2020-ఆటిజమ్
చిక్కుల చట్రం! నేడు ప్రపంచ ఆటిజమ్ దినం పుట్టినప్పట్నుంచీ శిశువు ప్రతి కదలికా అద్భుతమే. ప్రతి దశా పెద్ద సంబరమే. మెడ నిలబెట్టటం, బోర్లాపడటం దగ్గర్నుంచి.. పాకటం, పారాడటం, నిలబడటం, తప్పటడుగులు వేయటం వరకూ అన్నీ అపురూప దృశ్యాలే. అత్తా.. తాత్తాత.. మాటలన్నీ గొప్పగా చెప్పుకొనే ముచ్చటలే. ఇలా అంతా సాఫీగా సాగిపోవాల్సిన తరుణంలో ఎక్కడో ఏదో అనుమానం. ఏదో తెలియని వెలితి. ‘పాప ఎందుకనో కళ్లలోకి నేరుగా చూడటం లేదు’.. ‘నవ్వించినా నవ్వటం లేదు’.. తల్లిదండ్రుల మనసులో ఏదో సంశయం. నిజంగా ఇది అనుమానించాల్సిన సమయమే. ఎదుగుదల దశలను అస్తవ్యస్తం చేసే ఆటిజమ్ ఇలాగే మొగ్గతొడగటం ఆరంభిస్తుంది. ఇది ఒక్క సమస్య కాదు. రకరకాల అంశాలతో ముడిపడిన చట్రం. దీని ఆనవాళ్లను గుర్తించటం అత్యవసరం. త్వరగా చికిత్స ఆరంభిస్తే దీన్ని అధిగమించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ‘ప్రపంచ ఆటిజమ్ దినం’ సందర్భంగా సవివర కథనం మీకోసం. బుద్ధిమాంద్యం కాదు ఇతరులతో కలవలేకపోవటం, సరిగా మాట్లాడలేకపోవటం వల్ల మొదట్లో ఆటిజమ్‌ను బుద్ధిమాంద్యం అని అనుకునేవారు. కానీ ఇది బుద్ధిమాంద్యం కాదు. ఆటిజమ్ పిల్లలు బుద్ధిమాంద్యం గలవారి మాదిరిగా స్తబ్ధుగా ఉండరు. చురుకు...