వసంతకాలం
#వసంతకాలం
వసంత సుఖం యథాతథా అస్నిన్నితి వసంతః వసంతంలో సర్వజనులు సుఖంగా ఉంటారు.
పుష్పాణాం సమయః పుష్ప సమయః
పుష్పాలు వికసించే కాలం వసంతం.
చిత్రామౌక్తి కమేకమ్
చిత్తా నక్షత్రం ముత్యపు కాంతిని పోలిన తెల్లని కాంతిలో మనసుసు చల్లబరుస్తుంది.
సరత్యా కరే ఇతి సూర్యః
విశ్వాంతరాళంలో సంచరించే సూర్య కిరణాల చైతన్యం, షోడశకళా ప్రపూర్ణుడైన చంద్రుని వెన్నెల, అందుకే దీన్ని ‘‘మధు మాసం’’ అన్నారు.
#చైత్ర_పౌర్ణమి
వసంత రుతువుతో ప్రారంభమైన ఈ మాసం ప్రకృతి శోభ పరిపూర్ణంగా ప్రకాశించేది ఈ చైత్ర పౌర్ణమి నాడే. అందుకే దీనిని ‘‘మహాచైత్రి’’ అన్నారు. ఈ సంవత్సరం తొలి పౌర్ణమి. ‘‘చైత్రః శ్రీమానయం మాసః’’ అని మహర్షి వాల్మీకి ఈ మాసాన్ని శ్రీమంతమైనదని వర్ణించారు. ‘‘కావ్యాభిఖ్యాతయో రాశీచ్ఛిత్రా చంద్రమసోరివా’’ అని మహాకవి కాళిదాసు తన ‘‘రఘువంశ’’ కావ్యంలో వర్ణించారు. ఇంద్రాది దేవతలు ఈశ్వర ప్రీతికై ‘దమన పూజను’ నిర్వహిస్తారు. శైవాగమంలోని శివునికి ఏకవీరాదేవి, భైరవ ఆరాధనలు చేస్తారు. ఈ దమన పూజ తర్వాత బహువర్ణ రంజితమైన చిత్రవస్త్రం దానం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు, సంపదలు కలుగుతాయని శాస్త్ర నిర్ణయం.
Comments
Post a Comment