గ్రహదోషాలు - తాంత్రికపరిహారాలు.....
గ్రహదోషాలు - తాంత్రికపరిహారాలు..........!!
రాహువు: రాహుగ్రహానికి చిన్నమస్తదేవి అధిపతిగా ఉటుంది . తంత్రశాస్త్రం ప్రకారం చూసినట్లయితే తన కుమారుడైన పరశురాముడిచేత శిరస్సు ఖండించబడిన మహా పతివ్రత అయిన రేణుకాదేవి యొక్క అవతారమే ఈ చిన్నమస్తా దేవి. ప్రమాదాలు, పాముకాట్లు, దొంగతనాలు, శత్రువుల దాడులు, నమ్మకద్రోహం, ఆకస్మికంగా ఎదురయ్యే చెడు సంఘటనలు లాంటివి జాతకచక్రములోని చెడు స్థితిలో ఉన్న రాహువు కారణంగా జరుగుతాయి. ఈవిధమైన సమస్యలతో బాధపడేవారు చిన్నమస్తాదేవిని మహాయంత్ర రూపంలో పూజించాలి. ఈమెను పూజించటం వల్ల జాతకులకు రాహుగ్రహ అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. ఫలితంగా అకస్మాత్తుగా అదృష్టం కలుగుతుంది.
జాతకచక్రములో 1వ స్థానం /8వ స్థానం /12వ స్థానంలో రాహుగ్రహం ఉన్నా లేదా జాతకచక్రంలోని ఏ స్థానంలో అయినా రాహుగ్రహం - కుజుడు లేదా శనైశ్చరుడితో కలిసి ఉన్నా జాతకులకు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యల పరిహారంకోసం చిన్నమస్తాదేవిని ఆరాధించాలి.
రాహువు మరియు శనైశ్చరుడు కర్మగ్రహాలు, అందువలన, ఏ జాతకంలో అయినా సరే ఏదో ఒక స్థానంలో శనైశ్చరుడు మరియు రాహుగ్రహాలు కలిసి ఉన్నట్లైతే ఆ జాతకులు, గత జన్మలో తాము చేసిన చెడు కర్మల యొక్క ఫలితాలను ఈ జన్మలో నిర్బంధంగా అనుభవించాల్సివుంటుంది. ఈ గ్రహస్థితిని "శపిత యోగం " అంటారు . అతి తీవ్రమైన సమస్యలను ఇచ్చే ఈ శాపితయోగం తొలగిపోవడం కోసం చిన్నమస్తాదేవిని ఆరాధించాలి.
Comments
Post a Comment