Posts

అష్టాదశ పురాణాలు

Image
*🚩అష్టాదశ పురాణాలు*🚩 1. మత్స్య పురాణము 2. మార్కండేయ పురాణము 3. భాగవత పురాణము 4. భవిష్య పురాణము 5. బ్రహ్మ పురాణము 6. బ్రహ్మాండ పురాణము 7. బ్రహ్మ వైవర్త పురాణము 8. వరాహ పురాణము 9. వామన పురాణము 10. వాయు పురాణము 11. విష్ణు పురాణము 12. అగ్ని పురాణము 13. నారద పురాణము 14. స్కంద పురాణము 15. లింగ పురాణము 16. గరుడ పురాణము 17. కూర్మ పురాణము 18. పద్మ పురాణము 1.మత్స్య పురాణముదీనిలో 1400 శ్లోకములున్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యులు చెప్పబడినవి.2.మార్కండేయ పురాణముఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహాత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హొమము, శతచండీ, సహస్ర చండీ హొమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే.3.భాగవత పురాణముదీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుక్రునకు, శుక్రుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన, లీలాచరితాలు వివరి...

మాఘపురాణం -9వ అధ్యాయము

MAAGHA PURANAM -- 9 మాఘపురాణం -9వ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారిని – “పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించాడు. వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగావు. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు. దీనికి ఒక ఉదాహరణ వివరింతును ఆలకించు. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంత...

మాఘపురాణం - 8వ అధ్యాయము

MAAGHA PURANAM -- 8 మాఘపురాణం - 8వ అధ్యాయము యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి లేచినట్లుగా లేచి, వారు యమలోకమందు చూచిన వింతలు, విశేషములను వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు. యమలోకములో జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను ఆనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలు అనుభవిస్తున్నారో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు. ఆ కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకండి. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములు అనుభవించి, పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుటవలన అంతకుముందు చేసిన పాపములు పటాపంచలై నశిస్తాయి. స్వర్గల...

మాఘ పురాణం - 6 వ అధ్యాయము

_*🚩మాఘ పురాణం - 6 వ అధ్యాయము🚩*_ 🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️ *కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ* ☘☘☘☘☘☘☘☘☘ మునిశ్రేష్ఠా ! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము , నా తండ్రి పేరు హరిశర్మ , నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు , జ్ఞాని , నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది.  ఒకనాడు నా భర్త *"సఖీ ! మాఘమాసము ప్రవేశించినది , యీనెల చాల పవిత్రమైనది , దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి , కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను , మంచి గంధము , అగరు , ధూప దీపములతోన...

మాఘపురాణం - అయిదవ అధ్యాయం

MAAGHA PURANAM -- 5 మాఘపురాణం - అయిదవ అధ్యాయం మృగ శృంగుని చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కౌత్సుడు అయినా అతను కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేస్తున్నప్పుడు శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయములో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే అతనిని గీకేవి ‘ఆతనిని “మృగశృంగు”డను పేరుతో కూడా పిలుస్తూ ఉండేవారు. అతడు అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను. వివాహమాడు కన్య గుణములు మృగశృంగునకు యుక్తవయస్సు వచ్చినది కనక వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పగా మృగశృంగుడు వారిమాటలు ఆలకించి - “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయిననూ నా అభిప్రాయము గూడ ఆలకించండి. అన్ని ఆశ్రమములకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు చెప్పారు. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితము సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటుల ఉండాలి అనగా – శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా రూప...

మాఘ పురాణం - 4 వ అధ్యాయము🚩*_

_*🚩మాఘ పురాణం - 4 వ అధ్యాయము🚩*_ 🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️ *సుమిత్రుని కథ* ☘☘☘☘☘☘☘☘☘ పార్వతీదేవియు శివునిమాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు , సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను , దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతీ ! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను , చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లుపలికెను. గురువర్యా ! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచేపోతిని. మీ కుమార్తెయు బంతితోనాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహరప్రదేశమున నన్ను తనకోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ ! నీవు నామాటవిని నన్నుకూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్...

మాఘపురాణం - 3వ అధ్యాయము

MAAGHA PURANAM -- 3 మాఘపురాణం - 3వ అధ్యాయము వింధ్య పర్వతము: వశిష్ఠుడు మరల ఈ విధముగా దిలీపునకు చెప్పా సాగెను. భూపాలా! నేను చెప్పే ఈ విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టము జరిగినది. అందువలన జనులు యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొను మునీశ్వరులు సహితము ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస వెళ్ళిపోతున్నారు. భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు, పంటభూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు. మహాతపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరములనుండి ఆ ప్రాంతము నందు ఉండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసవెళ్ళి పోయాడు. హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచరియ ఉన్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా ...