శ్రీరమణమహర్షి జీవిత చరిత్రలో చివరి ఘట్టం..
_*💫 శ్రీరమణమహర్షి జీవిత చరిత్రలో చివరి ఘట్టం.. 🙏*_ *_-[శ్రీరమణీయం గ్రంథం నుండి]-_* _1950 - జనవరి, ఐదో తేదీన భగవాన్ జయంతి. అదే చివరి దర్శనంగా భావించి, దేశ, విదేశాల నుంచి ఎందరో భక్తులు వచ్చారు. ఆశ్రమ ఆవరణ అంతటా అందంగా అలంకరించారు. ముగ్గులు పెట్టారు. తోరణాలు కట్టారు. సున్నాలు, రంగులు వేశారు. మేళ, తాళాలు పెట్టారు._ _సర్వాధికారి ఎంత బ్రతిమాలినా, కొత్తగా కట్టిన ప్రత్యేక గదిలోకి వెళ్ళలేదు భగవాన్. పోలీసులు, స్కౌట్స్ వచ్చారు. భగవాన్, జయంతి భోజనం అందరితో కలసి తినలేదు. బీదలకు భోజనాలు పెట్టారు. అంత హడావిడి జరుగుతున్నా, భగవాన్ ఒంటరిగా, దూరంగా రాజాధిరాజు మాదిరిగా కూర్చున్నారు. వచ్చిన ప్రతి పాత భక్తుణ్ణి ప్రేమగా పలకరించారు. ఆరోజున చాలా మంది భగవాన్ ముందు పాడారు. అరుణాచలేశ్వరాలయం నుంచి ఏనుగు వచ్చి, భగవానికి నమస్కారం చేసింది._ _ఉత్తర హిందూ దేశపురాణి జయంతి ఉత్సవాన్ని సినిమా తీయించింది. కాని, భక్తుల్లో ఉత్సాహం తగ్గిపోయింది._ _భగవాన్ కొన్ని రోజుల్లో, వారాలో వుంటారనుకున్నారు, జయంతికి వచ్చినవారు. ఏ వైద్యంతో సార్కోమా నయమౌతుందో చెప్పమని కొందరు భగవాన్నే అడిగారు. దానికి భగవాన్, “నేను ఎప్...