Posts

క్రోధో వైశ్వానరో దేవో

క్రోధో వైశ్వానరో దేవో క్రోధో వైశ్వానరో దేవో ఆశా వైతరిణీ నది విద్యా కామదుఘాః దేనుః సంతుష్టిః నందనం వనం తన క్రోధమగ్ని గాంచగ తన ఆశే వైతరిణిని  తప్పక చేర్చున్ తన విద్...

పరమేశ్వరుడు భక్త పరాధీనుడు (విద్యాపతి మిశ్రుని కథ) పరమేశ్వరుడు భక్త పరాధీనుడు (విద్యాపతి మిశ్రుని కథ)   పూర్వము అనగా ఒక 5,6 వందల సంవత్సరముల క్రితము వంగదేశమున విద్యాపతి మిశ్రుడు అన్న ఒక మహా పండిత,కవి, గాయకుడుండేవాడు. తానూ తన సతీసమేతముగా దైనందిన గృహ కృత్యములు ముగిసిన పిదప పరమేశ్వరుని పాదసేవానురక్తులై నిరంతరమూ నిత్య జీవితమును గడిపేవారు. ముఖ్యముగా మిశ్రులవారు పరమశివునిపై పరమ భక్తిప్రపత్తులతో అనేకానేక కీర్తనలను రచించుటయేగాక తదేక ధ్యాన తత్పరుడై,నిష్కల్మష భక్తితో తను వ్రాసిన గీతములను నోరారా, తనివిదీర ఆలపించేవాడు. పరమేశ్వరుడు ఆ గానరస గంగా ప్రవాహములో తన్మయుడై ఒలలాడజొచ్చినాడు. రానురానూ శంభునికి కైలాసమువీది మిశ్రుని గృహములోనే చెంతనవుండి మరీ గానామృతమును గ్రోలవలెనను తలంపుతో  వారి ఇంటికి ఒక పనివాని వేషములో వచ్చి ఆ దంపతుల నెంతగానో బ్రతిమాలి పనికి కుదురుకొని మిశ్రులవారి నీడగా వెన్నంటి ఆయన గీతములోని ప్రతి అక్షరము సంగీతమయమై శొభిల్లుచుండ విని పులకించి పోసాగినాడు. అట్లని యజమానులు చెప్పిన పనులు చేయుటలేదా అంటే, వారు చెప్పుటకు ముందే అన్ని పనులూ చేసి విద్యాపతిగారిని అనుసరించేవాడు. ఒకానొకరోజు విద్యాపతి మిశ్రులు పొరుగు వూరికి పోవుట సంభవించినది. ఎండతీవ్రత అత్యధికముగా ఉండుటచే యజమానికి ఛత్ర ఛాయనందజేయుటకు సేవక రూపములో వున్నా శంకరుడు కూడా వద్దన్నా వినకుండా బయలుదేరినాడు. అసలు విషయము తెలియని మిశ్రులవారు ఆ అక్భిమానమును త్రోసిపుచ్చలేకపోయినారు. దారిన బడగానే పాతనండుకొన్నారు మిశ్రులవారు. గాన సుధ జాలువారుతూనే వుంది. తత్పరుడైన శివుడు తన్మయుడై వింటూ గొడుగు యజమానికి పట్టి నడుస్తూనే వున్నాడు. నడువగా నడువగా వారు ఒక నిర్జల ప్రాంతమున ప్రవేశించినారు. మిశ్రులవారికి దాహమై ఆమాట సేవకునితో తెలిపినాడు. కానీ ఆప్రాంతములో నేరేదోరుకడు అనికూడా హెచ్చరించినాడు. సేవకుని రూపములో వున్నశివుడు ప్రయత్నించుతానంటూ మరచెంబు పట్టుకొని కొంతదూరము పోయి యజామాని చూచుతలేదని గ్రహించి తన కాలి బొటనవ్రేలితో భూమిని గట్టిగా నొక్కినాడు. గంగాపతికి నీటికి కొదవా! తీయని చల్లని జలధార పైకి ఉబికి వచ్చినది. చేబుకు పట్టి ఆనీటిని యజమానికి ఇచ్చినాడు. దాహార్తి అధికముగాగాలిగిన మిశ్రులు అమృత తుల్యమగు ఆ నీటిని త్రావిన పిదప అనుమాన మానసుడై ఇచట ఎటువంటి జలాశయమూలేదే ఇంత మధురమైన నీరు ఎక్కడిదని నిగ్గదీసినాడు తన ఛద్మ వేషధారియైన అనుచరుని. ఇక నిజాము దాచాలేనని తెలుసుకొని పరమేషుడు ఆయనకు ప్రత్యక్షమై విషయమును చెప్పి తానూ అంతర్హితుడౌతానన్నాడు. మిశ్రులవారు ఆయనను బ్రతిమాలగా, తన రహస్యము బయల్పడనంతవరకూ ఉంటానని మాట ఇచ్చుతచే పని ముగించుకొని ఇరువురూ ఇల్లుచేరినారు. తిరుగు ప్రయాణములో గొడుగు పట్టుకొనుట మిశ్రులవారి వంతయినది. ఇంటికి వచ్చినదిమొదలు మిశ్రులవారి పత్ని తమ భృత్యునికి ఏపని చెప్పినా విద్యాపతి గారే చేయ మొదలిదినారు. ఎక్కడికీ సహించలేక ఆమె భర్తను' పనివానిని పనిచ్యనీకుండా మీరే పనిచేయుటకు పనివాదేందుకు' అని చీవాట్లు పెట్టింది. ఖిన్నుదయినా విద్యాపతి మిశ్రులవారు నిజాము చెప్పక తప్పలేదు. అంతట శివుడు నిజరూపముదాల్చి తానూ అంతర్దానమండుచున్నట్లు మిశ్రులతో చెప్పినారు. దంపతులిరువురూ ఆయన కాళ్ళపైబడి క్షమాపణ కోరుకోగా వారిని జీవితము ముగిసిన పిదప శివసాయుజ్యము చెర వరమోసంగి అంతర్ధానమందినాడు. ఇటువంటి మహానీయులేందరో ఈ పుణ్యభూమి హారానికి మణులై ప్రకాశించినారు.  అట్టి భూమిపై పుట్టినందుకు మనమూ మనవంతు భక్తి విధేయతలతో భగవంతుని ప్రార్థించుదాము. స్వస్తి.

#పూర్వాబాద్ర నక్షత్రము - ఫలితాలు

#పూర్వాబాద్ర నక్షత్రము  - ఫలితాలు నక్షత్రములలో పూర్వాభద్ర 25వ నక్షత్రము. పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు. అధిదేవత అజైకపాదుడు. మానవ గణము. జంతువు సింహము. రాశ్యాధిపతుల...

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు!

Image
మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు! APHerald 1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు 2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా 3. అడిగేవాడికి చెప్పేవాడు లోక...

నిజమైన భక్తుల లక్షణాలు

Image
    నిజమైన భక్తుల లక్షణాలు Andhrajyothy శ్రీరామకృష్ణులు శిష్యుడైన వివేకానందుణ్ని ఒకసారి.. ‘నాయనా భగవంతుడు రససముద్రం. ఆ సముద్రంలో నీవు మునుగుతావా లేదా చెప్పు? ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో. నువ్వు ఈగవై ఉన్నావనుకో, ఎక్కడ కూర్చోని ఆ రసాన్ని గ్రోలుతావు?’’ అని అడిగారు. దానికి వివేకానందుడు.. ‘‘నాయనా! అది సచ్చిదానంద సాగరం. దాంట్లో మునిగినా మరణభీతి లేదు. అది అమృతసాగరం’’ అని సమాధానమిచ్చారు. భక్తులందరికీ ఇది వర్తిస్తుంది. అయితే, ఆ అమృత సాగరంలో మునగాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరి అని శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అది లేకుండా బాహ్యమైన వేషాలతో ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెడితే గుడ్డిదైన ఈగ వెళ్లి పానకంలో బడి చచ్చినట్లే. అలా కాకుండా అందులో ఓలలాడడానికి వెళ్లే ముందు చిత్తవృత్తులను నిరోధించే ప్రవృత్తులను అభ్యాసం చేస్తే అక్కడంతా అమృతమయమే. ‘చిత్తవృత్తులను నిరోధించడమే యోగం అని పతంజలి మహర్షి అన్నాడు. యోగం తెలిసినవారు యోగమూర్తులు. అప్పుడు మోక్షం సిద్ధిస్తే ‘పునరపిమరణం పునరపి జననం’ లేదన్నమాట. అది అమృతత్వమే. ఆ స్థితి సాధించాక ఆ అమృతసాగరంలో దూకకపోయినప్పటికీ ఒక్క చుక్క నోట్లో పడితే చ...

వామనుడు రెండో సారి దర్శనమిచ్చిన

వామనుడు రెండో సారి దర్శనమిచ్చిన ప్రాంతం...సందర్శనతో అనంతమైన ఐశ్వర్యం భారత దేశంలో వామనాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో మూడు ఆలయాలు ఒక్క తమిళనాడులోనే ఉన్నాయి. అం...

దైవారాధనకు పవిత్ర మాసం

దైవారాధనకు పవిత్ర మాసం Andhra Bhoomi కాల ప్రమాణంలో చాంద్రమానాన్ని అనుసరించి రేండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారి ఒక నెల అధికంగా వస్తుంది. దీనినే పురుషోత్తమ (శూన్య లేదా మల) మాసం అంటార...