Posts

Showing posts from July, 2020

పుణ్య తిధులు🙏

పుణ్య తిధులు🙏 మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికి సంబందించిన తిధులు, వాటి ప్రత్యేకత, ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించ బడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాడి విశేషాల గురించి భూదేవి కి వివరించారు. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 తిధులు వాటి విశిష్టత : పాడ్యమి :🌛🌛 దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి, ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. విదియ :🌜 అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధి నాడు పుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం. తదియ 🌜: గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీ ల కోసం ఏర్పాటు అయినది. చవితి:🌝 వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు. పంచమి:🌙 పంచమి నాడు నాగులు

*_ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు

*_ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు :_*   *Vivekananda :* 👌🏿 నిశ్శబ్దముగా  వుండు ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి. *Shakespeare :* 👌🏿 ఇతరుల భావాలతో ఆటలాడకు.. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. *Napoleon :* 👌🏿 ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది దానికి గల కారణం  అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం *Einstein :* 👌🏿 నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను *Abraham Lincoln :* 👌🏿 నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైనవాడివని అర్ధం *Chralie Chaplin :* 👌🏿 నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో బాధలు వుండవు అని అనుకోవద్దు వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే ఆ విధంగా తారసపడతారు *William Arthur :*  👌🏿 అవకాశాలు సూర్యకిరణాలు వంటివి అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి  ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు *Hitle

Siva Maha Puranam -- 37

Sri Siva Maha Puranam -- 37 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu సాక్షాత్తు పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకమాట అన్నాడు. ‘పార్వతీ నన్ను ఎందఱో స్తోత్రం చేశారు. నన్ను స్తోత్రం చేయని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా! అందరూ స్తోత్రం చేసిన వారే. కానీ ఒక ప్రత్యేకమయిన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు. ఆ చేయబడిన స్తుతిలో ఒక్క శ్లోకం గాని, అర్థ శ్లోకం గాని ఒక పాదం కాని, అవేమీ రాకపోతే ఒక మాట కానీ అదీ రాకపోతే అది వినడం కానీ చేసిన వారికి నేను నా అనుగ్రహమును వర్షిస్తాను’ అని చెప్పాడు. ఈవిషయం మహానుభావుడు పోతనగారు వీరభద్ర విజయంలో చెప్పారు. ఒకానొకప్పుడు దేవతలు దానవులు అమృతోత్పాదనం చేయాలనీ క్షీరసాగర మథనం చేశారు. మందర పర్వతమును తీసుకు వెళ్ళి పాలసముద్రంలో దించారు. దానికి వాసుకి అనబడే పామును చుట్టారు. దానిని దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకుని తిప్పుతున్నారు. యథార్థమునకు ఇదంతా ధ్యాన సంబంధమయిన విషయం. లోపల మనస్సును తిప్పినప్పుడు వచ్చే స్థితియందు ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలి అన్నది దీనిద్వారా తెలియజేయబడుతుంది. ఆ మందర పర్వతం క్రిందిక

ఈశ్వరుడు ఇచ్చిన సంపద.....*

*Spiritual Seekers 🙏* *ఈశ్వరుడు ఇచ్చిన సంపద.....* ఈ ప్రకృతి యావత్తు ఈశ్వరుడు ఇచ్చిన సంపదే. ప్రకృతిలో ఏమున్నాయి... భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే "పంచభూతాలు" ఉన్నాయి. ఇంకా వృక్షాలు, జంతువులు, పర్వతాలు, నదులు, సముద్రాలు, సూర్యచంద్రులు.. ఈ మొత్తం ప్రకృతి సంపదయే. దీనిని ఇచ్చింది భగవంతుడేగాని ఏ సైంటిస్ట్ స్వయంగా తయారు చేయలేదు. వీటన్నింటిని ఎందుకు ఇచ్చినట్లు... 1) భూమి... భూమి మనకు ఆధారంగా ఉంటున్నది. కూర్చోటానికి, నిలుచోటానికి, ప్రయాణం చేయటానికి, ఇళ్ళు కట్టుకొని నివాసం ఉండటానికి ఈ భూమియే ఆధారం. ఇంకా భూమి నుండే మనం తినే ఆహారం వస్తున్నది. సస్యాలు, కాయకూరలు, పండ్లు మొదలైనవి వన్నీ వస్తున్నవి. భూమి నుండే ఖనిజాలు వస్తున్నాయి. ఇవన్నీ మానవుడు ఉపయోగింకుంటున్నాడు. 2) నీరు... నీరు మానవుడికి, ఇతర ప్రాణులకు దప్పికదీరుస్తున్నది. ఈ నీరే చెట్లకు కూడా కావాలి. మానవ మనుగడకు నీరు ఎంతో అవసరం. 3) అగ్ని... ఆహారాన్ని పచనం చేయటానికి అగ్ని అవసరం. అలాగే మన శరీరంలో 98.4F అగ్ని ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేది. అగ్ని లేకపోతే - శరీరం చల్లబడితే కట్టె అయిపోతుంది. 4) వాయువు... ముఖ్యంగా ప్రాణికోటి జీవన

తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం

*ఉదయం ఎరుపు,* *మధ్యాహ్నం నలుపు,* *సాయంత్రం తెలుపు* *రంగులోకి మారుతున్న శివలింగం* మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది.వీకెండ్ ట్రిప్ లకై బెంగళూరు నుండి వచ్చేవారికి ఈ ప్రదేశం తప్పక నచ్చుతుంది. బెంగళూరు నుండి 140 కి. మీ ల దూరంలో, మైసూర్ నుండి 50 కి. మీ ల దూరంలో తలకాడు ఉంది. మీరు తలకాడు లో ప్రవేశించగానే అక్కడ ప్రవహించే కావేరి నది, చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే నదీ తీరమా ? లేక బీచా ? అని అనిపిస్తుంది. తలకాడు ఐదు ప్రఖ్యాత శివాలయాలకు ప్రసిద్ధి చెందినది. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. ఈ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ మరో ఆలయం - విష్ణు భగవానుడి ఆలయం. దీనిని స్థానికులు 'కీర్తినాధేశ్వర' ఆలయం పేరుతో పిలుస్తారు. ఈ రోజు మనం పాతాళేశ్వర ఆలయం విశేషాలేంటో తెలుసు

హయగ్రీవుడు

Image
హయగ్రీవుడు   విద్యకు అధిపతి హయగ్రీవుడు సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతా రాల్లో 'హయగ్రీవావతారం' ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ... బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలి నవారి చేతిలో మాత్రమే తన కి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు. దాంతో దేవత లంతా ఆది దంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల ... శరీరం నుంచి వేరై పోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్ప