు తాకట్టుపెట్టి డబ్బు సర్దుబాటు చేసింది.*
*ఇదెలా సాధ్యపడింది ... తోడబుట్టినవారి సఖ్యత కారణంగానే కదా ...*
*అందువల్ల పాండవుల్లా, రామలక్ష్మణభరతశత్రుఘ్నుల్లా చిన్నప్పటినుంచి కలిసుండడం అలవాటు కావాలి. పెద్దయ్యాక మారడం అంత తేలిక కాదు.*
*అదే బద్దెనగారు సుమతీ శతకంలో చెప్పేది... ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదా మాటామాటా పెరిగి వాదులాడుకోవడాలవంటివి మనసులో ఉంచుకుని, పైకి సఖ్యత నటిస్తూ బంధువులను చిన్నచూపు చూడవద్దు. వారిని దూరం చేసుకోవద్దు. ఎక్కడికెళ్ళినా స్నేహితులు, శ్రేయోభిలాషులు దొరుకుతారు...*
*కానీ జన్మతః నీకు భగవంతుడు అనుగ్రహించిన బంధువులు ఈ జన్మకు మళ్ళీ దొరకరు. కుడి చేయి ఎడమ చేయి వేరు కాదు. దేని బలం దానికున్నా.. ఆ రెండూ కలిస్తే బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది.*
*చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉన్న కారణంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవాలి. అప్పుడు మీ ఐకమత్యబలం సమాజంలో మరో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది.*✍️
.
🌷🙏🌷
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
➖▪️➖
Comments
Post a Comment