మంచి మొగుడొస్తాడు

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన ఒక అద్భుతమైనటువంటి...‌ పాట ఇప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయే.. ఒక అద్భుత ప్రయోగం.... గురించి నా మాటల్లో......

దీని గురించే నేను ఎందుకు వ్రాయాలి అనుకున్నాను అంటే... ఈ చిత్రంలో టైటిల్ సాంగ్. సావిత్రి గారి చివరి సినిమా... సావిత్రి గారి అంతిమయాత్ర ని చూడటానికి...

ఆవిడ జీవితం గురించే వ్రాసారా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు... అన్నట్లుగా అనిపించే వ్యవహారం...
అలాగే కొంతమంది అది వ్రాసి పెట్టమని... అడగటం వల్ల దానిలోని సాహిత్య విలువలు తెలియజేద్దామనే ఉద్దేశ్యంతో..

గోరింట పూచింది కొమ్మలేకుండా(కొత్తగా పెళ్లయినటువంటి అమ్మాయికి కడుపుపండి సంతానం కలిగింది)
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది(ఆ పాపని చాలా అందంగా చేతుల్లో ఎత్తుకొని పెంచుకుంటున్నాము అని)
గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

ఎంచక్కా పండిన ఎర్రని చుక్క, (పుట్టిన పాప కూడా పెద్దగా, అయిన తర్వాత రజస్వల అయినట్లుగా ఒక భావన)
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
చిట్టిపేరనంటాలికి శ్రీరామరక్ష (అటువంటి పాపకి శ్రీరాముడు లాంటి భర్త రావాలి అని కోరిక)
కన్నేపేరంటాలికి కలకాలం రక్ష(కన్నెపిల్లకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అని తల్లిదండ్రులు ఆశని వ్యక్తపరుస్తుంది)

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

చరణం::1

మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు(తొలి కిరణం పడినప్పుడు ఉండే రంగు మామిడి చిగురు ఎరుపు, వసంతాన్ని సూచన చేస్తూ లగ్నాన్ని పుట్టిన సమయాన్ని సూచన చేసేటువంటిది)
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు(కిరణం మాణిక్యానికి చిహ్నమైన రవి యొక్క కిరణము అనిఅర్థం)
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు

సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు(సంధ్య కాలము యందు బలము కలిగినటువంటి వాడు కుజుడు)
సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన(తన వారిలోన పెళ్లి చేయాల్సిన యుక్త వయసు వచ్చేసరికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతుంది)

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

చరణం::2

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు (దోషము లేని లగ్నం అనగా కుజ దోషము ఈ మందారాన్ని జపాకుసుమం అంటారు, లగ్నానికి కుజదోషం లేకపోతే మంచి మొగుడు వస్తాడు)
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు(, గన్నేరు పువ్వుల రంగు గలిగినటువంటివాడు శుక్రుడు, ఆ శుక్రుడికే దోషము లేకపోతే ఆస్తిపరుడు కలవాడొస్తాడు)
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు

సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా(పున్నమినాటి చంద్రుడు ఆవిర్భావ సమయాన కనపడేటువంటి చంద్రుడి రంగు. ఈ చంద్రుడు కే కానీ ఎటువంటి దోషము లేకపోతే )
సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగివస్తాడు(అందమైన తెలివిగలిగిన భర్త లభిస్తాడు)

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్లు కోపిష్టి కళ్లు(పైన చెప్పిన లగ్నము శుక్రుడు చంద్రుడు వీరి మీద ‌ పాప గ్రహ దృష్టి, వక్ర గ్రహ దృష్టి పడకూడదని కోరిక)
పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్లు కోపిష్టి కళ్లు
పాపిష్టి కళ్ళలో పచ్చాకామెర్లు(పొపులతో కలిసిన బుధుడిని గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు)
పాపిష్టి కళ్ళలో పచ్చాకామెర్లు(లోకంలో జరిగే పాపిష్టి కార్యక్రమాలను మనకు ఆపాదించి అనుమానంతో అగచాట్లకు గురిచేయడం)
కోపిష్టి కళ్ళలో కొరివీమంటల్లు(అస్తంగత్వం చెందినటువంటి గ్రహాలు కల్లోలానికి కాపురంలో మంటలకి కారణం అవుతుంది)

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది


ఇది సావిత్రి జీవితానికి సరిగ్గా సరిపోతుందని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఆలోచించి వ్రాసారు ఏమో తెలియదు నాకు 
 కానీ నాకు మాత్రం అచ్చం అలాగే అనిపించింది 
 ఈ పాటకి జ్యోతిష్యంతో సంబంధం ఉంది అని నా భావన. కవి భావన ఇలా అయి ఉండవచ్చు అవ్వకపోయి ఉండవచ్చు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: