శ్రీ అరుణగిరి ప్రదక్షిణ వైభవము
శ్రీ అరుణగిరి ప్రదక్షిణ వైభవము అరుణాచల దివ్యక్షేత్రమునకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము "గిరి ప్రదక్షిణము". అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి, అంత్యమున శివలోక ప్రాప్తి కలుగును. ఈ పర్వతము సమస్త భోగములకు నిలయము. దీనిపై ఎన్నో గ్రుహలు యున్నవి. వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపము చేసికొనుచున్నారు. ఈ గిరి హిమాలయముల కన్నాప్రాచీనమైనది మరియు కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందువలననగా కైలాసము - శివుని నివాసము అరుణాచలము - సాక్షాత్తు శివుడు ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని కృత్తర్థులను చేసినది. ఈ పర్వతము చుట్టూ ఇరువది అయిదు మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడును. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా నియమములు లేవు. ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము. "యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే" అని స్కాందపురాణము వర్ణించినది అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరముల యందు చేసిన పాపములు గూడా గిరి ప్రదక్షిణ వలన నశించును. స్కాందపురాణము "గిరి ప్రదక్షిణ" వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది. గిరి ప్రదక్ష...