శని రాహు (శపిత) యోగం - ఫలితాలు
శని రాహు (శపిత) యోగం - ఫలితాలు జాతకంలో శని రాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్పదోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపితయోగం అని అంటారు. కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు. కొంతమంది నిష్టాపరులైన జోస్యులు అయితే, ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి, ఆ జాతకునితో మాట్లాడటానికీ కూడా ఇష్టపడరు. గోచారరీత్యా శని రాహువులిద్దరూ ఒకే రాశిలో కలసినప్పుడు కూడా లోకానికి ఇదే దోషం ఏర్పడుతుంది. వీరిద్దరి పరస్పర వేగాలలో తేడాలవల్ల అలా కలవడం ఎప్పుడో కాని జరగదు. సామాన్యంగా అలా శని రాహువులు ఒకే రాశిలో కలవడానికి దాదాపు 11 లేదా 12 ఏళ్ళు పడుతుంది. కాని అలా కలిసినప్పుడు మాత్రం లోకంలో చాలా ఘోరాలు జరుగుతాయి. అలా కలిసిన రాశులను బట్టి కొన్ని దేశాలు, కొందరు మనుషులు, కొన్ని కొన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితము లౌతాయి. శని రాహువులు కలిసి ఉన్న సమయంలో పుట్టిన జాతకాలలో ఈ యోగం ఆయా లగ్నాలను బట్టి, ఇతర గ్రహస్తితులను బట్టి రకరకాలుగా ప్రతిఫలిస్తుంది. ఆయా జాతకులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాలసర్ప యోగం ఎంత బాధపెడుతుందో ఈ యోగమూ అంతకంటే ఎక్కువ బాధ పెడుతుంది. అయితే అది బాధించే తీరూ ఇది బాధించే తీరూ వేర్వేరుగా ఉంటాయి. కా...