దీపావళి జరుపుకోవటం లో విశిష్టత
అందరూ దీపావళి జరుపుకునే ఉంటారు. జువ్వలు రాకెట్లు అందరు కాల్చే ఉంటారు.... చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే దీపావళికి ఇవన్నీ కాల్ చేయి పరిసరాలను పాడు చేస్తున్నారు అని. అదృష్టవశ్యత్తు ఈ సంవత్సరం ఎక్కువ మంది మాట్లాడలేదు ఇలాగా... కానీ సుప్రీం కోర్టు కొన్ని నగరాల్లో వీటిని బ్యాన్ చేస్తుంది.. ఇది పండగలో భాగం కాదు అని. మన సంప్రదాయాలకు విశ్వాసానికి విలువ లేదు అని.
ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడైనా ఉందా!
రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉంటే ఏదైనా వాహనం లో వెళ్లాలంటే... దానికి హెడ్ లైట్స్ బాగా ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం. అలాగే చీకటి ప్రాంతంలో వెళ్లేటప్పుడు ఇది టార్చ్ లైట్ పట్టుకెళ్ళేవాళ్ళం. అలాగే మన కాలాన్ని గాని పరిశీలన చేస్తే చీకటి పడే సమయం భాద్రపద మాసము అని (సంవత్సరాన్ని ఒక రోజుగా భావించే సమయంలో చెప్పే మాట) ఆరోజు పితృదేవతలు భూమిపైకి వస్తారని చెప్పుకుంటూ ఉంటాం దానికి మహాభారతం అవకాశం ఇస్తుంది. ఆశ్వీజ మాసం అంటే భచక్రంలో ఒక లగ్న సమానం గా ఉండే కాలంలో పితృదేవతలు వెనకకు మళ్లటానికి అవకాశాన్ని తీసుకుంటారు. అలా వెళ్లేటప్పుడు ఆకాశమార్గం కాంతివంతంగా ఉండాలని.... తిరిగి ప్రయాణమైన పితృదేవతలకి దారి చూపించడానికి వెలుగు అవసరమని... ఆ వెలుగులో పితృదేవతలు ప్రయాణం చేస్తారని... మన భారత దేశ స్క్రిప్చర్సే కాకుండా చైనా ప్రజలు కూడా నమ్ముతారు. ఆశ్వీజం అయిపోయిన తర్వాత వచ్చే కార్తీకమాసంలో ప్రతి గుడిలో ఆకాశదీపాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ వెలుగు నెల రోజులు వెలుగుతూనే ఉంటుంది. కార్తీక మాసం అయిపోయి లోపు పితృదేవతలు స్వర్గానికి చేరుకుంటారు. దీపావళి మనం కాల్చే బాణసంచా వెలుగులు మన పితృదేవతలకు దారి చూపించడానికి ఉపయోగపడుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకనే మనం బాణాసంచా కాలుస్తున్నాము. పిల్లల పెళ్లి చూడాలని ఆశపడి ఆశ తీరక కాలం చేసిన వారి కోసం ఈ కార్తీకమాసంలో ముహూర్తాలు పెడుతూ ఉంటారు. పితృదేవతల సంతృప్తి కోసం వారు ఇక్కడే ఉండి ఈ కళ్యాణాన్ని చూసి ఆనందించి ఆశీర్వదిస్తారని. ఇది కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం. 🙏🌹🙏
Comments
Post a Comment