తిరుపతి పుట్టిన రోజు*

*నేడు తిరుపతి పుట్టిన రోజు*

పుట్టిన రోజులు మ‌నుషుల‌కే కాదు, ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తికి ఉంది. 

తిరుపతి నగరం క్రీ.శ.1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ వైష్ణవ సంప్ర‌దాయాల్ని ఆచ‌రించే భగవద్ శ్రీ‌రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. నాడు తిరుప‌తి న‌గ‌రానికి రామానుజాచార్యుల చేతుల మీదుగా పునాది వేయ‌డం, అనంత‌ర కాలంలో దిన‌దినాభివృద్ధి చెందుతూ వ‌చ్చింది.

సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్రం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యాలు చేసేశారు. నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. మొద‌ట రామానుజ‌పురంగా, ఆ త‌ర్వాత గోవింద‌రాజ ప‌ట్ట‌ణంగా పిలుచుకునేవారు. 

13వ శ‌తాబ్దం నుంచి తిరుప‌తిగా పిల‌వ‌డం మొద‌లైన‌ట్టు శాస‌నాలు చెప్తున్నాయి. స‌మ‌తా ధ‌ర్మాన్ని ప్ర‌బోధించిన రామానుజాచార్యులు సంక‌ల్పించ‌క‌పోతే, నేడు హిందువుల ఆధ్మాత్మిక రాజ‌ధానిగా ఎంతో గొప్ప‌గా భావించే తిరుప‌తి న‌గ‌రం లేనేలేదు.

తిరుప‌తి పుట్టిన రోజును జ‌రుపుకోవ‌డం అంటే, మ‌న ఆధ్యాత్మిక న‌గ‌రం విశిష్ట‌త‌ను ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డం. అలాగే భావిత‌రాల‌కు మ‌న న‌గ‌రం చ‌రిత్ర గురించి తెలియ‌జేయ‌డం. . 

 తిరుప‌తి అంటేనే సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆధ్యాత్మిక చింత‌న‌, ఓంకార నాధం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: