Posts

Showing posts from July, 2017

జ్యోతిష్యంలో చతుర్విద పురుషార్ధలు

జ్యోతిష్యంలో చతుర్విద పురుషార్ధలు ధర్మ, కామ త్రికోణాలు రెండు కలిసిన యంత్రం షట్కోణ సుబ్రమణ్యేశ్వర యంత్రం..... రాశి చక్రంలో దర్మ, అర్ధ, కామ, మోక్ష త్రికోణాలనే 4 పురుషార్ధాలు ఉన్నాయి. 1, 5, 9 ధర్మ త్రికోణాలు. 2, 6, 10 అర్ధ త్రికోణాలు, 3, 7, 11 కామ త్రికోణాలు, 4, 8, 12 మోక్ష త్రికోణాలు. ధర్మ త్రికోణాలను కామ త్రికోణాలు ఎదురెదురుగా ఉండి సూటిగా ఖండించుకుంటాయి. ఈ రెండు త్రికోణాలకు సామాన్యంగా పొసగదు. కానీ ఈ రెండిటినీ చక్కగా వినియోగించుకుంటే జీవితం భగవంతుని ఆదేశాలకు (1, 5, 9), ప్రకృతి (3, 7, 11) యొక్క అమరికలకు అనుగుణంగా ఉంటుంది. అప్పుడు మానవుడు భూమ్మీద భగవంతుని ఆదేశాలతో ప్రతిరూపం కాగలడు. పార్వతి పరమేశ్వరుల సంతానం కుమారస్వామి. ఎవరైతే ధర్మ భావాలను (1, 5, 9), కామ భావాలను (3, 7, 11) సరిగా సమన్వయం చేయగలడో వాడు కుమారుని అంశ అవుతాడు. దీనిని సూచిస్తూ ఎదురెదురుగా ఖండించుకుంటున్న రెండు త్రికోణాలు ఉంటాయి. ఊర్ధ్వముఖంగా ఉన్న 1, 5, 9 భావాలు దర్మాత్రికోణాలు, అగ్నితత్వం కలిగి ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ఉంటాయి.(అగ్నిజ్వాల ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ప్రజ్వలిస్తూ ఉంటుంది.) అదోముఖంగా ఉన్న 3, 7, 11 భావాలు కామ త్ర

కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయి. ?

కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయి. ? కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయి. ? కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయో చూద్దాం. 1.భోగలింగము – శృంగేరిలో ఉన్నది 2. వరలింగము – నేపాల్ లో ఉన్నది 3. ముక్తిలింగము – కేదారేశ్వరంలో ఉన్నది. 4.యోగలింగము – కాంచీపురంలో(శ్రీకామకోటి మఠంలో)ఉన్నది. 5.మోక్షలింగము- చిదంబంలో ఉన్నది. ఆదిశంకరులు కైలాసము నుండి తీసుకువచ్చిన అయిదు లింగములు ఇవే.

పంచ ప్రయాగలు

పంచ ప్రయాగలు ప్రయాగ అంటే సంగమం. నదులు సంగంమించే పవిత్ర స్థలం. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు, ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం. కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్లే మార్గంలో పంచప్రయాగలు అని చెప్పబడే అయిదు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అని విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ ఈ ఐదింటిని కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మోక్షప్రదాలనని నమ్మకం. విష్ణు ప్రయాగ :- బదరీనాథ్ నుండి దక్షిణంగా 38 కి.మీ., దూరంలో విష్ణు ప్రయాగ ఉన్నది. విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంతదూరంలో ‘నితి’ అనే లోయ ప్రదేశం ఉంది. ఆ లోయలో ఉన్న కొండశిఖరాల మీద నుండి వాలుగా జారపడిన నీరు, ఒక నదీ ప్రవాహంగా మారి దౌలి గంగ (ధవళ గంగ) అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది. విష్ణుమూర్థి వీర నారాయణ రూపం ధరించి, తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ, ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి, తపస్సు చేశాడట. అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. అందులోని దైవం శ్రీ మహావిష్ణువు. నంద ప్రయాగ:- బదరీనాథ్ నుండి సుమారు 106 క

❤ !! నారాయణ స్తోత్రం !! ❤

❤   !!  నారాయణ స్తోత్రం  !!    ❤       నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ నవ నీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణ యమునా తీర విహార ధృతకౌస్తుభ మణి హార నారాయణ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ మంజుల గుంజాభూష మాయ మానుష వేష నారాయణ రాధధరమధురసిక రజనికరకులతిలక నారాయణ మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ వారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీరమణ నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే జలరుహదలనిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ పాతకరాజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ అఘబకక్షయ కంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ హాటక నిభ పీతాంబర అభయం కురు మే మావార నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే దశరథ రాజకుమార దానవ మద సంహార నారాయణ గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ సరయూ తీర విహార సజ్జన రుషిమందార నారాయణ విశ్వామిత్ర ముఖత్ర వివిధ పరాసుచరిత్ర నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ జనకసుతాప

స్వర్గం వద్దన్న ముని కథ!

స్వర్గం వద్దన్న ముని కథ! భగవంతుని నమ్మేవారు చాలామంది స్వర్గనరకాలను కూడా నమ్ముతారు. కానీ స్వర్గంలో సర్వసుఖాలను అనుభవించాలనుకోవడం కూడా ఒక కోరికే కదా! కోరిక అనేది ఉన్నప్పుడు దానికీ మంచిచెడులు ఉంటాయి కదా! అందుకని స్వర్గాన్ని సైతం కాదనుకున్న ముద్గలుడనే రుషి కథ వినితీరాల్సిందే! పూర్వం ముద్గలుడనే బ్రాహ్మణుడు ఉండేవారు. పొలంలో మిగిలిన వడ్ల గింజలను ఏరుకుంటూ, ఎవరన్నా దాతలు ధాన్యాన్ని దానం చేస్తే స్వీకరిస్తూ అతను కాలం గడిపేవాడు. ముద్గలుడు పేదవాడే కావచ్చు. కానీ సత్యాన్నే నమ్ముకున్న నీతపరుడు. లేనివాడే కావచ్చు, కానీ తనకి ఉన్నదాన్ని అతిథులతో పంచుకునే ఉదారహృదయుడు. పైగా ముద్గలుడు పక్షపవాసం అనే వ్రతాన్ని చేసేవాడు. అంటే పాడ్యమి నుంచి చతుర్దశి వరకూ ఉపవాసం ఉండి అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో మాత్రమే ఆహారాన్ని భుజించేవాడు. ముద్గలుని సత్యనిష్ట నానాటికీ ముల్లోకాలలోనూ వ్యాపించసాగింది. సాక్షాత్తు దుర్వాసమహర్షే, ముద్గలుని సంకల్పం ఎంత దృఢమైనదో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని ఒక యాచకుని వేషంలో ముద్గలుని ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు ముద్గలుడు ఉపవాస దీక్షని విరమించి భోజనం చేసే సమయం. ముద్గలుడు ఆహారాన్ని ఇలా చేతిలోకి త

గురుపూర్ణిమా సందేశం

గురుపూర్ణిమా సందేశం గురుపూర్ణమ అనగా........ ఆషాడపూర్ణిమ మహాపవిత్రమైన పర్వదినం. ఆషాడ పౌర్ణమిని గురు పూర్ణిమ అనికూడా పిలుస్తారు ఈ రోజు గురు పూజా మహోత్సవం చేయడం దేశమంతా పరిపాటి. ఇది ఆధ్యాత్మిక విషయాలకు అన్నిటికి సంవత్సర ఆరంభం. అందుకే సాధకులందరికి మహా పర్వకాలం. సాధు, సన్యాసులు, పీఠాధిపతులు రాబోయే నాలుగునెలలూ జపద్యానాలు దీక్షగా ‘చాతుర్మాసదీక్ష’  చెయాలన్నది నియమం. సంవత్సరంలో మిగిలిన సమయాన్ని సంచారానికి ఉపయోగించినా తమ ఆధ్యాత్మిక సాధనకు ఈ నాల్గు నెలలూ ఉపయోగించాలి. ఈనాలుగు మాసాల దీక్షలో విధిగా గురువు యొక్క ఉపాసన చేస్తారు. గురువు తనకేదైతే ఉపదేశించారో అది నిష్టగా సాధనగా చేసేకాలానికి ‘గురుపూజ’తో ప్రారంభించే రోజు ఈ ‘గురుపూర్ణిమ’. వేద విభాగం చేసి ప్రతివారికి ఉపనయన సాంప్రదాయాన్ని గాయత్రీ మంత్రాన్ని తన వేదశాఖను స్మరించే విధిని ఏర్పరిచిన వారు - శ్రీ మహా విష్ణువు అంశతో జన్మించిన వేదవ్యాస మహర్షి. ఆదిగురువైన వ్యాసుల వారి పుట్టిన రోజైన కారణంగా ఈ గురుపూర్ణిమను ‘వ్యాసపూర్ణిమ’ అని కూడా పిలుస్తారు. శంకర, రామానుజ, మద్వా చార్య వంటి గురువులకు కూడా గురువు మరియు ఉపనయన దీక్ష, చాతుర్మాస దీక్ష, పూజ, గురు ఉపాసన ఇచ్చి