అదృశ్యశక్తి -- మానవదేహం ( K ) 28 - 5 - 2017 , శుభోదయం
16-5-2017 స్నేహితులకు శుభోదయం .
ఈ రోజు కూడా ఆ అదృశ్యశక్తి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం .
అదృశ్యశక్తి -- మానవశరీరం ( C )
----------------------------------------
ప్రతి వ్యక్తి శరీరంలో ముఖ్యమైన భాగం సెల్ - జీవకణం - అని తెలుసుకున్నాం . ఈ దిగువున వున్న సెల్ ఫొటో పరిశీలించి చూడండి . ఆ ఫొటో తరచూ UPDATE అవుతూ వుంటుంది . దాని లో -- Black spot నల్లగా వున్న ప్రదేశం లో ఏమి వున్నదో కనిపెట్ట టానికి సైంటిస్టులు ఇంకా ప్రయత్నిస్తున్నారు ; దానిపేరు Nucleolus - న్యూక్లియోలస్ .
సెల్ FINAL PHOTO చిత్రీకరించటానికి సైంటిస్టులు ఇంకా MOLECULAR BIOLOGY పరిశోధన కొనసాగించు చున్నారు . అది ఎప్పటికి పూర్తి అవుతుందో ?
సనాతనధర్మం వేదశాస్త్రం (శృతి ) దాని గురించి స్పష్టంగా వివరించింది , శ్రవణం, మననం , నిధి ధ్యాసల ద్వారా
ద్రష్ట లైన వేదబుుషులు సెల్ కు మూలాధారం దాని కేంద్రప్రదేశంలో ( center of the cell లో ) వున్న
" బిందువు" - అని దర్శించారు .
Mathametics లో ఆ బిందువు పేరు - Decimal - డిసమల్ . సైంటిస్టులు ఆ బిందువు పేరు - ATOM - ఏటమ్ , అని తలంచి , పరిశోధన కొనసాగించారు . ఏటమ్ లో సూక్ష్మాతి సూక్ష్మమైన MOLECULES - మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి - అని Electron Microscope - అనే యంత్రం సహాయంతో నిరూపించారు .
సైంటిస్టులు , తమ పరిశోధన on Molecular Biology , ఇంకా కొనసాగించు చున్నారు . అనగా గతంలో వేద బుుషులు తెలియచేసిన దానినే మరల తమ Research ద్వారా దర్శించటానికి ప్రయత్నిస్తున్నారని శ్రీ అరవింద ఆశ్రమ వ్యవస్థాపకురాలైన "మదర్ " తెలియజేశారు .
శ్రీ దేవీ ఉపాసకులు ఆ బిందువులో వున్నది దైవంతో అవిభాజ్యంగా సమ్మేళనం చెందివున్న
- చిఛ్ఛక్తి / మహేశ్వరి - అని దర్శించారు . తనలో అదృశ్యంగా ఉన్న దైవం గల జగన్మాత యే సమస్త శక్తికి , సమస్త జ్ఞానం కు మూలం అని దర్శించి , రహస్యంగా వున్న ఆ పరమ సత్యం బోధించారు . ఆమెయే
UNIVERSAL MOTHER -- విశ్వజనని - అని
శ్రీ అరవిందుడు తెలియ జేశారు .
ఆ సత్యం బోధించిన మొట్టమొదటి " గురువు "
సదాశివుడు - అని జగద్గుర
19-5-2017 ,స్నేహతులకు నమస్కారం . ఈ రోజు అదృశ్యశక్తి గురించి మరికొన్ని వివరాలు తెలుసు కుందాం .
అదృశ్య శక్తి -- మానవ శరీరం ( E )
------------------------------------------------
ప్రాణంతో జీవిస్తున్న పుంలింగం కు చెందిన ప్రతి వ్యక్తి పరమేశ్వరుని సంతానమైన -- నారాయణుడు -- అని ;
స్త్రీ లింగం కు చెందిన ప్రతి వ్యక్తి -- నారాయణి -- అని భావించవలెను .
పరమేశ్వరుని ప్రకృతి పేరు మహాశక్తి . .పరమేశ్వరునితో అవిభాజ్యంగా సమ్మేళనం చెందివున్న మహాశక్తి లో సంపూర్ణ జ్ఞానం & శక్తి ఒక రాసిగా వున్నవి.అవి కాంతికిరణములుగా , మరియు శబ్ద తరంగముుగా సర్వత్రా వ్యాపించు చున్నవి .
మహాశక్తికి రెండు ప్రధానమైన శక్తులు ఉన్నాయి . అవి :
(1) ఒక సమష్ఠి శక్తి (2) మూడు వ్యష్ఠి శక్తులు .
సమష్ఠి శక్తి పేరు : మహేశ్వరి - - ప్రతి సామాన్య వ్యక్తి కి గల సమస్త దేహానికి జ్ఞానం -- శక్తి transmit చేస్తుంది .
వ్యష్ఠి శక్తుల పేర్లు : (1) మహాకాళీ - ప్రతి వ్యక్తికీ గల మానసిక శరీరం లోని ( Mental body లోని ) హైయ్యర్ మైండ్ కు - ఊర్ధ్వమనస్సు కు జ్ఞానం -- శక్తి transmit చేస్తుంది
(2) మహాలక్ష్మీ - - ప్రతి వ్యక్తి కీ గల ప్రాణిక శరీరంలోకి ( Vital body లోకి ) జ్ఞానం -- శక్తి transmit చేస్తుంది .
(3) మహా సరస్వతీ - - ప్రతి వ్యక్తి కి గల స్థూల భౌతిక ఆకారం గల సమస్త అవయవాలకు , బాహ్యరంగంనుంచి సామాన్యమైన విద్యను నేర్చుకోవటానికి సహాయం చేస్తుంది . మరియు సూక్ష్మ భౌతిక ఆకారం గల సమస్త జీవకణాలకు (సెల్స్ కు) జాగృతంగావున్న చేతన పురుషుడు నుంచి అతిమానస చైతన్యం గల శబ్ద తరంగాలను అవగాహన చేసుకోవటానికి తోడ్పడును .
శ్రీ చక్రంలో బిందువులో మహేశ్వరి వున్నది . త్రికోణం మూడు కోణాలవద్ద మహాకాళీ , మహాలక్ష్మీ , మహా సరస్వతీ వున్నారు . శ్రీ చక్రంలోని మిగిలిన 40 త్రిభుజాలలో 40 శక్తులు వున్నాయి . వాటికి కూడా మహేశ్వరీ
జ్ఞానం -- శక్తి transmit చేస్తున్నది .
దైవంతో అవిభాజ్యంగా సమ్మేళనం చెంది వున్న మహాశక్తి కి గల ప్రధమ సంతానం నారాయణుడు - అనీ , నారాయణి జగజ్జనని దుర్గాదేవి (మహేశ్వరీ )అని భావించవలెను .వారిరువురు జగత్తుగా వ్యక్తం అవుతున్నారు .
ప్రతి మొగవ్యక్తి , ప్రతి ఆడవ్యక్తి కూడా ఆ మహేశ్వరి సంతానం అని ,వారిలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన దేహాలు ఉన్నవి అని , ప్రతి ఒక్కరికీవున్న ఆత్మ లో పురుష ప్రకృతి స్వభావములు సమ్మేళనం చెంది వున్నాయి -- అని ,
,ప్రతి వ్యక్తి దేహంలో ఆ పురుషుడు , ప్రకృతి స్వభావములు separate గా వున్నాయి - అని భావించవలెను .
ఆత్మలో సమైక్యంగావున్న బిందువు ప్రతి సామాన్య వ్యక్తిలో అవ్యక్తంగా , అసంకల్ప నాడిలో (దివ్యమనస్సులో / సుషుమ్న నాడిలో )వున్నది . తన మనస్సులో కోర్కెలు ,ఆలోచనలు లేకుండా , తన విథ్యుక్త ధర్మం ఆచరిస్తునప్పుడు మాత్రమే , దివ్యమనస్సు / సుషుమ్న నాడి - స్థూల భౌతిక శరీరంలోకి ప్రవేశించి , సంపూర్ణ జ్ఞానాన్ని & శక్తినీ వ్యక్తంచేస్తుంది .
కాబట్టి , తన duty నిర్మలమైన మనస్సుతో ప్రతినిమిషం ఆచరిస్తున్న వ్యక్తులు మాత్రమే పూర్ణయోగంకు ( ఇంటిగ్రల్ యోగం కు) సంసిధ్ధమై సత్యం సంపూర్ణంగా గ్రహిస్తూ నివసిస్తూ , తమ జీవిత లక్ష్యం సాధిస్తారు .
21 - 5 - 2017 , స్నేహితులకు నమస్కారం . ఈ రోజు కూడా అదృశ్యశక్తి గురించి మరి కొన్ని వివరాలు తెల్సుకుందాం .
అదృశ్య శక్తి --- మానవదేహం ( F)
------------------------------------------------
అగాధంలో అదృశ్య శక్తి వున్నది . దానిలో . సమస్త జ్ఞానం & శక్తి సంపూర్ణంగా ఒక రాసిగా ఉన్నది . కాని అవి ప్రతి వ్యక్తి దేహంలో నుదురు భాగం లోని భ్రూమధ్య ప్రదేశం వరకూ వరకు మత్రమే ఒకరాసిగా వుంటాయ్ .
అక్కడ ఆ ఒక్కరాసి మూడు పాయలుగా చీలిపోయింది . .
ప్రతి పాయలో దైవశక్తి అసంపూర్ణంగా వున్నది .. ఆ మూడు పాయలూ సమ్మేళనం చెందినప్పుడు మాత్రమే సంపూర్ణమైన దైవశక్తి లభిస్తుంది .
అందువల్ల , సంపూర్ణంగా దైవజ్ఞానం & శక్తి ని అవగాహన చేసుకోవటానికి ప్రతి సామాన్య వ్యక్తీ తప్పని సరిగా ప్రతి నిమిషం ఇంటిగ్రల్ యోగం కు సంసిధ్ధమై , తన వృత్తి బాధ్యతలను ఆచరిస్తూ వుండాలి . నిర్మల , నిశ్శబ్ద మనస్సుతో కర్మ ఆచరించకుండా వున్న వ్యక్తికి సంపూర్ణమైన దైవశక్తి నుంచి సహాయం లభించదు .
ప్రతి సామాన్యవ్యక్తి దేహంలోని స్థూల భౌతిక శరీరం గల అనేక అవయవాలు ఉన్నాయి . ప్రతి అవయవంలో
సూక్ష్మ భౌతిక శరీరం వున్స సెల్స్ వున్నాయి .సమస్త అవయవాలలో కలిపి మొత్తం 300 ట్రిలియన్ జీవకణాలు వున్నవి . ప్రతి సెల్ లోపల పదార్ధం వుంది .
ఆ పదార్ధానికి అవగాహన చేసుకోగల స్వభావము ఉంది . ప్రతి వ్యక్తిలో అది సామాన్యమైన వాటి గురించి మాత్రమే తెలుసుకొనగల స్వభావం కల్గి వుంది .
ప్రతి నిమిషం , ఇంటిగ్రల్ యోగం కు సంసిధ్ధమై వున్న వ్యక్తిలో మాత్రమే సామాన్యంగావున్న ఎఱుక అతిమానస చైతన్యంగా మార్పు చెందుతుంది . అనగా సత్యం సంపూర్ణంగా అవగాహన చేసుకోగలది గా సామాన్యంగా వున్న ఎఱుక మార్పు చెందుతుంది .
ఆ విధంగా మార్పు చెందిన పిమ్మట , అది సెల్ నుంచి స్థూల భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది ; అప్పుడు స్థూల భౌతిక శరీరంతో సత్యం సంపూర్ణంగా తెలుసు కో గల్గటం సాధ్యం అవుతుంది .. . కాబట్టి , దానికి "దివ్యమనస్సు" - అనే నామధేయాన్ని శ్రీ అరవిందుడు ఖరారు చేశారు .
< శివ -- శక్తి >
°°°°°°°°°°°°°°
ప్రతి వ్యక్తి కి శిరస్సులో (1) Brain (మెదడు ) అనే అవయవం ఉన్నది . దానిలో సెల్సు వున్నాయి . వాటి పేరు మెదడులో వున్నసెల్స్ ( Brain Cells ) . మెదడుసెల్స్ అన్నింటికీ సనాతన ధర్మం బోధించిన " శివ - శక్తి " - అనే రెండుస్వభావాలు వున్నాయి .
అవి , సైన్సు బోధించిన మొదటితరంకు చెందిన First generation of Cells/Parent Cells అని భావించ
వచ్చును . పార్వతీ పరమేశ్వరులు - ఆది దంపతులు - అని సనాతన ధర్మం లో వర్ణించారు .
బాహ్య రంగంలో వున్న ప్రదేశమంతా అగాధంలో చెల్లాచెదరుగా వుంది. దానిలో గల సమస్త పదార్ధం శూన్యంగా వున్నట్లుగా కనిపిస్తూ వుంటుంది .
వాస్తవానికి అది శూన్యప్రదేశంకాదు . అదియే సమస్త జ్ఞానం & శక్తి ఒకేఒక రాసిగావున్నమహాశక్తి అని , అగాధం లాగా కనిపిస్తుంది అంతా అగాధం కాదు , అది నిరాకారంగావున్న పరమేశ్వరుడు అని సనాతన ధర్మం ( శృతి -- వేదం బోధించింది ) .
శూన్యంగా వున్నప్పటికీ ,మహాశక్తి నుంచి శబ్ద తరంగాలు , కాంతి కిరణాలు స్వతసిధ్ధంగా ఉద్భవిస్తున్నాయి . అవి సర్వత్రా వ్యాపిస్తున్నాయి . ప్రతి వ్యక్తికీ శిరస్సు పైభాగం మధ్యలో " మాడు " - అనే భాగం వుంది .
దానిక్రింద పుఱ్ఱె లోపల , మెదడు వుంది . మెదడు లో
(1) పెద్ద మెదడు (2) చిన్న మెదడు (3) Brain Stem ( బ్రెయిన్ స్టెమ్ ) --- అనే మూడు ప్రధానమైన భాగాలు వున్నాయి .
పెద్ద మెదడు (1) కుడివైపున ఒక సెరిబ్రల్ హెమీ స్పియర్ ( Right side Cerebral hemisphere) -- ఇదియే సనాతన ధర్మం బోధించిన " శివుడు" -- అని భావించవచ్చును .
(2) ఎడమవైపున మరొక సెరిబ్రల్ హెమీస్పియర్- ఇదియే
సనాతన ధర్మం బోధించిన " శక్తి " -- అని భావించవచ్చును . వున్నాయి . వాటి లోపల వున్న భాగం పేరు CEREBRAL CORTEX ( సెరిబ్రల్ కార్టెక్స్) .
వాటిల్లోవున్న జీవకణాల పేరు సెరిబ్రల్ కార్టెక్స్ సెల్స్ ( Cerebral Cortex Cells ) అనీ , హ్యూమన్ ఎనాటమీ ( సైన్సు ) నిర్ధారణ చేసింది . వాటిలోకి ఆ శబ్ద తరంగాలు , కాంతి కిర ణాలు ఆ వ్యక్తి కి తెలియకుండా ప్రసారం అవుతున్నాయి
26-5-2017 , శుభోదయం .స్నేహితులకు నమస్కారం .
అదృశ్య శక్తి --- మానవదేహం ( H ).
-----------------------------------------------
పరమేశ్వరునితో అవిభాజ్యంగా సమ్మేళనం చెంది వున్న మహాశక్తి కి గల సమస్త జ్ఞానం & శక్తి - ప్రతి వ్యక్తీ దేహంకు గల ముఖ్యమైన భాగమైన శిరస్సు లోపల వున్న మెదడులో సంపూర్ణంగా వున్నాయి .
కానీ , దేహంలోనే వున్న స్థూల భౌతిక శరీరంలో , సూక్ష్మభౌతిక శరీరంలో మరియు వెన్ను పాములో ( స్పైనల్ కార్డులో ) దైవశక్తి & జ్ఞానం , మూడు పాయలుగా విభజింప బడి అసంపూర్ణంగా వున్నాయి
ప్రతి సామాన్యవ్యక్తి దేహంలో (1) బాహ్య రంగంలో (2) అంతరంగంలో స్థూల భౌతిక ఆకారం గల అవయవాలు వున్నాయి . ప్రతి అవయవం లోపల సూక్ష్మ భౌతిక ఆకారం గల జీవకణాలు ( CELLS - సెల్స్ ) వున్నాయి . సమస్త దేహంలో మొత్తం 300 ట్రిలియన్ సెల్స్ వున్నాయి
సమస్త సెల్స్ లోపల పదార్ధం వున్నది . దానికి అన్నింటి గురించి తెలుసుకొనగల సామర్ధ్యం వున్న తెలివి వుంది ; ప్రతి వ్యక్తిలో అది సామాన్యమైన వాటిని మాత్రమే జ్ఞానేంద్రియాలద్వారా వీక్షించి భౌతిక మనస్సు తో తెలుసు కుంటుంది .
ఇప్పుడు ఆధునిక యంత్రమైన టోటల్ బాడీ స్కానర్ సహాయంతో వాటిన అన్నింటినీ ( అవయవాలను , సెల్స్ను డాక్టర్లు పరీక్ష చేసి చూస్తున్నారు ( విడియోమెసింజర్
- మైడే చూడండి ) .
ప్రతి నిమిషం ఇంటిగ్రల్ యోగంకు సంసిధ్ధమై వున్న వ్యక్తి లో ప్రతి జీవకణానికి గల పదార్ధానికి వున్న ఎఱుక ( తెలివి ) సత్యం సంపూర్ణంగా అవగాహన చేసుకోగలది గా
మార్పు / అభివృధ్ధి చెందుతుంది .
ఆ విధంగా మార్పు చెందిన పిమ్మట , అది స్థూల భౌతిక ఆకారం గల అవయవాల శరీరంలోకి ప్రవేశిస్తుంది . అప్పుడు స్థూల భౌతిక ఆకారం గల అవయవాలు భౌతిక మనస్సు తో కాకుండా , జీవకణాలపదార్ధానికి గల
మార్పు /అభివృధ్ధి చెందిన తెలివితో ( ఎఱుకతో ) సత్యం అవగాహన చేసుకుంటాయి కాబట్టి , ప్రతి జీవకణంకు గల పదార్ధానికి గల అభివృధ్ధి చెందిన తెలివి కి "దివ్యమనస్సు " - అనే నామధేయాన్ని శ్రీ అరవిందుడు ఖరారు చేశారు .
(1) పిండాండం ( మైక్రోకాసం MICROCOSM ) - ప్రతి వ్యక్తి కీ గల దేహం - అని , మరియు ,
2) బ్రహ్మాండం ( MACROCOSM మాక్రోకాసం ) సమస్త విశ్వం / జగత్తు - అని , సనాతన ధర్మం బోధించింది .
పరమేశ్వరుడిలో బ్రహ్మాడం వుంది ; బ్రహ్మాడం లో అనేక పిండాడం లు ఉన్నాయని సనాతన ధర్మం వివరించింది . పరమేశ్వరునితో అవిభాజ్యంగా సమ్మేలనం చెందివున్న -- మహాశక్తి తన నుంచి స్వతసిధ్ధంగా ఉద్భవిస్తున్న
శబ్ద తరంగాలు & కాంతి కిరణాల ద్వారా జ్ఞానాన్ని & శక్తిని బ్రహ్మాడం లోకి ( సమస్త విశ్వంకు ) ప్రసారం చేస్తుంది .
వాటిని ( జ్ఞానం & శక్తి గల శబ్ద తరంగాలను , కాంతి కిరణాలను ) మొట్టమొదటగా ఒక పిండాడంకు మాత్రమే బ్రహ్మాడం ప్రసారం చేస్తుంది .. మొదటి పిండాడం రెండవ పిండాడంకు ప్రసారం చేస్తుంది . రెండవ పిండాడం మూడవ దానికి , ఆ విెధంగా సమస్త పిండాడం లకు జ్ఞానం శక్తి ప్రసారం అవుతున్నాయి.
తనలో దైవం గల మూలప్రకృతి / నారాయణి / మహేశ్వరీ / దుర్గ , మరియు , ఆ మూలప్రకృతి మొదటి సంతాన మైన విష్ణువు / నారయణుడు జగత్తు అని సనాతన ధర్మం బోధించింది అని భావించ వచ్చును .
వ్యక్తం అవుతున్న దేహం శుక్లం శోణితం సమ్మేళనం చెంది ఫలదీకృతమై పరిపక్వం చెందేవరకు , మాతృ గర్భంలో నేత్రాలకు అదృశ్యంగా వున్నప్పటికీ , దానిని ఆధునిక మైన యంత్రాల నహాయంతో ( ఫీటోస్కోప్ , ఇంట్రావెజైనల్ అల్టాస్కోప్ ) డాక్టర్లు పరీక్షచేసి చూడగల్లుతున్నారు , .
ఆ రహస్యాలను యంత్రాలసహాయంలేకుిడా ఇంటిగ్రల్ యోగంకు ప్రతి నిమి షం సంసిధ్ధమై వున్న వ్యక్తి తన అతిమానస చైతన్యంతో తెలుసుకోగల్గటం సాధ్యమే అని "మదర్సలాగ్ " అనిపేరుగల 262 పేజీలు గల పుస్తకంలో మదర్ వివరించారు.
27 - 5 - 2017 , శుభోదయం , స్నేహితులకు నమస్కారం
అదృశ్యశక్తి -- మానవదేహం ( I )
---------------------------------------------
శబ్ద తరంగాలు : పరమాత్మ కి గల ప్రకృతి
కి వున్నస్వభావం వల్ల ప్రతి నిమిషం
ఉద్భవిస్తున్నాయి ; ప్రతి వ్యక్తి కి గల
మెదడు లోని : పెద్దమెదడులోవున్న
కొరోనరీ రేడియేటా - నుంచి అదృశ్యంగా
ప్రసారం అవుతున్నాయని భావించాలి.
ప్రకాశ కిరణాలు : పరమాత్మ కు గల పురుష స్వభానం వల్ల ,
ప్రతి వ్యక్తి కి గల
మెదడు లోని పెద్ద మెదడులోవున్న
థెలామస్ కాంతితో ప్రకాశిస్తోంది అని
భావించ వచ్చును .
పురుషుడు - ప్రకృతి : దైవంతో అవిభాజ్యంగా సమ్మేళనం
చెందివున్న మహాశక్తి కి గల రెండు స్వభావాలు -
అని సనాతన ధర్మం బోధించింది .
మహాశక్తి : మదర్ కు గల అవ్యక్తరూపం .Transcendental Form .ప్రతి సామాన్యవ్యక్తి కీ తెలియని అతిమానస చైతన్యం -
( SUPRA- MENTAL CONSCIOISNESS .)
మహేశ్వరి : మదర్ కు గల UNIVERSAL FORM - విరాట్ స్వరూపం . అంతరిక్షం , పంచ మహాభూతాలు , సమస్త జీవరాసులు గల జగత్తు / బ్రహ్మాడం .ఆ జీవరాసులలో సమస్త వ్యక్తులు వున్నారు .
ప్రతి వ్యక్తి కి గల సమస్త దేహం పంచమహాభూతాలు నిర్మించాయి . OVER LIFE . జీవితాన్ని మహేశ్వరి నడిపిస్తుంది .ప్రతి వ్యక్తి కి వున్న వివేకం మహేశ్వరి .
మహాకాళీ - మహాలక్ష్మీ - మహా సరస్వతీ : మదర్ కు గల మహేశ్వరిలో separate గా వున్న మూడు INDIVIDUAL FORMS అవియే .ప్రతి వ్యక్తి దేహంలో గల
HIGHER MIND - VITAL BODY - PHYSICAL BODY . ఊర్ధ్వ మనస్సు - ప్రాణిక - భౌతిక శరీరాలు , మరియు , వాటికి గల : ఇఛ్ఛాశక్తి - జ్ఞాన శక్తి - క్రియా శక్తి .
అవి Spinal cord - వెన్నుపాము లోని 31 జతల నాడులకు జ్ఞానం , శక్తి ప్రసారం చేస్తాయ్ .
28 - 5 - 2017 , శుభోదయం , స్నేహితులకు నమస్కారం
అదృశ్యశక్తి -- మానవదేహం ( K )
---------------------------------------------
సృష్టి క్రమం :
°°°°°°°°°°°°°°
ప్రశ్న : సృష్టి కి మూలం ఎవ్వరు ? పురుష స్వభావమా ? ప్రకృతి స్వభావమా ?
***జవాబు : (1) ఒంటరిగా ఉన్నప్పుడు పురుష స్వభావం సృష్టి చెయ్యలేదు .. . (2) ఒంటరిగా ఉన్నప్పుడు ప్రకృతి స్వభావంకు కూడా సృష్టి చెయ్యటం అసాధ్యం .
(3) పురుష స్వభావం , ప్రకృతి స్వభావం సమ్మేళనం చెందినప్పుడు అంటే ఆ రెండు స్వభావాలు సమపాళ్లలో ఉన్నప్పుడు మాత్రమే నూతన సృష్ఠి జరగటం సాధ్యమవుతుంది .
ప్రతి నిమిషం ఇంటిగ్రల్ యోగం కు సంసిధ్ధమై సహస్రారచక్రంలో గలపూర్ణచంద్రునిలోఉన్న షోడశి నుంచి ప్రసారమవుతున్న ప్రకాశ కిరణాలను వీక్షించుచున్న వ్యక్తులు మాత్రమే నూతన సృష్ఠిని Experience చేస్తారు అని మదర్స్ లాగ్ లో మదర్ వెల్లడించారు .
ఇంటిగ్రల్ యోగం కు ప్రతినిమిషం సంసిద్ధమైన వ్యక్తికి మాత్రమే భౌతిక శరీరంలో వున్న మనస్సు నిశ్శబ్దమై పోతుంది .అందువల్ల సమస్త జీవకణాలలో వున్న పదార్ధం లో సామాన్యంగా వున్న ఎఱుక ( చైతన్యం ) దివ్యమనస్సు గా అభివృద్ధిచెంది స్థూల భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది . . .
అందువల్ల మనస్సు ను Replace చేసి స్థూల భౌతిక శరీరం కు New Ruler గా దివ్యమనస్సు అవుతుంది ; అప్పుడు భౌతికశరీరంతో అతిమానస చైతన్యం
( SUPRA - MENTAL CONSCIOUSNESS ) అవగాహన చేసుకుంటూ , ఆ వ్యక్తి తన పురాతన శరీరంతో NEW PERFECT LIFE ప్రారంభిస్తాడు అని మదర్ విశదీకరించారు .
పరమాత్మ తో అవిభాజ్యంగా సమ్మేళనం చెంది వున్న అదృశ్యశక్తి కి (మహాశక్తి కి ) , మహేశ్వరి అనే నామధేయం గల మూల ప్రకృతి వుంది . మూల ప్రకృతి ఆకారం స్త్రీ రూపం. తనకు సహజంగా వున్నస్వభావం వల్ల ప్రతినిమిషం మహేశ్వరి నుంచి స్వతసిధ్ధంగా అనేక శబ్ద తరంగాలు - ప్రజ్వరిల్లుతున్న అగ్నినుంచి నిప్పురవ్వలు ఉద్భవించినట్లుగా -- ఉద్భవిస్తున్నాయి అని భావించాలి ( సనాతన ధర్మం ).
విష్ణువు సూర్యనారాయణుడు అని , ఆయన విరాట్ స్వరూపం జగత్తు / విశ్వం అని , సూర్యనారాయణుడు వెదజల్లుతున్న ప్రకాశ కిరణాలు ( Sun Rays ) జగన్మాత నారాయణి ( సవితా దేవత )యొక్క విరాట్స్వరూపమని సనాతన ధర్మం బోధించింది .
సూర్యోదయంనుంచి మధ్యాహ్నం వరకూ వున్న సవితా దేవత కిరణాలు గాయత్రీ అని , మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం వున్న సవితా దేవత కిరణాలు సావిత్రి అని , సాయంత్రం వున్న సవితా దేవత కిరణాలు సరస్వతి అని సనాతన ధర్మం బోధించింది .
ప్రతి వ్యక్తి కి గల బ్రహ్మరంధ్రం ద్వారా , మెదడు లోని : పెద్దమెదడులో వున్న కొరోనరీ రేడియేటా కు అవి ప్రసారం అవుతున్నాయి అని కూడా భావించాలి. కానీ సామాన్యమైన వ్యక్తికి అవి వినిపించవు . ప్రతినిమిషం ఇంటిగ్రల్ యోగంకు సంసిద్ధమైవున్న వ్యక్తికి మాత్రమే అవి విని పిస్తాయి అని మదర్ తెలియజేశారు .
ప్రకాశ కిరణాలు :
°°°°°°°°°°°°°°°°°°
పరమాత్మ తో అవిభాజ్యంగా సమ్మేళనం చెందివున్న అదృశ్య శక్తి ( మహాశక్తికి ) , మహేశ్వరి అనే నామధేయం గల మూలప్రకృతి కి సహజంగా గల పురుష స్వభానం వల్ల , ప్రతి వ్యక్తి కి గల మెదడు లోని పెద్దమెదడులోవున్న థెలామాస్ నుంచి కాంతి కిరణాలు ( విద్యుచ్ఛక్తి ) స్వతసిద్ధంగా ఉద్భవిస్తున్నాయి అని భావించ వచ్చును .
కానీ , ఆ కాంతి సామాన్యమైన వ్యక్తికి కనిపించదు . ఇంటిగ్రల్ యోగంకు ప్రతినిమిషం సంసిద్ధమై వున్న వ్యక్తికి మాత్రమే ఆ కాంతి కనిపిస్తుంది అని మదర్ తెలియచేశారు .
కాబట్టి , పురుషుడు - ప్రకృతి : తనలో దైవం వున్న మహాశక్తి కి గల రెండు స్వభావాలు
అని సనాతన ధర్మం బోధించింది .
మహాశక్తి : మదర్ కు గల అవ్యక్త శక్తి .Transcendental Shakti .ప్రతి సామాన్యవ్యక్తి కీ తెలియని అతిమానస చైతన్యం : SUPRA- MENTAL CONSCIOISNES అని శ్రీ అరవిందుడు తెలియజేసెను.
మహేశ్వరి : మదర్ కు గల UNIVERSAL SHAKTI -అని కూడ ; అంటే : విశ్వశక్తి ; మరియు - విరాట్ స్వరూపం -- అంటే : అంతరిక్షం , పంచ మహాభూతాలు , సమస్త జీవరాసులను వ్యక్తం చేస్తున్న జగత్తు / బ్రహ్మాడం . .
జీవరాసులలోనే సమస్త వ్యక్తులు వున్నారు . దైవశక్తి కి గల మూలప్రకృతి యే జగత్తు .
ప్రతి వ్యక్తి కి గల సమస్త దేహం పంచమహాభూతాలు నిర్మించాయి . OVER LIFE (. జీవితాన్ని ) మహేశ్వరి , మెదడు నుంచి ఉద్భవిస్తున్న 12 జతల cranial nerves ద్వారా శ్వాస , రక్తప్రసారం లను ప్రతి సామాన్యవ్యక్తి శరీరంలో యాంత్రికంగా నడిపిస్తోంది .ప్రతి వ్యక్తి కి వున్న వివేకం మహేశ్వరి .
మహాకాళీ - మహాలక్ష్మీ - మహా సరస్వతీ : మదర్ కు గల మహేశ్వరిలో separate గా వున్న మూడు INDIVIDUAL శక్తులు .అవియే .ప్రతి వ్యక్తి దేహంలో గల
HIGHER MIND - VITAL BODY - PHYSICAL BODY . అంటే : ఊర్ధ్వ మనస్సు - ప్రాణిక - భౌతిక శరీరాలు , మరియు , వాటికి గల : ఇఛ్ఛాశక్తి - జ్ఞాన శక్తి - క్రియాశక్తి .
అవి Spinal cord - వెన్నుపాము లోని అసంకల్ప నాడీమండలం ద్వారా జ్ఞానం , శక్తి ప్రసారం చేస్తున్నాయి . 31 జతల నాడులు గల సంకల్ప నాడీ మండలం ద్వారా ధైర్యం , జ్ఞానం , Perfection వ్యక్తం చేస్తూ ప్రతి వ్యక్థి జీవించగల్గటం సాధ్యం అయ్యేట్లు సహాయ పడ్తున్నాయి .
Comments
Post a Comment