2018 నిఘాయే రక్షాక
మహా విధ్వంసానికి ఉగ్రమూకలు సన్నద్ధమవుతున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో- రెప్పవాల్చని నిఘాయే రక్షాకవచమవుతుంది!
ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల దేశాలు ఉగ్రదాడులకు గురవుతున్నాయని మూడు నెలల నాటి అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది.
పాకిస్థాన్- అటు అఫ్గానిస్థాన్‌లోనూ, ఇటు ఇండియాలోనూ ఉగ్రమూకల మృత్యుహేలకు బాసటగా నిలుస్తోంది.
కీలక సరిహద్దుల్లో జమ్మూకాశ్మీర్‌పై ఉగ్రనాగులు భయానకంగా కోర చాస్తున్నాయి.
జమ్ము సరిహద్దుల్లో సుంజువాన్ సైనిక స్థావరం మీద, శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్ శిబిరంపైనా దాడులకు తెగబడింది తామేనని లష్కరే తొయిబా ప్రకటించుకొంది. నిరుడు ఆగస్టులోనే అధీనరేఖ దాటివచ్చిన పాక్ ముష్కరులు స్థానిక శక్తుల తోడ్పాటుతోనే ఇంతకాలం మాటువేసి తాజాగా దాడికి తెగబడ్డారని జాతీయ నిఘా సంస్థ స్పష్టీకరిస్తోంది.
తాలిబన్, బోకోహరామ్, ఐసిస్, అల్‌ఖైదా, జమాతుద్ దవా... ఇలా నామధేయాల మార్పేగాని అమాయక జనహననంలో, ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసంలో అన్నింటిదీ ఒకటే పంథా!
Comments
Post a Comment