Posts

ఉగాది

ఉగాది ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు.  వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది. ఉగాది  - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము.భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఉగాది పుట్టుపూర్వోత్తరాలు వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య...

వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థ (హిందువుల వేద సంపద - 4)

వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థ హిందూ సమాజం సాధారణంగా నాలుగు వర్ణాలుగా విభజింపబడి ఉంది. బ్రాహ్మణులు  (ఆచార్యులు మరియు పూజారులు) క్షత్రియులు  (యోధులు, రాజులు, మరియు ఉన్నత వంశానికి చెందిన వారు) వైశ్యులు  (వ్యాపారస్థులు మరియు వాణిజ్యవేత్తలు) శూద్రులు  (కూలివారు మరియు సేవకులు) ఈ వర్ణ వ్యవస్థ, హిందూమతం యొక్క అంతర్భాగమా? లేక కాలం చెల్లిన సామాజిక సాంప్రదాయమా? అన్న విషయంపై ఇప్పటికీ పండితుల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఋగ్వేదం  (10.90)లో వర్ణ వ్యవస్థ గురించి స్పష్టం చేసి ఉన్నప్పటికీ కుల వ్యవస్థ మతంలో విడదీయరాని భాగంగా ఉండనవసరం లేదని కొన్ని చోట్ల సూచనలు ఉన్నాయి. వేద కాలపు నాగరికతలో తరువాతి కాలంలాగే శూద్రులు వేదాలను వినకూడదనే కట్టుబాట్లు ఏమీ లేవు. వర్ణ వ్యవస్థలో కొన్ని వెసులుబాట్లు ఉండటం మూలాన కొద్ది మంది సామాజిక శాస్త్రవేత్తలు వాదనలు బలంగా లేవు ఆధ్యాత్మిక గురువైన శ్రీ  రామకృష్ణ పరమహంస  ఈ విషయంపై ఒక శ్లోకం చెప్పాడు. "భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు.... ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాజాలడు. భక్తి ద్వారా ...

ఉత్సవాలు, ఆచారాలు, ధర్మ కర్మ విధులు (హిందువుల వేద సంపద - 4)

ధర్మ కర్మ విధులు చాలామంది హిందువులు తమ ఇళ్ళలో ప్రతిరోజూ  దీపారాధన ,  నైవేద్యం , వేద పారాయణం, దేవుని స్తోత్రాలు మరియు మంత్ర పఠనం,  ధ్యానం  మరియు ఇతర పూజా కార్యక్రమాలు వంటి వాటిని నిష్ఠగా నిర్వహిస్తుంటారు. ఈ ఆచారాలు, వ్యక్తిని బట్టి, గ్రామాలను బట్టి, మరియు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాలలో గుర్తించదగిన విషయం ఏమిటంటే ఇవి ఆచరించే ముందు ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా పరిశుద్ధులై ఉండాలి. అందుకే స్నానం ఆచమనీయానికి అతి ముఖ్యమైనది. త్యాగం ద్వారా, దాన ధర్మాల ద్వారామూటకట్టుకొన్న  పుణ్యం మరుజన్మలో ఉపయోగపడుతుందని హిందువులు విశ్వసిస్తారు. యజ్ఞ యాగాదుల గూర్చి పురాణాలలో గొప్పగా కీర్తించారు. కానీ ఈ కాలంలో ఇవి తరచుగా నిర్వహించనప్పటికీ పెళ్ళిళ్ళలోనూ, కర్మకాండలలోనూ యధావిధిగా నిర్వర్తిస్తుంటారు.Most Hindus observe religious rituals at home. పుట్టినరోజు, పెళ్ళి, మరణం మొదలైనవి మతసంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఉదాహరణకు  అన్నప్రాసన  రోజు బిడ్డకు మొట్టమొదటిసారిగా ఘనాహారం తినిపిస్తారు.  ఉపనయనం  రోజు జంధ్యాన్ని తొడుగుతారు. ఒక మనిషి చనిపోయిన తరువాత...

హిందూ ధర్మశాస్త్రాలు (హిందువుల వేద సంపద - 3)

వేదాలు మరియు వేదాంత శాస్త్రము హిందూ ధర్మశాస్త్రాలు ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంథాలలో ఒకటిగా చెప్పబడే ఋగ్వేదంలో చెప్పబడిన విషయాలు. హిందూ మతానికి ఆధారభూతమైనటువంటి ఆధ్యాత్మిక నియమాలు వేర్వేరు కాలాలలో వేర్వేరు వ్యక్తులచే ఏర్పరచబడ్డాయి. వేదాలను గ్రంథస్తం చేయక మునుపు కొన్ని శతాబ్దాలపాటు కేవలం శ్రవణం ద్వారానే బోధించబడేవి. కొన్ని శతాబ్దాలపాటు కృషి చేసి మహర్షులు బోధనలను మరియు నియమాలను విస్తృత పరచారు. వేదాలను రచించినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ గ్రంథాలను కేవలం సాహిత్య పరంగా కాక వాటికి నీతి నియమాలను జోడించి అర్థం చేసుకుంటున్నారు. చాలావరకు పవిత్ర గ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నాయి. వీటిని  స్మృతిపురాణాలనీ  మరియు  శృతి  పురాణాలని విభజించవచ్చు. భారతీయ ధర్మమునకుగాని, మతమునకు గాని శ్రుతిస్మృతులే ఆధారములు. శ్రుతియొక్క యపరనామములే వేదము, ఆమ్నాయమును. దానినుండి ధర్మాధర్మములు శ్రుతము లగుచుండుటవలన అది శ్రుతి అనబడుచున్నది. మరియు మంత్రముయొక్క ఋషి యోగవాసిష్ఠాపరుడై ఉండినప్పుడు అతనికి ఆమంత్రము విననగుటవలన దానికి శ్రుతినామము కలిగెను. ఋషి మంత్రద్రష్టయే కాని తద్రచయిత కాడు.కనుక  శ్రుతి అపౌరుషేయము....

జీవన గమ్యాలు (హిందువుల వేద సంపద - 2)

జీవన గమ్యాలు -  చతుర్విధ పురుషార్ధాలు సంప్రదాయ హిందూధర్మము రెండు ముఖ్యమైన జీవిత కాల ధర్మాలను అంగీకరిస్తుంది: అవి గృహస్థ మరియు సన్యాస ధర్మాలు. గృహస్థ ధర్మము  నాలుగు విధాల పురుషార్థాలను భోధిస్తుంది. అవి " కామము " : శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు " అర్థము " : ధన సంపాదన మరియు కీర్తి " ధర్మము" : మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము " మోక్షము " : పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల. వీటిలో ధర్మము మరియు మోక్షము ప్రముఖమైనవి. మోక్షమును పొందాలంటే కామము అనగా కోరిక మరియు ధనసంపాదన ధర్మయుక్తముగా ఉండాలి. సన్యాస ధర్మము అనగా మోక్షమును మాత్రము కోరుతూ మిగిలిన మూడు పురుషార్థాలను త్యాగము చెయ్యడము. గృహస్థుడు కూడా కాలాంతరములో దీనిని పొందుతాడు. అంతేకాక కొందరు మనుషులు పూర్వజన్మల సంస్కారాల వలన ప్రస్తుతము ఏ దశలో ఉన్నప్పటికీ వెంటనే సన్యాసస్థితిని పొందుతారు. యోగము సవరించు జీవితంలో అనుసరించవలసిన నియమాలగురించీ, సాధించవలసిన లక్ష్యాలగురించీ వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్ని యోగము  అని అంటారు. ప్రతి మనిషి తన జీవిత పరమ...