20-21 C1 కామాక్షి చంద్రశేఖర స్వామి కాలండర్ గరుడపురాణం
గరుడపురాణం తప్పు దాగదు లెక్క తప్పదు! న్నే...నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా...ఏం చేసినా ఫర్వాలేదులే అనుకుంటే కుదరదు...ప్రతి పనికీ ఓ లెక్క ఉంటుంది... దానికి ఫలితం ఉంటుంది...ఎందుకంటే మనిషి సంఘజీవి. అందరితో, అన్ని ప్రాణులతో సహజీవనం సాగించాలి. ఈ క్రమంలో నియమబద్ధమైన జీవితమే సదా అనుసరణీయం... అలా జీవించడాన్నే క్రమశిక్షణ అంటాం. ఆ గీతను దాటడమే అనేక సమస్యలకు మూలకారణం. అలా చేయడం అనేకమంది జీవితాలకు శాపం అవుతుంది. దాన్నే పాపం అంటారు. అలా ఈ లోకంలో చేసే పాపాలకు పరలోకంలో శిక్షలుంటాయని దాదాపు అన్ని ధర్మశాస్త్రాలూ చెబుతాయి. ఇక్కడ మనిషి చేసే పొరపాట్లేంటి...దానికి యమలోకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారనే విషయాన్ని గరుడ పురాణం చర్చిస్తుంది. ఈ పురాణం మరణం తర్వాత శిక్షల గురించి వివరించినా... పరోక్షంగా క్రమశిక్షణను ఉద్బోధిస్తుంది. నైతికతను, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. సంఘ జీవిగా నువ్వేం చేయాలో, ఎలా జీవించాలో వివరిస్తుంది. అందుకే అది జీవన వికాస పురాణంగా భావించవచ్చు. గరుడ పురాణం చెప్పేదిదే... గరుడ పురాణం చదవవచ్చా? గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని... చదవ కూడదన...