వ్రణయోగం
*వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహముల సన్నివేశముల వలన జాతకునికి “వ్రణయోగం” ఏర్పడుతుంది అని తెలుపబడింది. కాన్సర్ ని వ్రణం అని అంటారు. సాధరణంగా 6వ స్థానాధిపతి పాపగ్రహం అయినపుడు (7వ భావాధిపతి లేదా 8వ భావాధిపతి యొక్క నక్షత్రములలో 6వ భావాధిపతి ఉన్నప్పుడు) మరియు ఆ గ్రహం లగ్నంలో గాని లేదా అష్టమ భావములో గాని లేదా దశమ భావంలో గాని ఉన్నట్లైతే, ఆ జాతకులకు ఆ గ్రహం యొక్క వింశొత్తరి మహా దశ జరుగుతున్న సమయములో కాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.*
*కన్యా లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, మిధున లగ్నం, వృశ్చిక లగ్నం మరియు మీన లగ్నం వారికి ఎక్కువగా ఈ కాన్సర్ వచ్చిన సూచనలు ఉన్నాయి.*
*సాధారణంగా అన్ని రకముల దీర్ఘకాలవ్యాధులకు శని కారణము అయి ఉంటాడు. ఒకవేళ కాన్సర్ కారక గ్రహం, శనితో కలసినా (లేదా) శని దృష్టి పడినా (లేదా) శని అధిపతిగా ఉండు నక్షత్రాలలో ఉండినా (లేదా) శని అధిపతిగా ఉన్న రాశులలో ఉన్నా ఈ కాన్సర్ వ్యాధిని నివారించుటకు చాలా కాలం పడుతుంది. అంతేకాకుండా శని గాని లేదా కాన్సర్ కు కారకమైన గ్రహం గాని జాతకములో వక్రించి ఉంటే , ఆ జాతకులకు వచ్చిన జబ్బు నయం కావటానికి చాలా కాలం పడుతుంది.*
*శని మరియు రాహువు కలసి జన్మకుండలిలో రెండవ స్థానములో ఉంటే ఆ జాతకులు ఖచ్చితంగా పొగాకు నమలటం మరియు ధూమపానం చేయటం వంటి అలవాట్లు ఉంటాయి. ఎవరికైతే ఇక్కడ వివరించిన గ్రహ స్థితులు ఉన్నాయో వారు చాలా జాగ్రత్త వహించాలి*. *పొగాకు వదిలేసేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రహ కలయిక వలన నోటి కాన్సర్, Throat కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి.*
Comments
Post a Comment