మహాభారతం- జయ గ్రంథం అంటారు...
*సుఖభోగ భాగ్య దృఢగాత్ర సంయుతో*
*నిహతాహితో భవతి పాపభీరుకః।*
*ప్రథితప్రధాన జనవల్లభోధనః -*
*ద్యుతిమిత్రకీర్తి సుతవాంశ్చ హర్షజః ।*
*త్రిదశత్రికోణచతురశ్రసప్తమా*
*నవలోకయంతి చరణాభివృద్ధితః |*
*రవిజామరేడ్యరుధిరాః పరే చ యే*
*క్రమశో భవంతి కిల వీక్షణేఽధికాః ||*
పంచమంలఘసర్వత్రా
సప్తమం ద్విచతుర్ధయో
గురు షష్టంచ పాదానాం
చతుర్ణాంస్యదనుష్ఠపి.
మహాభారతాన్ని అందరూ జయ గ్రంథం అంటారు...
రామాయణం కూడా జయ గ్రంథం అనవచ్చేమో....
జయ జయ రామ...
ఎలాగంటారా...
రామాయణాన్ని అన్ని శ్లోకాలు రూపకంగా రాశారు.
శ్లోకం అంటే ఏమిటో తెలుసు కదా....
పంక్తి కి ఎనిమిది అక్షరాలు నాలుగు అక్షరాల స్వేచ్ఛ గా వదిలేసి ఐదు ఆరు ఏడు అక్షరాల మీద నియమం పెట్టి వ్రాస్తుంది శ్లోకం. ఎటువంటి విశేషాలు ఉండాలి అనేటువంటిది నేను పైన శ్లోకంలో చెప్పింది చూసి ఉంటారు.
ఈ క్రింది విధంగా వ్రాయబడి ఉంటుంది శ్లోకం.
IUU ( *య* గణం)
IUI( *జ* గణం)
IUU ( *య* గణం)
IUI( *జ* గణం)
క్రింది నుంచి పైకి చూస్తే
జయ జయ అని వస్తుంది ఇది రాముడి కై చెబుతున్నటువంటి కీర్తన
జయ జయ రామ
రామాయణంలో ప్రతి శ్లోకము రామకీర్తన... జయజయ రామ.
ఈ విధంగా రామాయణం కూడా జయ గ్రంథమే మహాభారతం కూడా జయ గ్రంథమే ఏ ఒక్క శ్లోకాన్ని పటించిన జయ జయ రామ అని పలికినట్లే. 🙏🌹🙏
రామాయణంలో హనుమంతులవారి నుండి ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాలలో "జయ జయ ధ్వానాలు" చేయటం మన రామాయణంలో చూడగలము. కనుక *రామాయణమును "జయ జయ ధ్వానాల గ్రంథము* అని పిలుచుకోవచ్చండి.
Comments
Post a Comment