51.మన్వంతరము

 51. మన్వంతరము


పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.


భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.విషయ సూచిక [దాచు] 
1 మన్వంతరాల పేర్లు
2 ఎన్నెన్ని సంవత్సరాలు?
3 ముఖ్య సంఘటనలు 
3.1 స్వాయంభువ మన్వంతరము
3.2 స్వారోచిష మన్వంతరము
3.3 ఉత్తమ మన్వంతరము
3.4 తామస మన్వంతరము
3.5 రైవత మన్వంతరము
3.6 చాక్షుష మన్వంతరము
3.7 వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
3.8 (సూర్య) సావర్ణి మన్వంతరము
3.9 దక్షసావర్ణి మన్వంతరము
3.10 బ్రహ్మసావర్ణి మన్వంతరము
3.11 ధర్మసావర్ణి మన్వంతరము
3.12 భద్రసావర్ణి మన్వంతరము
3.13 దేవసావర్ణి మన్వంతరము
3.14 ఇంద్రసావర్ణి మన్వంతరము


మన్వంతరాల పేర్లు
స్వాయంభువ మన్వంతరము
స్వారోచిష మన్వంతరము
ఉత్తమ మన్వంతరము
తామస మన్వంతరము
రైవత మన్వంతరము
చాక్షుష మన్వంతరము
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
సూర్యసావర్ణి మన్వంతరము
దక్షసావర్ణి మన్వంతరము
బ్రహ్మసావర్ణి మన్వంతరము
ధర్మసావర్ణి మన్వంతరము
భద్రసావర్ణి మన్వంతరము
దేవసావర్ణి మన్వంతరము
ఇంద్రసావర్ణి మన్వంతరమ
ఎన్నెన్ని సంవత్సరాలు?


దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.


కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)


ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.


కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక రాత్రి 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక దివారాత్రము (ఒక రోజు) 864,00,00,000 2,40,00,000
బ్రహ్మకు ఒక సంవత్సరము 311040,00,00,000 864,00,00,000


ముఖ్య సంఘటనలు


వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు


స్వాయంభువ మన్వంతరము
మనువు - స్వాయంభువు.
భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది వడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.
మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు
సప్తర్షులు - మరీచి ప్రముఖులు
ఇంద్రుడు - యజ్ఞుడు
సురలు - యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.


స్వారోచిష మన్వంతరము
మనువు - అగ్ని కొడుకు స్వారోచిషుడు.
మనువు పుత్రులు - ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు
భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు - ఊర్జస్తంభాదులు
ఇంద్రుడు - రోచనుడు
సురలు - తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము


ఉత్తమ మన్వంతరము
మనువు - ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
మనువు పుత్రులు - భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
ఇంద్రుడు - సత్యజితుడు
సురలు - సత్యదేవ శృతభద్రులు


తామస మన్వంతరము
మనువు - ఉత్తముని సోదరుడు తామసుడు.
మనువు పుత్రులు - వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు - జ్యోతిర్వ్యోమాదులు
ఇంద్రుడు - త్రిశిఖుడు
సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)


రైవత మన్వంతరము
మనువు - తామసుని సోదరుడు రైవతుడు
మనువు పుత్రులు - అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు - హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
ఇంద్రుడు - విభుడు
సురలు - భూత దయాదులు


చాక్షుష మన్వంతరము
మనువు - చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
మనువు పుత్రులు - పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడు
సురలు - ఆప్యాదులు


వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము


ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
మనువు - వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - పురందరుడు
సురలు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు


ఈ మన్వన్తరములొ పరసురామ , రామావతారము,బలరాముని అవతారము,క్రిష్నుని అవతారము, బుద్ద అవతారము జరిగినవి మరియు కల్కి అవతరిస్తారు.


(సూర్య) సావర్ణి మన్వంతరము


రాబోయే మన్వంతరము
మనువు - సావర్ణి - విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
మనువు పుత్రులు - నిర్మోహ విరజస్కాదులు
భగవంతుని అవతారాలు - సార్వభౌముడు - వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
సప్తర్షులు - గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, ఋష్యశృంగుడు, బాదరాయణుడు (వీరందరూ ఇప్పుడు ఆత్మయోగనిష్ఠులై తమతమ ఆశ్రమాలలో ఉన్నారు)
ఇంద్రుడు - విరోచన సుతుడైన బలి
సురలు - సుతపసులు, విజులు, అమృత ప్రభులు


దక్షసావర్ణి మన్వంతరము
మనువు - వరుణుని పుత్రుడు దక్ష సావర్ణి
మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
సప్తర్షులు - ద్యుతిమంతాదులు
ఇంద్రుడు - అద్భుతుడు
సురలు - పరమరీచి గర్గాదులు


బ్రహ్మసావర్ణి మన్వంతరము
మనువు - ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు - భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
సప్తర్షులు - హవిష్మంతుడు మున్నగువారు
ఇంద్రుడు - శంభుడు
సురలు - విభుదాదులు


ధర్మసావర్ణి మన్వంతరము
మనువు - ధర్మసావర్ణి
మనువు పుత్రులు - సత్య ధర్మాదులు పదిమంది.
భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
సప్తర్షులు - అరుణాదులు
ఇంద్రుడు - వైధృతుడు
సురలు - విహంగమాదులు


భద్రసావర్ణి మన్వంతరము
మనువు - భద్ర సావర్ణి
మనువు పుత్రులు - దేవసుతాదులు
భగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
సప్తర్షులు - తపోమూర్త్యాదులు
ఇంద్రుడు - ఋతధాముడు
సురలు - పరితారులు


దేవసావర్ణి మన్వంతరము
మనువు - దేవసావర్ణి
మనువు పుత్రులు - విచిత్ర సేనాదులు
భగవంతుని అవతారాలు - దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
సప్తర్షులు - నిర్మోహ తత్వదర్శనాదులు
ఇంద్రుడు - దివస్పతి
సురలు - సుకర్మాదులు


ఇంద్రసావర్ణి మన్వంతరము
మనువు - ఇంద్ర సావర్ణి
మనువు పుత్రులు - గంభీరాదులు
భగవంతుని అవతారాలు - సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
సప్తర్షులు - అగ్నిబాహ్యాదులు
ఇంద్రుడు - శుచి
సురలు - పవిత్రాదుల


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: