Posts

శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం

Image
శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః! నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే!! నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః! సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!! సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే! స్థాస్ను జంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే!! సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే! తాపత్రితయసంహత్ర్యై ప్రాణేశ్యైతే నమో నమః!! శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే! సర్వస్వం శుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే!! భుక్తిముక్తి ప్రదాయిన్యై భద్రదాయై నమోనమః! భోగోపభోగ్యదాయినై భోగవత్త్యై నమోస్తుతే!! మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః! నమస్త్రైలోక్యభూషాయై త్రిపథాయై నమో నమః!! నమ స్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః! త్రిహుతాశన సంస్థాయై తేజోవత్యై నమో నమః!! నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః! నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!! బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోస్తుతే! నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!! పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః! పరాపరశతాధ్యాయై తారాయై తే నమో నమః!! పాశజాల నికృంతిన్యై అభిన్నాయై నమోస్తుత...

సంపత్కుమార విగ్రహం

Image
(ఢిల్లీ సుల్తాను ఎత్తుకుపోయిన సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం పూర్తిగా చదువ వలసిందిగా ప్రార్థన.శ్రీ వి.యస్.కరుణాకరన్ గారి పిలిచినంతనే పలికే దైవం- విష్ణు సహస్రనామావళి గాథలు ఆధారంగా)_ ఢిల్లీ సుల్తాను – తన కట్టెదుట నిలబడిన రాజసతేజో విరాజిత మూర్తి సుకుమార సుందర గంభీర విగ్రహుడు ఆజానుబాహుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రవత్తులతో తేరిపార జూచాడు.  *ఆ మహానుభావుని విశాల ఫాలభాగంలో తీర్చి దిద్దిన ఊర్ధ్వపుండ్ర రేఖలు మధ్యలో పసుపురంగు తిలకం. తళతళలాడే ధవళ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుండి జారుతోంది. మెడలో తామర పూసల దండ. తులసీ దళధామం. మొలకు కట్టి చుట్టినది చిన్న కావి కొల్లాయిగుడ్డ. తలపై చిరు పిలక జుట్టు. ఒక చేతిలో త్రిదండం, ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం.* సుల్తాను కొలువు కూటం అంతా ఆ మహామహుని ఆధ్యాత్మికదీధితులచే దేదీప్యమానంగా వెలుగొందుచున్నట్లు భావించాడు. ఢిల్లీ దర్బారుకు ఆవిధంగా వేంచేసినది  *శ్రీమద్రామానుజుల* వారే. ఢిల్లీ సుల్తాను - శ్రీమద్రామానుజుల కోరిన కోరిక ఈడేర్చాలనే నిర్ణయించుకున్నాడు.. “సుల్తాను వారికి ఒక విన్నపం, ...

నందనార్ నాయనార్: స్వయంగా నంది ప్రక్కకు తప్పుకున్న ఘట్టం

Image
నందనార్ నాయనార్: స్వయంగా నంది ప్రక్కకు తప్పుకున్న ఘట్టం 63 మంది శివ భక్తులైన నాయనార్లలో ఒకరైన నందనార్ కథని, అతనికి శివ దర్శనం కలిగించడం కోసం గుడిలోని నంది ఎలా ప్రక్కకు తప్పుకుందో సద్గురు చెబుతున్నారు. తమిళనాడులో జరిగిన ఒక అందమైన సన్నివేశం ఉంది. సమాజంలో అంటరానివాడు, ఒక కట్టుబానిస అయిన ఒకతను ఉండేవాడు. అతనికి పేరే లేదు. ఓ సమాజం ఎవరినైనా బానిసలుగా చేసుకోవాలనుకుంటే, చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, వారికి పేరు అన్నది లేకుండా చెయ్యడం. ఎందుకంటే పేరు అనేది ఒక బలమైన గుర్తింపు. ముంబైని బాంబే గానూ, బెంగళూరుని బాంగ్లోర్ గానూ, తిరువనంతపురాన్ని ట్రివేండ్రం గానూ మార్చేశారు. ఈ మనిషికి పేరు లేదు. అందరూ అతనిని సాధారణంగా పాలేరు అని పిలుస్తూ ఉండేవాళ్లు. బాల్యం నుంచీ, ‘శివుడు’ అన్న ఆలోచనే ఇతనిని అబ్బురపరచేది. ఒక కట్టు బానిసగా, అతనికంటూ సొంతమైన ఆలోచనలు ఉండకూడదు. కానీ, ‘శివుడు’ అన్న ఆలోచన అతనిని ప్రజ్వలింపజేసింది. ఇతను నివసిస్తున్న ప్రదేశానికి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో, ఇప్పుడు గొప్ప శివాలయంగా పేరు పొందిన తిరుపొంగూర్ ఆలయం ఉంది. ఇతనికి ఎప్పుడూ ఆ ఆలయాన్ని దర్శించాలన్న కోరిక. ఇతనికి, శివుడు తనను ...

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది

Image
కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!! కృతయుగం నుండి  ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది.  కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం.వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం.  పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు. 1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. 2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది.  3. వివాహ వ్యవస్థ నిలబడదు 4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు 5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు 6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర ములకే పడిపోతుంది 7.స్త్రీలు కేశపాశము లు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది 8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యేశుడు అనే  బ్రాహ్మణ కడుపున కల్కి...

మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన #తిథులు :

మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు  జరిగిన #తిథులు : వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అని ఎందుకు అంటారో తెలుస్తుంది. మహాభారతం గురించి ఎంత చదివినా ఎంత విన్నా కొత్త గానే అద్భుతం గానే వుంటుంది. అందుకే ఈ మధ్య తెలుసుకున్న కొన్ని మహాభారత విశేషాలు మీ కోసం.     సులభం గా టైపు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది. తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను. ➡️ కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి. ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు. ➡ యుధిష్టరుని జననం :  ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో. సుమారు Bc 15-8-3229.  ➡ భీముని జననం : మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి . ధర్మరాజు కన్నా 1సం 19రో చిన్నవాడు. 🏹🏹 అర్జునుని జననం: శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి. భీమునికన్నా 1సం 4నె 21రో చిన్నవాడు. 🗡⚔ నకుల & సహదేవుల జననం : భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం. అర్జునుని కన్నా 1సం 15రో  చి...

శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు చేసిన -సూర్యనారాయణ స్తోత్రం

శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం – ఇది వేదములలో ఉన్న సౌరమంత్రాలనుంచి గ్రహించారు. ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః! హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు ॥ ౧॥ నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే! క్రమమాణ యోజనానాం నమోఽస్తుతే నలిననాథాయ ॥ ౨॥ కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ! ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ ॥ ౩॥ త్వం హి యజూఋక్సామః త్వమాగమస్త్వం వషట్కారః! త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ ॥ ౪॥ శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్! శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి ॥ ౫॥ త్వచి దోషా దృశి దోషాః హృది దోషా యేఽఖిలేన్ద్రియజదోషాః! తాన్ పూషా హతదోషః కిఞ్చిద్ రోషాగ్నినా దహతు ॥ ౬॥ ధర్మార్థకామమోక్షప్రతిరోధానుగ్రతాపవేగకరాన్! బన్దీకృతేన్ద్రియగణాన్ గదాన్ విఖణ్డయతు చణ్డాంశుః ॥ ౭॥ యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరమచరమఖిలమ్! ధృతబోధం తం నలినీభర్తారం హర్తారమాపదామీడే ॥ ౮॥ యస్య సహస్రాభీశోరభీశు లేశో హిమా...

బభ్రువాహనుడు

Image
అర్జునుని చంపిన పుత్రుడు...  బభ్రువాహనుడు మహాభారతంలో కొన్ని కథలకి విస్తృతమైన ప్రచారం ఉంది. కొంతమంది వీరులకు అనంతమైన ఆదరణ ఉంది. కానీ పరీక్షగా చూస్తే ఆ రంగస్థలం మీదకి అడుగుపెట్టిన ప్రతి పాత్రకీ మంచో, చెడో... తనదైన వ్యక్తిత్వం ఉంది. అలాంటి ఒక పాత్రే బభ్రువాహనుడు. అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పటి మణిపూర్‌ రాష్ట్రమే ఆనాటి మణిపుర రాజ్యమని ఓ నమ్మకం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న చిత్రవాహనునికి ఒక్కతే కుమార్తె. ఆమే చిత్రాంగద! అర్జునుడు, చిత్రాంగద తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. పెద్దల అనుమతితో వివాహమూ చేసుకున్నారు. కానీ ఆ వివాహానికి ఓ షరతుని పెట్టాడు చిత్రవాహనుడు. తనకు మగసంతానం లేని కారణంగా తన కుమార్తెకి పుట్టబోయే కుమారుడే మణిపురానికి రాజు కావాలన్నదే చిత్రవాహనుడి అభిలాష. అందుకోసం అర్జునుడు తన భార్యాపిల్లలను తన వద్దనే వదిలి వెళ్లాలన్నదే చిత్రవాహనుడి షరతు. ప్రేమవశాన ఉన్న అర్జునుడు ఆ షరతుకి ఒప్పుకోక తప్పలేదు. కొన్నాళ్లకు వారికి ఒక సంతానం కలిగింది. షరతు ప్రకారం అర్జునుడు వారివురినీ వదిలి తనదారిన తాను హస్తినకు ప్రయాణమయ్యాడు. ఇటువైపు బభ్రువాహనుడు పెరిగి పెద్...