జ్యోతిష అనుభవం

జ్యోతిష అనుభవం అంత తేలికగా రాదు...దానికోసం అధిక సమయాన్ని కేటాయించాలి అహర్నిశలు దానికోసం ఉండాలి...గణిత విభాగం తెలిసియుండాలి...ఈ రోజుల్లో గణితవిభాగానికి అంత సమయం అవసరం పడుట లేదు..కావలసినన్ని సాఫ్ట్వేర్ లు అందుబాటులో ఉన్నాయి..రెడీమేడ్ గా చార్ట్స్ వస్తాయి..కాని ప్రెడిక్షన్ చేయాలంటే 
సంహిత విభాగం, సంజ్ఞ విభాగం బాగా తెలియాలి...అలాగే నక్షత్రజ్ఞానం లో పట్టు ఉండాలి అప్పుడే ముహూర్తజ్ఞానం కలుగుతుంది..ఆ తరువాత ఫలితవిశ్లేషణ (హోరాశాస్త్రం) మీద పట్టు ఉండాలి..దశావిశ్లేషణ, గోచార జ్ఞానం, ప్రశ్నాజ్ఞానం, శకున జ్ఞానం, స్వరజ్ఞానాల మీద పట్టుని సాధించాలి...దీనికి కనీసం రోజుకి 10 నుండి 15 గంటల సమయాన్ని కనీసంలో కనీసం 10 నుండి 15 సంవత్సరాలయినా కేటాయించాలి...అంతేకాదు గ్రంథాలలో ఉన్న బావతాత్పర్యాలలో నిగూఢముగా నిక్షిప్తము చేసిన జ్యోతిష జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి...అన్నిటి కంటే అదే కష్టం..రజోతమోగుణ మానసిక స్థితి కలిగియున్నవారికి అర్థతాత్పర్యాలలో వేరేలా అర్థం గోచరిస్తుంది...కేవల సత్వగుణాన్ని కలిగియుండాలి ..మనసావాచకర్మణ అప్పుడే అర్థతాత్పర్యాలలో నిక్షిప్తం చేసిన జ్యోతిష జ్ఞానాన్ని పొందగలరు...అప్పటి వరకు జ్యోతిషగ్రంథాలు ఎడారిలో ఎండమావిలా గోచరిస్తాయి...
🙏తస్మైశ్రీ గురుమూర్తయే నమః ఇదంశ్రీ దక్షిణామూర్తయే🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: