సమస్త సృష్టీ
సమస్త సృష్టీ కాలంలో పుట్టి కాలంలో గతించేదే. కాలాన్ని బట్టే మన జననం, మరణం, మంచి, చెడూ మొదైలవన్నీ నిర్ణయించ బడుతున్నాయి. ఈకాలం గురించి తెలుసుకుంటే మన మార్గం సుగమం అవుతుంది. కాలం గురించి జ్యోతిశ్శాస్త్రంలో మన ఋషులు విస్తారంగా చర్చించారు.
ప్రాతః సంగవః మధ్యాహ్నః అపరాహ్ణః సాయం అహ్నోయే పంచదశ ముహూర్తాః
తే ఏకైకస్మిన్ విభాగే త్రయస్త్రయో ముహూర్తాః
సంగవ ఇతితు ఉష ఆరంభస్యాపి సంఙ్ఞా
ఉషానామ రాత్రిః వ్యుషా నామ దివసః – ఇతి మత్సే 123
పగటి కాలము 30 ఘడియలు, రాత్రి కాలము 30 ఘడియలు. పగటి కాలపు 30 ఘడియలను 15 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 2 ఘడియల కాలం అవుతుంది. అదే (2 ఘడియల కాలం ) ఒక ముహూర్తం. అటువంటి మూడు ముహూర్తాలు కలిపి ( 6 ఘడియలు ) ఒక పేరుతో పిలువబడుతాయి.
1. ప్రాత్రః కాలము,
2. సంగవ (ఉషః) కాలము,
3. మధ్యాహ్న కాలము,
4. అపరాహ్ణ కాలము,
5. సాయం కాలము
అని ఇవి పగటి పూట వచ్చే ఒక్కో ఆరు ఘడియలకు ( గం. 2-24ని.ల సమయానికి) గల పేర్లు. సంగవమునకు ఉషః కాలము అనికూడా మరో పేరు. ఉషా అనగా రాత్రి అని, వ్యుషా అనగా పగలు అని మత్స్య పురాణము 123 వ అధ్యాయమున కలదు
Comments
Post a Comment