కనక ప్రభ

కనక అనే పదానికి అందరికీ తెలిసిన విషయమే బంగారం
ప్రభ అనే పదానికి అర్థాలు: కాంతి, గ్లో, ప్రకాశించు, ప్రకాశం, ఒక అప్సర లేదా ఖగోళ వనదేవత. 
కనక ప్రభ అనే మాటకి అర్థం ఏమిటంటే బంగారు కాంతి.... హిరణ్య గర్బడైన సూర్యుని యొక్క కిరణ విస్తృతి. 
అయితే ఈ కనక ప్రభకి అనేకమైన పేర్లు ఉన్నాయి మొదటగా కనకప్రభ అనేటువంటి దానిని గురించి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 

మొదటిగా త్రిదశ త్రికోణ.. అనే శ్లోకం BJ లోనిది. గ్రహాలన్నిటికీ దృష్టి ఉంది. అది ఎక్కడ ఉన్నది అంటే....
3,10. 5,9. 4,8 మరియు 7 గృహాల మీదకి దృష్టి కలిగి ఉంటుంది. 1 మీద కూడా దృష్టి ఉంటుంది అని అనుకోవాలి. ఇక మిగిలిన నాలుగు మీద అసలు దృష్టి అనేది ఉండదు. 

అవి ఏమిటి అంటే 2,6,11,12 రాశుల మీద దృష్టి పడనే పడదు. దృష్టి పడటం అంటే ఏమిటి?

శూన్యంలో ఉన్న మన మండలం లో కాంతి ప్రసరణ జరగటం వలన మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కాంతులీనుతూ 360 డిగ్రీల పరిధిలో... 240 లేక 210 డిగ్రీల వరకు కాంతి ప్రశరిస్తున్నది 120 లేక లగ్నం కూడా లేకపోతే 150 డిగ్రీలకు కాంతి ప్రసరించడం లేదు. అది ఏ ఏ డిగ్రీల దగ్గర అనేటువంటిది స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాంతి ప్రసరణ దృష్టి అనటం జరుగుతుంది. దీనినే దృష్టి అంటున్నారు. ఆచార్యులు ఈ దృష్టిని గురించి కనక ప్రభ శ్లోకాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. శ్లోకం అంటే ఎనిమిది అక్షరాల అనుష్టుప్ మాత్రమే... సరిగ్గా చెప్పాలి అంటే ఆచార్యులు ఇక్కడ చెప్పిన శ్లోకాన్ని... కనక ప్రభని ఎంచుకున్నారనే చెప్పాలి. శ్లోకమని కాక కనక ప్రభ అని ఉటంకించాలి. కానీ మనకి ఛందో జ్ఞానం కొరవడంతో అన్నిటిని శ్లోకాలు అని పిలుస్తున్నాం. 
కాంతి ఉంటే ప్రయాణం తేలికవుతుంది. ఎలాగంటే... ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు విద్యుత్ కాంతులు ఉంటే రాత్రిపూట కారు వేగంగా నడపవచ్చు. అలాకాకుండా కాంతి అనేది లేక కరెంటు పోతే... మన కారు వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది అందరికీ అనుభవ సత్యమే. చీకటి అయిన విద్యుత్ కాంతులు ప్రసరించుట ఆ దూరం దాటడం చాలా తేలిక.. మన జ్యోతిష్యంలో ఎనిమిదో ఇంటి మీద కాంతి ఎక్కువగాని ఉంటే ప్రదేశాన్ని మనం చాలా తేలికగా దాటవచ్చు. అంటే కష్టాల్లో కూడా చాలా సులభంగా దాటి రావడం. అందుకని దృష్టి పదాన్ని అలా వాడుకోమని ఆచార్యులు చెప్తూ ఇచ్చారు.
 ఈ కనక పభ నే ఫలదీపికలో ఆరవ అధిపతి ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన విపరీత రాజయోగం కలుగుతూ దానిని హర్ష రాజ యోగము అని పిలవడం జరిగింది. ఆరవ ఇంటిలో కాంతి విహీనంగా ఉంటుందని మనం చదువుకున్నాము. అది ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన కాంతి విక్షేపణ వల్ల నక్షత్ర సమూహ ఫలితాలు అనేటువంటి వస్తాయి అనేటువంటిది మంత్రేశ్వరుల యొక్క వాదన. తద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి అని సూచన చేయటం అవుతుంది. 

జ్యోతిష్య పుస్తకాలలో కనక ప్రభ ఎక్కడ దర్శనమిచ్చిన ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఇవ్వడం జరిగింది. విజ్ఞులు వాటిని పరిశీలించుదురుగాక.

 *సుఖభోగ భాగ్య దృఢగాత్ర సంయుతో* 
 *నిహతాహితో భవతి పాపభీరుకః।* 
 *ప్రథితప్రధాన జనవల్లభోధనః -* 
 *ద్యుతిమిత్రకీర్తి సుతవాంశ్చ హర్షజః ।* 

ఈ శ్లోకాన్ని గమనించి ఉన్నట్లయితే... ఒత్తులతో ఉన్న అక్షరాలు ఎక్కువగా ఉంటాయి. శాస్త్రంలో ఇటువంటి అక్షరాలు బాగా కష్టాలను తీసుకుని వచ్చే విధానాన్ని ప్రకటించడంలో ప్రకటించడం జరుగుతుంది. ఒత్తి పలికేటువంటి విధానము దక్షిణాదిలో అధికంగా ఉంటుంది. అలాగే ఉత్తరాదికి వెళ్తున్న కొద్ది తేల్చి పలకడం అలవాటు అవుతుంది. ఈ విషయం మీద ఒక వీడియో కూడా పెట్టాను.

శాస్త్రంలో ఒక్కొక్క అక్షరానికి ఎంత విలువ ఇచ్చి వ్రాసారో అర్ధమైతే... మనమంత తీక్షణంగా అంత శ్రద్ధగా చదవాల్సిన అవసరం అర్థం అవుతుంది

ఒత్తి పలికే అక్షరాలు 10 వ్రాశారు
 ఇందులో ఇదో విశేషం

 ఈ శ్లోకం చదవడం అంత తేలిక కాదు... ఎందుకు ఇంత కఠినంగా ఉంటుంది అంటే షష్ఠాధిపతి అష్టమములో ఉంటే విపరీత రాజయోగం అంటారు కదా... అందుకోవటం ఎంత కష్టమో ఇది చదవడం కూడా అంతే కష్టం. ఒకసారి దీన్ని చదివిన తర్వాత... విపరీత రాజయోగం పొందడం ఎంత కష్టమో అర్ధం అవుతుంది. చార్టులో విపరీత రాజయోగం కనపడగానే ఒళ్ళు పొంగినట్టు ఫలితాలు చెప్పేటువంటి వారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే... ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదివి (తప్పు లేకుండా), తర్వాత అనుసరించి చెప్పవచ్చు. ఇది సరిగ్గా చదవటానికి మీరు పడే కష్టం ఏది అయితే ఉండదు అంతకు వెయ్యి అంతలో విపరీత రాజయోగం అందకోవటానికి పడవలసి వస్తుంది. ఇది అర్ధమైన తరువాత మీరు వారికి విపరీత రాజయోగం గురించి చెప్పవచ్చు

*త్రిదశత్రికోణచతురశ్రసప్తమా* 
 *నవలోకయంతి చరణాభివృద్ధితః |* 
 *రవిజామరేడ్యరుధిరాః పరే చ యే* 
 *క్రమశో భవంతి కిల వీక్షణేఽధికాః ||*

ఎక్కడ ఒత్తు పలుకుతామో అక్కడ ఆగి జాగ్రత్తగా శ్లోకం చదవాల్సి వస్తుంది. అలాగే జీవితంలో కూడా ఆగి మనల్ని మనం దర్శించుకుని ఒకసారి జాగ్రత్తపడి మరల ముందుకు వెళ్లాల్సిన అవసరం వస్తుందని శ్లోకం మనకు తప్పకుండా చెబుతుంది

శ్లోకం ఎందుకు చదవాలి అంటే ఉన్నదే చూస్తే సరిపోతుంది కదా అంటే చదివి అనుభవించి అనుభవంలో కొత్త విశేషాన్ని కనుగొని దాని యొక్క పర్యవసానం ఫలిత విశ్లేషణలు చెప్పవలసిన అవసరం ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: