ఇంద్రుడు, మిత్రుడు,
ఇన్ద్రం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్యః స సుపర్ణో గరుత్మాన్ ।
ఏకం సత్ విప్రా బహుధా వదన్త్యగ్నిం యమం మాతరిశ్వానమాహుః ॥
(ఋగ్వేదం మొదటి మండలం, 164వ సూక్తం, 46వ శ్లోకం)
ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, దివ్యమైన అగ్ని, సుపర్ణుడైన గరుత్మాన్, ఎవరైనా సత్తు అన్నది ఒక్కటే. విప్రులు అగ్ని, యముడు, మాతరిశ్వాన్ అని పలుపేర్లతో పిలిచినా!
ఆ రోజుల్లో ప్రముఖమైన దేవతల పేర్లు కూడా ఈ శ్లోకం ద్వారా తెలుస్తాయి. విష్ణువు, శివుడు ఆ రోజుల్లో ప్రముఖ దేవతలు కారని, వినాయకుడు, కుమారస్వామి మొ॥ లేరని, వారంతా ఆధునిక దేవతలని మనం ఊహించవచ్చు.
ఈ సూక్తానికి కర్తగా పేర్కొనబడిన దీర్ఘతముడు కొన్ని అద్భుతమైన శ్లోకాలను సృజించాడు. లోతైన సూక్తాలను అందజేసిన ఈ ఋషి పుట్టిగుడ్డి అని భీష్ముడు భారతంలో వివరించాడు
Comments
Post a Comment