స్థిత ప్రజ్ఞుడు అంటే అర్థం?

స్థిత ప్రజ్ఞుడు అంటే అర్థం?

 స్థిత ప్రజ్ఞుడు అనే పదం సంస్కృత భాష నుండి వచ్చిందే. ఇది భగవద్గీతలో ప్రస్తావించబడిన ఒక ప్రధాన అంశం. స్థిత ప్రజ్ఞుడు అనగా, ఏ పరిస్థితుల్లోనైనా మనస్తత్వంలో స్థిరత్వం కలిగి ఉండే వ్యక్తి.

 *భగవద్గీతలో* వివరణ: భగవద్గీత 2వ అధ్యాయం (సాంఖ్య యోగం) లో స్థిత ప్రజ్ఞుడి గుణాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ముఖ్యంగా, స్థిత ప్రజ్ఞుడు ఎటువంటి పరిస్థితులనైనా సమానంగా స్వీకరిస్తాడు, అతని మనసు అలజడికి గురికాదు.

 *"దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విఘతస్పృహః"* 

(దుఃఖంలో చిక్కుకోక, సుఖంలో తగిన ఆసక్తి లేకుండా ఉంటాడు.)

 *"వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే"* 

(రాగం, భయం, క్రోధం లేని వ్యక్తి స్థిత ప్రజ్ఞుడని పిలువబడతాడు.)

ఎక్కడా దేనికి తలొగ్గకుండా,శుభా అశుభాలని పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచి ఉంటాడో అతనే స్థితప్రజ్ఞుడు అని పిలవబడతాడు

 *స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు:* 

 *సంయమనం* : సుఖం లేదా దుఃఖం వంటి విపరీత పరిస్థితులలో సమచిత్తంతో ఉండటం.

 *రాగద్వేషరహితత్వం* : ఆకర్షణలు (రాగం) మరియు ద్వేషాలు (విరక్తి) లేకుండా ఉండటం.

 *ఇంద్రియ నిగ్రహం:* ఇంద్రియాలను (చక్షు, శ్రవణ, వగైరా) నియంత్రించుకుని జ్ఞానం వైపు మనస్సును మరలించడం.

 *స్వతంత్ర ఆత్మగౌరవం* : బాహ్య పరిస్థితుల వల్ల ప్రభావితంకాకుండా తనను తాను నడిపించుకోవడం.

 *ఆత్మసమాధానం* : తన ఆత్మలోనే తృప్తి కలిగి ఉండడం, అనర్థపు ఇంద్రియానందాలపై ఆధారపడకపోవడం.

 స్థిత ప్రజ్ఞుడు కావడం ఒక ప్రయాణం. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. కానీ నిరంతర ప్రయత్నంతో ఎవరైనా స్థిత ప్రజ్ఞుడు కావచ్చు. స్థిత ప్రజ్ఞుడు కావడం వల్ల మనం జీవితాన్ని మరింత సంతోషంగా మరియు ప్రశాంతంగా గడపవచ్చు.

ప్రతి జ్యోతిష్యుడు ఈ ప్రయాణంలో భాగంగా ఉండవలసినవారే. 

దారిలో మనకు కలిగే అడ్డంకులనే క్లేశాలు అంటారు.  ఇవి యోగ శాస్త్రంలో ఐదుగా చెప్పబడ్డాయి. 

1. అవిద్య 
2. అస్మిత 
3. రాగము
4. ద్వేషము 
5. అభినివేశము  

మనమందరము ఈ ఐదు క్లేశాలకు కట్టుబడి ఉంటాము. 

సరైన విజ్ఞానాన్ని తెలిపి సత్యాన్ని వెలుగులోకి తెచ్చేదే విద్య. మనవి కానివి అన్ని మనవి అని అనుకోవడమే అవిద్య. ఈ అవిద్య వల్లే మిగిలిన నాలుగు క్లేశాలు మనలను బాధిస్తాయి. దేహమే నేను అనుకోవడం అవిద్య. ఇలా మనసులో భావించి నేను, నాది అనుకోవడమే అస్మిత. దీన్నే అహంకారము అంటారు. ఈ నేను నాదిలో నుంచే రాగము వస్తుంది. ఈ దేహానికి సంబంధించినవాటన్నిటి మీద మమకారం ఉంటుంది. ఈ మమకారమే రాగం. ఈ రాగం సత్యమనుకుంటూ, ఇదే శాశ్వతం అనుకుంటూ వైరాగ్యమంటే ద్వేషం పెంచుకుంటున్నాము. ఇక చివరిది అభినివేశం. అంటే ప్రాణంమీద తీపి. మనతో ఉన్నవి అన్ని వదిలి వెళ్ళాలి అంటే భయం. నా అన్న వారికి దూరం అయిపోతాం అన్న భయం. ప్రాణాలు దక్కించుకోవడానికి మనం చేయని ప్రయత్నం ఉండదు. ఇది మానవ సహజం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: