తిధులు
తిధులు........!!
సూర్య చంద్రుల మద్య దూరాన్ని తిధి అంటారు. చంద్రుడు సూర్యుడిని దాటి 12° నడచిన ఒక తిధి అగును.శదీనిని శుక్లపక్ష పాడ్యమి అంటారు. చంద్రుడు సూర్యున్ని దాటి 180° నడచిన దానిని శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, చంద్రుడు సూర్యున్ని దాటి 180° వరకు ఉన్నంతకాలం శుక్ల పక్షం. చంద్రుడు సూర్యున్ని దాటి 180° నుండి 360° వరకు నడుచు కాలం కృష్ణ పక్షం అగును. ఒక నెలలో శుక్ల పక్షం, కృష్ణ పక్షం అను రెండు భాగాలుగా చేయబడింది. శుక్ల పక్షంలో 15 తిధులు, కృష్ణ పక్షంలో 15 తిధులు ఉంటాయి. శుక్ల పక్షం లో 15వ తిధి పూర్ణిమ, కృష్ణ పక్షంలో 15 వ తిధి అమావాస్య.
నంధ తిధులు :- పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిధులను నంధ తిధులు అంటారు. నంధ తిధులు ఆనందాన్ని కలిగిస్తాయి. శిల్పం, యజ్ఞ యాగాది కర్మలకు, వివాహానికి, ప్రయాణానికి, కొత్త వస్త్రాభరణములకు, వైద్యం, మంత్ర విద్యలు నేర్చుకొనుటకు నంధ తిధులు పనికి వస్తాయి.
భద్ర తిధులు :- విదియ, సప్తమి, ద్వాదశి తిధులను భద్ర తిధులు అంటారు. ఆత్మ రక్షణ కలిగిస్తాయి, వాస్తు కర్మలకు, యాత్రలకు, ఉపనయనమునకు, పూజలకు, విధ్యాబ్యాసమునకు, వాహనముల అధిరోహణకు, సంగీతం, ఆహారసేకరణకు భద్ర తిధులు మంచివి.
జయ తిధులు :- తదియ, అష్టమి, త్రయోదశి తిధులను జయ తిధులు అంటారు. జయాన్ని కలిగిస్తాయి. వివాహం, గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు, యుద్దం, ఆయుధ దారణ, అధికారులను కలవటం, విద్యార్హత పరీక్షలు వీటికి జయ తిధులు మంచివి.
రిక్త తిధులు :- చవితి, నవమి, చతుర్ధశి తిధులను రిక్త తిధులు అంటారు. ఫలితాన్ని ఇవ్వలేవు. అగ్నిసంబంధ కర్మలకు, అసత్య భాషణకు, విరోదాలకు, హాని కలిగించే విషయాలకు, పాప కార్యాలకు రిక్త తిధులు మంచివి.
పూర్ణ తిధులు:- పంచమి, దశమి, అమావాస్య, పౌర్ణమి తిధులను పూర్ణ తిధులు అంటారు. పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అమావాస్య ముందు పితృకర్మలను, మిగిలిన తిధుల యందు సకల శుభ కర్మలను, వివాహం, ప్రయాణాలు, శాంతులు పూర్ణ తిధులు మంచివి, పౌర్ణమి యాత్రకు పనికి రాదు.
సిద్ధ తిధులు :- శుక్రవారంతో కూడిన నంధతిధులు, శనివారంతో కూడిన రిక్తతిధులు, గురువారంతో కూడిన పూర్ణ తిధులు, సిద్ధ తిధులు అనబడును. ఇట్టి తిధుల యందు సర్వ కార్యములు సిద్ధించును, నెరవేరును.
దగ్ధ తిధులు :- ఆదివారం ద్వాదశి, సోమవారం ఏకాదశి, మంగళవారం పంచమి, బుధవారం తదియ, గురువారం అష్టమి, శనివారం నవమి, కలసిన దగ్ధతిధులు అంటారు. అన్ని శుభకర్మలయందు ముఖ్యముగా వాస్తు కర్మలయందు నిషిద్దం.
Comments
Post a Comment