పుష్కరాంశ
పుష్కరాంశ "పుష్కరాంశ" ఈ పదం ప్రతి హిందూ ఆలయ,విగ్రహ,వివాహ అహ్వాన పత్రిక యందు ,అన్ని శుభ ముహూర్తాలయందు ఉంటుంది. ఉదా:-స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్ట నవమీ గురువారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ యందు అనగా 23-6-1988నస్వామి వారల పునః ప్రతిస్టా మహోత్సవం. ముహూర్త దర్పణం,విద్యమాధవీయం,కాలామృతం అను జ్యోతిష్య ముహూర్త గ్రంధాలలో పుష్కరాంశ ప్రస్తావన కలదు.పుష్కరాంశ అనగా పవిత్రత అని అర్ధం.పుష్కరాంశ శుభత్వాన్ని సూచిస్తుంది. పుష్కరాంశ అనగా ఒక రాశిలో 1 నవాంశ అనగా 3° 20¹ నిడివి. వీటిని ప్రతి రాశిలోని పుష్కరాంశ భాగాలు లేక డిగ్రీలు అంటారు.గ్రహం పుష్కర భాగాలలో వచ్చినప్పుడు అది పుష్కర భాగం అంటారు. ఒకొక్క రాశిలో తొమ్మిది నవాంశలు ఉంటాయి.శుభగ్రహ ఆధిపత్య అంశలు వున్న సమయాన్ని ‘పుష్కరాంశ’ అంటారు. ముహూర్తం కూడా లగ్నంలో మంచి శుభ గ్రహాల ఆధిపత్యం వున్న నవాంశలో నడిచే సమయమునకే ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కో లగ్నంలో తొమ్మిది నవాంశలు ఉంటాయి. అందులో శుభ గ్రహాల ఆధిపత్యం ఉన్న నవాంశల కాలంతో కూడిన లగ్నము సుముహూర్తంగా పరిగణిస్తారు. ఏకవంశతి దోషాలలో ‘కునవాంశ’ అని ఒక దోషం చెప్పారు. అంటే మనం పెట్...