ముహూర్త దర్పణం :
*ముహూర్త దర్పణం : ముహూర్తాలు శబ్ధార్థం : “ముహూర్తం" అను పదానికి రెండు అర్థాలు గోచరిస్తాయి. మొదటిది కాలాన్ని సూచించే కాలమానం. రెండవది ఏదైనా ఒక కార్యం ప్రారంభించేటందుకు ఎంచుకున్న సమయం. అమరకోశం ప్రకారం - తే క్షణాః ద్వాదశ ముహూర్త ఇత్యుచ్యతే - 12 క్షణాలు కూడిన కాలాన్ని ముహూర్తం అంటారు. హూర్ఛతి కుటిలో భవతి శుభాశుభదర్శనాదితి ముహూర్తః - హుర్ఛాకౌటిల్యే - శుభాశుభ దర్శనం వల్ల కుటిలమగునట్టిది. ముహుర్ముహురియర్తీతి ముహూర్తః - ఋగతౌ - పలుమారును పోవుచుండునది. ఘటికాద్వయం ముహుర్తః - 1 ముహూర్తం - రెండు గడియల సేపు. శబ్దార్ధ రత్నాకరం ప్రకారం: ముహూర్తమనగా - నిమేషకాలము, రెండు గడియల కాలం, నలువది యెనిమిది నిముషముల కాలము, లిప్త, శుభకార్యములకు నిర్ణయించు కాలం. ముహూర్తం కాలమానం : ఒక ముహూర్తకాలము 2 ఘడియలు లేక 48 నిముషాలకు సమానం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 15 ముహూర్తాలుగాను, సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు 15 ముహూర్తాలుగాను విభజించారు. పగలు సంబంధిత రాత్రి సంబంధిత ముహూర్తం నక్షత్రం ముహూర్తంపేరు నక్షత్రం 1. శివ ఆరుద్ర 1. శివ ఆరుద్ర 2. సర్ప ఆశ్లేష 2. అజైకపాద పూర్వాభాద్ర 3. మిత్ర అనూరాధ 3. ఆహిర్భుద...