చాణక్యుడికి జ్ఞానొదయము...*
*చాణక్యుడికి జ్ఞానొదయము...*
చాలా సంవత్సరాల క్రితం తక్షశిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేసాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి, చంద్రగుప్తుడిని రాజు చేసాడు.
ఒక రోజు చంద్రగుప్తుడితో పాటలీపుత్ర నగరం మీద దండయాత్ర చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అలసటనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హటాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడిలిపొయిన అవ్వ “ఏమైంది బాబు” అంటే ఆ బాలుడు “అన్నం వేడిగా ఉంది, చేయి కాలిందమ్మ” అన్నాడు.
“అదే మరి, నువ్వూ చాణక్యుడిలానే ఉన్నావు,” అంది అవ్వ. “ఎవరైన అన్నం మధ్యలో చేయి పెడతార.. పక్కలనుంచి చిన్నగా తింటూ రావాలికాని” అంది.
ఇదంతా అరుగుమీద కూర్చుని వింటున్న చాణక్యుడికి జ్ఞానోదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుదు వాళ్ళకు బాగా పట్టు వున్న పాటలీపుత్ర మీద దండయాత్ర చేస్తే కలిగేది నిరాశే అని అర్ధం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టు పక్కలనున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాటలీపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు.
ఈ సంఘటన భారత దేశ చరిత్రనే మార్చేసింది...
Comments
Post a Comment