గురు భగవానుడు
గురు భగవానుడు ఏదైనా ఒక రాశిలో ఒంటరిగా ఉంటే ఆ భావాన్ని పాడుచేస్తారు అని కొందరు నిర్ధారణ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కొన్ని సూక్ష్మ విషయాలను పరిశీలించాలి. గురు భగవానుడు ఒక స్థానంలో వేరే ఇతర గ్రహాలతో కలవకుండా ఉంటే ఒంటరిగా ఉన్నట్టుగా నిర్ధారించరాదు. ఒక రాశిలో గురు భగవానుడు మాత్రమే ఉండి గురు భగవానుని దృష్టిలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు, లేదా గురు భగవానుడు పై వేరే గ్రహాల యొక్క దృష్టి ఉన్నప్పుడు గురువు ఒంటరిగా లేరు అని నిర్ణయించాలి. శుభగ్రహ స్థానాలైన వృషభం మిధునం కన్యాతుల ధనుస్సు మీనం లలో గురు భగవానుడు ఒంటరిగా ఉంటే ఆ భావాన్ని కచ్చితంగా పాడు చేస్తారు. ఉదాహరణకు మీన లగ్నం .. ధనస్సులో గురువు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ జాతకుడికి ఉద్యోగంలో వడిదుడుకులు ఆదాయంలో అవాంతరాలు ఏర్పడతాయి. అలా కాకుండా గురు భగవానుడు పాపగ్రహ స్థానాలలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భావాన్ని పాడు చేయరు. కర్కాటకంలో గురు భగవానుడు ఉచ్చ స్థితి పొందుతారు కానీ చంద్రుడు యొక్క స్థితిని కూడా గమనించాలి పూర్ణ చంద్రుడు అయి ఉంటే గురు భగవానుడు మంచి ఫలితాలను ఇస్తారు. క్షీణచంద్రుడు అయితే గురు భగవానుడు తాను ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ ఫలితాలను ఇవ్వలేని స్థితిలో ఉంటారు. జ్యోతిష శాస్త్రంలోని ఇటువంటి సూక్ష్మ విషయాలను పరిగణలలోనికి తీసుకుని జాతక పరిశీలన చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు చెప్పవచ్చు
Comments
Post a Comment