శని గ్రహం ఇతర గ్రహాలు కలయిక వలన వచ్చే వ్యాధులు...........!!
జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం శని గ్రహం ఇతర గ్రహాలు కలయిక వలన వచ్చే వ్యాధులు...........!!
శని కలిగించే వ్యాధులు :- శని వాత సంబంధ వ్యాధు లను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాధులు, పని చేయలేని అశక్తి , డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు.
శని సూర్యుని తో కలిస్తే బలహీనమైన దృష్టి, జీవితమంతా కష్టాలు, ప్రభుత్వం లేక ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన, తండ్రితో, పై అధికారులతో సమస్యలు కలిగిస్తాడు. ఉద్యోగం సంపాదించడం కష్టమౌతుంది, ఒకవేళ సంపాదించిన చెడ్డపేరు, అధిక ఖర్చులు, ముఖ్యంగా మానసిక ప్రశాంతత లేకపోవడం ఉంటుంది.
శని చంద్రుడితో కలిస్తే మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి , తలనొప్పి , బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు.
కుజుడితో కలిసిన రక్త సమస్యలు, కండరాల నొప్పి, కండరాల జబ్బులు, పళ్ళ నొప్పి, పళ్ళు కుళ్ళిపోవుట సూచిస్తాడు.
బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి, చర్మ సంబధిత వ్యాధులు సూచిస్తాడు.
గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు.
శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరేచనాలు మొదలైన వ్యాధులను సూచిస్తాడు. సంతానం కలగటంలో ఆలస్యం కలిగిస్తాడు.
రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాధు లను సూచిస్తాడు. కండరములు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.
కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాధులను సూచిస్తాడు. కండరములు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.
ఏల్నాటి శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం అని, అష్టమ శనిదోషం అని శనిదోషాలు మూడు రకాలుగా ఉంటాయి.
Comments
Post a Comment